Latest

రియల్ హీరో అంటే ఇతనే!▶
Politics· 30 May 2026

రియల్ హీరో అంటే ఇతనే!

కర్ణాటక బైటరాయణపురలో అనిల్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. హెవీ రెయిన్ వల్ల ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ రోడ్డు క్రాస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుండటం గమనించిన అనిల్ కుమార్ వెంటనే వెళ్ళి, ఆ పర్సన్‌ని తన భుజాల మీద ఎక్కించుకుని సేