Latest

 డిజిటలైజ్ అవుతున్న జర్మన్ల  లవ్ స్టోరీస్..
World· 5 Jun 2026

డిజిటలైజ్ అవుతున్న జర్మన్ల లవ్ స్టోరీస్..

చరిత్రలోని 1700ల నాటి నుండి ఉన్న దాదాపు 60,000 ప్రేమ లేఖలను డిజిటలైజ్ చేసేందుకు జర్మనీలోని కోబ్లెంజ్ యూనివర్సిటీ పరిశోధకులు, వాలంటీర్లు నడుం బిగించారు. ఇదొక పెద్ద ‘సిటిజన్ సైన్స్’ ప్రాజెక్ట్. కాలంతో పాటు భాష, సమాజం, ప్రేమ ఎలా మారాయో తెలుసుకోవడమే దీని లక్ష్యం.ఎమోజీలు, వాట్సాప్ చాటింగుల ఈ కాలంలో.. పాత తరం నాటి ముద్దుల గుర్తులు, ఎండిపోయిన పువ్వులతో ఉన్న ఈ అసలైన ప్రేమ లేఖలను భద్రపరచడం నిజంగా గ్రేట్ కదా!

చిన్నారిపై రోబో దాడి!▶
Viral· 5 Jun 2026

చిన్నారిపై రోబో దాడి!

చైనాలోని ఒక ఎగ్జిబిషన్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఒక హ్యూమనాయిడ్ రోబో. సడన్‌గా కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చిన్నారి కడుపులో బలంగా తన్నింది. ఆ దెబ్బకు బాలుడు నొప్పితో అక్కడే కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన అధికారులు బాబుకి ఫస్ట్ ఎయిడ్ చేశారు, ప్రజెంట్ బాబు సేఫ్ గానే ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

ప్రకాష్ రాజ్‌కు నటి హేమ కౌంటర్!▶
Politics· 5 Jun 2026

ప్రకాష్ రాజ్‌కు నటి హేమ కౌంటర్!

పవన్ కళ్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ‘దొర’ అని పిలవడంపై నటి హేమ రియాక్ట్ అయ్యారు. ఆ మాటలో క్లియర్ గా వెటకారం కనిపిస్తోందని, తెలంగాణలో ఆ వర్డ్ ని ఏ ఉద్దేశంతో వాడుతారో మీకు తెలియనిది కాదన్నారు. పవన్ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయొద్దని, ఆయన గురుంచి కోట్లాది మందికి తెలుసని చెప్పారు. మీరు బాగా చదువుతారు కదా. పాస్ట్‌లో ఇలా విమర్శించిన వాళ్లు ఏమైపోయారో ఒక్కసారి చరిత్ర చదివి తెలుసుకోండి అంటూ ప్రకాష్ రాజ్‌కు హేమ కౌంటర్ ఇచ్చారు.

 ఓల్డేజ్ లుక్ కి ఇలా గుడ్ బై కొట్టేయ్యండి !
Health· 5 Jun 2026

ఓల్డేజ్ లుక్ కి ఇలా గుడ్ బై కొట్టేయ్యండి !

వయసు పైబడినట్లు కనిపించడానికి యాంటీ ఏజింగ్ క్రీములు, పిల్స్ వాడటం కంటే సరైన నిద్ర పోవడం చాలా ముఖ్యం. పరిశోధనల ప్రకారం.. రోజూ 6.5 నుండి 7.5 గంటల నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్ర తగ్గినా లేదా ఎక్కువైనా త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెల్తీగా, యంగ్‌గా ఉండాలంటే నిద్రతో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి!

ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!▶
Politics· 5 Jun 2026

ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!

త్వరలో కొత్త పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసిన అన్నామలై, తాజాగా తన నెక్స్ట్ ప్లాన్‌ను రివీల్ చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ లీడర్లను, కార్యకర్తలను ప్రిపేర్ చేయబోతున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఇలా స్పీడ్ పెంచడం.. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్‌లో చర్చకు దారి తీసింది.

భూమిని కాపాడుకుందామంటే.. ఇప్పుడే స్టార్ట్ చేయండి
General· 5 Jun 2026

భూమిని కాపాడుకుందామంటే.. ఇప్పుడే స్టార్ట్ చేయండి

ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాది రిపబ్లిక్ ఆఫ్ అజర్ బైజాన్ పర్యావరణ పరిరక్షణ ప్రోగ్రామ్స్ ని #NowForClimate నినాదంతో హోస్ట్ చేస్తోంది. రెస్సాన్పిబుల్ సిటిజన్స్ గా మనం ఏం చేయాలంటే.. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కని నాటాలి, టెర్రస్ గార్డెనింగ్ కూడా చేయాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేసి క్లాత్ బ్యాగ్స్ వాడాలి. రోజూ వారీ వాడకంలో నీటివృథాని అరికట్టాలి.. అనవసరంగా లైట్లు, ఫ్యాన్లు వేయకుండా విద్యుత్ ని ఆదా చేయాలి . చిన్న చిన్న దూరాలకి బైక్ లు, కారులు వాడకుండా నడవడం లేదంటే సైకిల్ మీద వెళ్లాలి

ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!▶
Politics· 5 Jun 2026

ఎన్నికల బరిలోకి అన్నామలై కొత్త పార్టీ!

