Latest

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి
Politics· 5 Jun 2026

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురు మృతి

మణిపూర్‌లోని కాంగ్‌పోక్‌పి జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు మరోసారి ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మరో ఏడు ఇళ్లను పూర్తిగా తగలబెట్టారు. ఈ షాకింగ్ అటాక్‌తో ఆ ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క
TG· 5 Jun 2026

చెట్లతోనే మానవ మనుగడ: మంత్రి సీతక్క

TG: చెట్లతోనే మానవ మనుగడ కొనసాగుతుందని, ప్రకృతి, పచ్చదనం ప్రాణవాయువు అని మినిస్టర్ సీతక్క అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ములుగు మండలం ఇంచర్ల ఏకోపార్క్‌లో ఆమె మొక్కలు నాటారు. రాష్ట్రంలో ములుగు జిల్లాలోనే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయని, పచ్చని జిల్లాగా మార్చడానికి మొక్కలు నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతివ్యక్తిపై ఉందన్నారు. ఇక్కడి ప్రాంతంలో దట్టమైన అడవులతో పాటు దేవాలయాలు, సరస్సులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.

ఏనుగుల బీభత్సం..  తీవ్ర పంట నష్టం
Local· 5 Jun 2026

ఏనుగుల బీభత్సం.. తీవ్ర పంట నష్టం

AP: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం చిన్నగరిగపల్లి గ్రామ సమీపంలో జంట ఏనుగులు పొలాల్లోకి చొరబడి హల్‌చల్ చేశాయి. మామిడితోటలోకి ప్రవేశించిన ఏనుగులు చెట్ల కొమ్మలను విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి. చెట్లను పెద్దఎత్తున విరిచేయడంతో చెట్లకు ఉన్న మామిడికాయలు అన్ని పూర్తిగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట గజరాజుల దాడిలో నాశనమవ్వడంతో తోట యజమానితోపాటు స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడుసార్లు హత్యాయత్నాలు.. దావూద్ పై లలిత్ మోదీ ఆరోపణలు
India· 5 Jun 2026

మూడుసార్లు హత్యాయత్నాలు.. దావూద్ పై లలిత్ మోదీ ఆరోపణలు

IPL వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు. IPLలో మ్యాచ్ ఫిక్సింగ్‌ను అడ్డుకున్నందుకు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనను టార్గెట్ చేశాడని చెప్పారు. తనపై మూడు హత్యాయత్నాలు జరిగాయని, లండన్‌లో తన కుమారుడిని కిడ్నాప్ చేశారని కూడా ఆరోపించారు. ఫిక్సింగ్‌ను పట్టించుకోవద్దని కోట్ల డాలర్ల లంచాలు ఇచ్చి ఒత్తిడి తెచ్చినా తాను లొంగలేదన్నారు. ఈ బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగానే క్రికెట్ కు దూరమైనట్టు చెప్పారు.

సిలిండర్ పేలి ముగ్గురు మృతి
TG· 5 Jun 2026

సిలిండర్ పేలి ముగ్గురు మృతి

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షార్ట్ సర్క్యూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. కలాల్‌వాడలో ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో చంద్రమ్మ(50), మనవడు లక్ష్మణ్(17), మనవరాలు ప్రణతి(14) సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మూడు డెడ్‌బాడీలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమ్మిత్తం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పిల్లల తండ్రి హైదరాబాదులో, తల్లి పూణెలో కూలీ పనులు చేస్తుంటారు. అమ్మమ్మ దగ్గర ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు.

గాంధీలో మరో ఎబోలా కేసు ..!
TG· 5 Jun 2026

గాంధీలో మరో ఎబోలా కేసు ..!

సూడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మరో వ్యక్తి మహమ్మద్ యగౌచ్ కి ఎబోలా వైరస్ సోకినట్టుగా అనుమానం రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. నిన్న కూడా సూడాన్ నుంచి వచ్చిన అహ్మద్ అనే వ్యక్తికే ఎబోలా లక్షణాలున్నట్టు గుర్తించారు. వీరి శాంపిల్స్ పుణెకి పంపారు. వారం రోజుల్లో నివేదిక వస్తుంది. ప్రస్తుతం గాంధీలో 20 పడకలతో ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.

రామ్ చరణ్ సరే.. జాన్వి కేరక్టర్ సంగతేంటి ? ▶
Cinema· 5 Jun 2026

రామ్ చరణ్ సరే.. జాన్వి కేరక్టర్ సంగతేంటి ?

పెద్ది సినిమా ఫస్ట్ డేయే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రేమ్ లో కనపడుతోందని అతని నటన Top Notch అని అంటున్నారు. హీరో సంగతి సరే, మరి జాన్వికపూర్ సంగతేంటి. మన తెలుగు మూవీల్లో హీరోకున్న ఎలివేషన్ హీరోయిన్ కి ఎప్పుడూ ఇవ్వరు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీలో కూడా జాన్వి కేరక్టర్ ని ఎంత చీప్ గా చూపించారో బిగ్ బాస్ ఫేమ్ దివ్య నిఖిత పెద్ది రివ్యూలో చెప్పారు. అదేంటో మీరూ చూసేయండి

పోలవరం పూర్తైతే భద్రాచలం టౌన్‌కు జలగండమే: హరీష్‌రావు
Politics· 5 Jun 2026

పోలవరం పూర్తైతే భద్రాచలం టౌన్‌కు జలగండమే: హరీష్‌రావు

TG: పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే భద్రాచలం టౌన్‌కు నిత్యం జలగండమేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. భద్రాచలంలో పర్యటించిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు హరీశ్‌రావు లేఖ రాశారు. ఈ లేఖను పినపాక, భద్రాచలం బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. 2022లో 22లక్షల క్యూసెక్కులకే చాలా నష్టం జరిగిందని, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36లక్షల నుంచి 50లక్షల క్యూసెక్కుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంతో కేవలం ముంపు గ్రామాలకే కాకుండా పరిశ్రమలకు ముప్పు పొంచి ఉందన్నారు.

కృష్ణా జలాలతో పాలమూరును పచ్చగా మారుస్తా: రేవంత్‌రెడ్డి
TG· 4 Jun 2026

కృష్ణా జలాలతో పాలమూరును పచ్చగా మారుస్తా: రేవంత్‌రెడ్డి

TG: కృష్ణా జలాలతో మహబూబ్‌నగర్ జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండురోజుల పర్యటనలో భాగంగా ఫస్ట్ డే కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన కొత్త బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులు, నీటినిల్వల సామర్ధ్యాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల పరిధిలోని పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు.

రేర్ స్క్రూవార్మ్ అవుట్బ్రేక్ హిట్స్ టెక్సాస్: ఈజ్ ది యు.ఎస్. ఎట్ రిస్
Health· 4 Jun 2026

రేర్ స్క్రూవార్మ్ అవుట్బ్రేక్ హిట్స్ టెక్సాస్: ఈజ్ ది యు.ఎస్. ఎట్ రిస్

1966 నుండి మొదటిసారిగా, న్యూ వరల్డ్ స్క్రూవార్మ్ అని పిలువబడే ఒక మాంసం తినే పరాన్నజీవి U.S. కాఫ్ లో కనుగొనబడింది. USDA ప్రకటించిన ఈ ఆవిష్కరణ, మెక్సికో ద్వారా వలస వచ్చిన తర్వాత దీర్ఘకాల నియంత్రణ చర్యలలో ఒక ఉల్లంఘనను సూచిస్తుంది, అక్కడ 2025 చివరిలో కేసులు 53% పెరిగాయి. ఈ సోకు పశువుల పరిశ్రమను బెదిరిస్తుంది, టెక్సాస్ ఆర్థిక వ్యవస్థకు $1.8 బిలియన్ల నష్టాలు అంచనా వేయబడ్డాయి. ఈ పరాన్నజీవి, Cochliomyia hominivorax, ఈగలు తెరచిన గాయాలలో గుడ్లు పెట్టినప్పుడు వ్యాపిస్తుంది.

దేశవ్యాప్త నిరసనలు అర్జెంటీనా టీనేజర్ యొక్క క్రూరమైన హత్యను అనుసరించాయ
World· 4 Jun 2026

దేశవ్యాప్త నిరసనలు అర్జెంటీనా టీనేజర్ యొక్క క్రూరమైన హత్యను అనుసరించాయ

వేలాది మంది అర్జెంటీనా అంతటా కవాతు చేశారు, దేశంలోని నిరంతర లింగ హింస సంక్షోభాన్ని నిరసిస్తూ. ఈ ర్యాలీలు ఒక 14 ఏళ్ల బాలిక అపహరణ మరియు క్రూరమైన హత్య వలన ప్రేరేపించబడ్డాయి, ఇది దేశంలో ప్రతి 30 గంటలకు ఒక మహిళ చంపబడుతున్న భయంకరమైన వాస్తవాన్ని హైలైట్ చేస్తుంది.

నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. హైఅలెర్ట్
TG· 4 Jun 2026

నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. హైఅలెర్ట్

TG: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ సమీపంలోని హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి కార్లను ఢీకొట్టింది. ట్యాంకర్ ముందుగా వెళ్తున్న రెండుకార్లను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కార్లలో ఉన్న ప్రయాణికులకు గాయాలవడంతో స్థానికులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్రోల్ లీకవడంతో అధికారులు అక్కడికి ఎవరూ రాకుండా హైఅలెర్ట్ ప్రకటించారు. ట్యాంకర్ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనతో నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఈ టీచర్ టీచింగ్ స్టైల్ అద్భుతం.. ఆదర్శనీయం
Politics· 4 Jun 2026

ఈ టీచర్ టీచింగ్ స్టైల్ అద్భుతం.. ఆదర్శనీయం

AP: విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ టీచర్‌ పల్టాసింగి అలివేలి మంగ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠాలను బట్టీ పట్టించడం కాకుండా.. ఆటపాటలతో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పుతున్నారు. విద్యార్థుల్లో దాగున్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. తన టీచింగ్‌‌కు సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. Learning made easy with "Activities" టీచింగ్ విధానం, Unique innovative Teaching methods, No Bag Day.. Activities, Word Building పద్దతుల్లో బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

AP బీచ్‌లలో ఇకనుండి లిక్కర్!
Politics· 4 Jun 2026

AP బీచ్‌లలో ఇకనుండి లిక్కర్!

APలో లిక్కర్ సేల్స్‌ను పెంచేందుకు చంద్రబాబు గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. గోవా లాగే AP బీచ్‌లలో కూడా 'బీచ్ షాక్స్' పెట్టడానికి క్యాబినెట్ ఓకే చెప్పింది. ఈ షాక్స్‌లో మార్నింగ్ 10AM నుండి నైట్ 8PM వరకు ఆల్కహాల్ అమ్మడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో దీనిని స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ గనుక ఇది సక్సెస్ అయితే, ఫ్యూచర్‌లో స్టేట్ లో ఉన్న అన్ని బీచ్‌లలో కూడా ఈ బీచ్ షాక్స్ రూల్‌ను తీసుకురావాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.

 లంచం ఇవ్వలేదని  అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం
Crime· 4 Jun 2026

లంచం ఇవ్వలేదని అతికిన ఎముకనే విరిచేశాడు- ఓ యూపీ డాక్టర్ నిర్వాకం

యూపీ ముజఫర్ పూర్ కు చెందిన రేష్మ అనే మహిళ తన 14 ఏళ్ల కుమార్తెకు కాలు విరగడంతో గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి డాక్టరు ఆపరేషన్ చేయడానికి లంచం అడగడంతో ఇచ్చుకోలేక మేజిస్ట్రేట్ కి కంప్లయింట్ చేసింది. ఆమెకు ఉచితంగా సర్జరీ చేయాలంటూ మేజిస్ట్రేట్ ఆదేశించారు. అయితే ఆ వైద్యుడు లంచం ఇవ్వనిదే చేయనని మొండికేశాడు.25 వేలు ఇచ్చుకోలేనన్న ఆ మహిళ రూ. 8 వేలు చెల్లించింది. ఆపరేషన్ పూర్తయి కోలుకున్నాక చెకప్ కోసం వెడితే మిగిలిన అమౌంట్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వలేకపోవడంతో కాలును టెస్ట్ చేసే పేరుతో ఇటూ అటూ మెలిపెట్టి నలిపేశాడు. ఇంటికి వెళ్లాక చూడగా కాలు విరిగిపోయింది.

వెనిజులా  ప్రెసిడెంట్‌తో PM మోదీ..
Politics· 4 Jun 2026

వెనిజులా ప్రెసిడెంట్‌తో PM మోదీ..

ఇండియా PM మోదీ, వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్‌ను కలిశారు. వీరిద్దరి మధ్య ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, హెల్త్ రంగాల్లో పార్ట్నర్‌షిప్‌ను పెంచుకోవడంపై ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగాయి. లాటిన్ అమెరికాలో వెనిజులా మనకు ఒక బెస్ట్ పార్ట్నర్ అని, గ్లోబల్ సౌత్ డెవలప్‌మెంట్ కోసం ఇరు దేశాలు కలిసి నడవడం చాలా అవసరమని మోదీ చెప్పారు. రెండు దేశాల ప్రజల మేలు కోసం ఇకపై కూడా కలిసి వర్క్ చేస్తామని మోదీ క్లియర్ గా చెప్పారు.

 శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ విదేశీయుడికి ఎబోలా వైరస్ !!
General· 4 Jun 2026

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ విదేశీయుడికి ఎబోలా వైరస్ !!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ ఉన్నట్లు బయటపడింది. సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడు మహమ్మద్ కు ఈ వైరస్ ఉన్నట్లు స్కానర్ ద్వారా గుర్తించిన అధికారులు అతగాడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు....వచ్చే వారం తెలుగు రాష్ట్రాలలోకి▶
General· 4 Jun 2026

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు....వచ్చే వారం తెలుగు రాష్ట్రాలలోకి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి ఎట్టకేలకు కేరళను తాకింది. ఈ రోజు మధ్యాహ్నం నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం ద్వారా భారత్ లో ఎంటరయ్యాయి. మరికొద్దిరోజుల్లో ఈ రుతుపవనాలు దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతాయి. వచ్చే వారం ఏపీ, తెలంగాణలలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ అంచనా. నైరుతి ప్రభావంతో విస్తారంగా వానలు పడే ఛాన్స్ ఉంది. అయితే ఈసారి ఎల్ నినో కారణంగా వర్షాలు కాస్త తక్కువగా పడే అవకాశముందని IMD ఇప్పటికే చెప్పింది.

పవన్ పై కేసులు పెట్టమని వైఎస్ అన్నారన్నది నిజం కాదు ః కేవీపీ
Politics· 4 Jun 2026

పవన్ పై కేసులు పెట్టమని వైఎస్ అన్నారన్నది నిజం కాదు ః కేవీపీ

వైఎస్ పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రెస్పాండ్ అయ్యారు. వైఎస్ కు, వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ ఎన్నడూ పవన్ పై కేసులు పెట్టలేదని అన్నారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్టులు చేయాలని కేవీపీ అన్నారు. అధికారి చెప్పింది నిజమైతే టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు లేదా ఎన్జీఓ కు రూ. 10 కోట్లు ఇస్తానని కేవీపీ సవాల్ విసిరారు. వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయినా ఇంకా ఆయనపై అర్ధం లేని ఆరోపణలు చేయడం అవివేకమని కేవీపీ అన్నారు. ఈమేరకు పవన్ కు కేవీపీ లెటర్ రాశారు.

దావూద్  చంపుతానన్నాడు.. అందుకే దానికి దూరమయ్యా- లలిత్ మోడీ
Sports· 4 Jun 2026

దావూద్ చంపుతానన్నాడు.. అందుకే దానికి దూరమయ్యా- లలిత్ మోడీ

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుండి వచ్చిన మర్డర్ త్రెట్స్ కు భయపడే తాను క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి శాశ్వతంగా తప్పుకోవడానికి కారణమని మాజీ IPL కమిషనర్ లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఇల్లీగల్ బెట్టింగ్ నెట్‌వర్క్స్‌కు సపోర్ట్ చేయకపోవడం వల్లే D-Company తనను టార్గెట్ చేసిందని, ఎన్నో ఎక్స్‌టార్షన్ అటెంప్ట్స్ మరియు అస్సాస్సినేషన్ ప్లాట్స్ జరిగాయని చెప్పారు. ముఖ్యంగా 2012లో లండన్‌లో ఒక ఇంటర్మీడియరీ ద్వారా తెల్లవారుజామున దావూద్‌తో శాటిలైట్ ఫోన్‌లో మాట్లాడించారని, ఆ టైమ్‌లో తాను తీవ్రమైన భయానికి లోనయ్యానని లలిత్ మోదీ వెల్లడించారు.

13 మంది రౌడీ షీటర్లకు తెలంగాణ పోలీసులు వార్నింగ్!
News· 4 Jun 2026

13 మంది రౌడీ షీటర్లకు తెలంగాణ పోలీసులు వార్నింగ్!

శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా అత్తాపూర్ పోలీసులు ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ ఏరియాలో ఉన్న 13 మంది రౌడీ షీటర్లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి బైండోవర్ చేశారు. ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడినా, గొడవలు చేసినా వారిపై సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ ఏరియాలో జనాలు పీస్‌ఫుల్‌గా (Peaceful) ఉండేందుకే ఈ యాక్షన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.