త్వరలో కొత్త పొలిటికల్ పార్టీని పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేసిన అన్నామలై, వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో తన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ లీడర్లను, కార్యకర్తలను ప్రిపేర్ చేస్తాను అని చెప్పారు. BJPకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన ఇలా స్పీడ్ పెంచడం తమిళనాడు పాలిటిక్స్‌లో చర్చకు దారి తీసింది.

CM విజయ్ ఫస్ట్ కేబినెట్ విజువల్స్ వైరల్!▶
Politics· 5 Jun 2026

CM విజయ్ ఫస్ట్ కేబినెట్ విజువల్స్ వైరల్!

తమిళనాడు పాలిటిక్స్‌లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. సీఎం విజయ్ అధ్యక్షతన తొలి కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆయన సీఎం అయిన తర్వాత లీడ్ చేసిన ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఇదే కావడంతో.. దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలు, రాష్ట్ర డెవలప్‌మెంట్‌పై ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ ఫస్ట్ కేబినెట్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సీడ్ బాల్స్ చేసిన పవన్ కళ్యాణ్!▶
General· 5 Jun 2026

సీడ్ బాల్స్ చేసిన పవన్ కళ్యాణ్!

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పర్యావరణం కోసం ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా ఆయన స్వయంగా తన చేతులతో ‘సీడ్ బాల్స్’ (విత్తనపు బంతులు) రెడీ చేశారు. పచ్చదనాన్ని పెంచడానికి, అడవులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇలాంటి గ్రీన్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డిప్యూటీ CM స్వయంగా కూర్చుని సీడ్ బాల్స్ చేస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కొత్త పొలిటికల్ పార్టీ వైపు అన్నామలై అడుగులు!▶
Politics· 5 Jun 2026

కొత్త పొలిటికల్ పార్టీ వైపు అన్నామలై అడుగులు!

BJPకి రిజైన్ చేసిన తమిళనాడు లీడర్ అన్నామలై. తన నెక్స్ట్ పొలిటికల్ చాప్టర్‌ను అనౌన్స్ చేశారు. పార్టీకి రిజైన్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త మూవ్‌మెంట్‌తో తమిళనాడు పాలిటిక్స్‌లో అన్నామలై ఎలాంటి చేంజ్ తీసుకురాబోతున్నారో అని అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అతను పెట్టబోయే పార్టీకి 'తమిళగ మక్కల్ కళగం' లేదా 'తమిళగ మక్కల్ కట్చి' అనే పేర్లు పెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్లాస్టిక్ వేస్ట్‌తో నెలకు ₹50K ఇన్‌కమ్!
Business· 5 Jun 2026

ప్లాస్టిక్ వేస్ట్‌తో నెలకు ₹50K ఇన్‌కమ్!

ప్లాస్టిక్ వేస్ట్‌ని రీసైకిల్ చేస్తూ తెలంగాణలోని సూర్యాపేట, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సూపర్ రికార్డ్ క్రియేట్ చేశాయి. సూర్యాపేటలో రోజూ టన్ను ప్లాస్టిక్ కలెక్ట్ చేసి. దాంతో టైల్స్, ఇటుకలు తయారు చేస్తూ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు. అటు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంకులు పెట్టించడంతో ప్లాస్టిక్ వాడకం తగ్గింది. అక్కడ వేస్ట్ బాటిల్స్‌తో ఏకంగా ఒక భారీ హెలికాప్టర్ బొమ్మను రెడీ చేశారు. ఈ గ్రేట్ వర్క్‌కి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ‘ఉత్తమ పర్యావరణ అవార్డు’ కూడా అనౌన్స్ చేసింది.

సైకిల్ రైడ్‌తో CM చంద్రబాబు స్పెషల్ మెసేజ్!▶
News· 5 Jun 2026

సైకిల్ రైడ్‌తో CM చంద్రబాబు స్పెషల్ మెసేజ్!

వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా AP CM చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ తొక్కారు. ఎన్విరాన్‌మెంట్ ని కాపాడుకోవాలనే మెసేజ్ ఇస్తూ ఆయన ఈ రైడ్‌లో పాల్గొన్నారు. సిఎం సైకిల్ తొక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రాజ్యాంగం మీదే భారం వేసి ఇండియాకు వస్తున్నా!
Politics· 5 Jun 2026

రాజ్యాంగం మీదే భారం వేసి ఇండియాకు వస్తున్నా!

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇండియాకు రిటర్న్ వస్తున్నారు. "నేను ఇండియాకు వస్తున్నాను. నా తలరాతను కాన్‌స్టిట్యూషన్ చేతుల్లో పెడుతున్నాను" అంటూ ఆయన ట్విట్టర్ (X) లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘#JaiBhim’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మమత రెబెల్ వర్గంలో చిచ్చు
Politics· 5 Jun 2026

మమత రెబెల్ వర్గంలో చిచ్చు

పశ్చిమబెంగాల్‌లో TMC రెబెల్ వర్గంలో కొత్త వివాదం మొదలైంది. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ మమతని కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "మమతే మా సుప్రీం లీడర్. ఆమెను సలహాలకే పరిమితం చేస్తే మేం ఈ వర్గంలో ఉండం" అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీఎంసీలో 80 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు మమతని ఎదిరించారు. వారి వెనుక బీజేపీ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో అసమ్మతి ఎమ్మెల్యేల్లో విభేదాలు బయటపడడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది

బీజేపీకి అన్నామలై గుడ్‌బై..
Politics· 5 Jun 2026

బీజేపీకి అన్నామలై గుడ్‌బై..

తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ షాకింగ్ నిర్ణయం వెలువడింది. అన్నామలై రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటుకే పరిమితం కావడం, అన్నామలైకి టిక్కెట్ కూడా దక్కకపోవడంతో ఆయన రిజైన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం అన్నామలై మీడియాతో మాట్లాడతారు. అప్పుడే ఆయన భవిష్యత్ పై ఒక స్పష్టత వస్తుంది.

 DEOగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కలకలం
TG· 5 Jun 2026

DEOగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ కలకలం

TG: సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారిగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అధికారుల తప్పిదంతో DEO రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడదారి పడుతున్న సొసైటీని మంచిమార్గంలో నడిపించే విద్యాశాఖ అధికారులే తప్పులు రాస్తే ఎలా అని పలువురు ఫైర్ అవుతున్నారు.

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి
Politics· 5 Jun 2026

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి

మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు మరోసారి ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ఏడు ఇళ్లను పూర్తిగా తగలబెట్టారు. ఈ షాకింగ్ అటాక్‌తో ఆ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క
TG· 5 Jun 2026

చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క

TG: చెట్లతోనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతి, పచ్చదనం ప్రాణవాయువు అని మినిస్టర్ సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ములుగు మండలం ఇంచర్ల ఏకోపార్క్‌లో ఆమె మొక్కలు నాటారు. రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి మొక్కలు నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతివ్యక్తిపై ఉందన్నారు. ఇక్కడి ప్రాంతంలో దట్టమైన అడవులతో పాటు దేవాలయాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.

ఏనుగుల బీభత్సం..  తీవ్ర పంట నష్టం
Local· 5 Jun 2026

ఏనుగుల బీభత్సం.. తీవ్ర పంట నష్టం

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిన్నగరిగపల్లి గ్రామ సమీపంలో జంట ఏనుగులు పొలాల్లోకి చొరబడి హల్‌చల్ చేశాయి. మామిడితోటలోకి ప్రవేశించిన ఏనుగులు చెట్ల కొమ్మలను విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి. చెట్లను పెద్దఎత్తున విరిచేయడంతో చెట్లకు ఉన్న మామిడికాయలు అన్ని పూర్తిగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట గజరాజుల దాడిలో నాశనమవ్వడంతో తోట యజమానితోపాటు స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడుసార్లు హత్యాయత్నాలు.. దావూద్ పై లలిత్ మోదీ ఆరోపణలు
India· 5 Jun 2026

మూడుసార్లు హత్యాయత్నాలు.. దావూద్ పై లలిత్ మోదీ ఆరోపణలు

IPL వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో మ్యాచ్ ఫిక్సింగ్‌ను అడ్డుకున్నందుకు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనను టార్గెట్ చేశాడని చెప్పారు. తనపై మూడు హత్యాయత్నాలు జరిగాయని, లండన్‌లో తన కుమారుడిని కిడ్నాప్ చేశారని కూడా ఆరోపించారు. ఫిక్సింగ్‌ను పట్టించుకోవద్దని కోట్ల డాలర్ల లంచాలు ఇచ్చి ఒత్తిడి తెచ్చినా తాను లొంగలేదన్నారు. ఈ బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగానే క్రికెట్ కు దూరమైనట్టు చెప్పారు.

సిలిండర్ పేలి ముగ్గురు మృతి
TG· 5 Jun 2026

సిలిండర్ పేలి ముగ్గురు మృతి

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షార్ట్ సర్క్యూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. కలాల్‌వాడలో ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో చంద్రమ్మ(50), మనవడు లక్ష్మణ్(17), మనవరాలు ప్రణతి(14) సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మూడు డెడ్‌బాడీలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమ్మిత్తం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పిల్లల తండ్రి హైదరాబాదులో, తల్లి పూణెలో కూలీ పనులు చేస్తుంటారు. అమ్మమ్మ దగ్గర ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు.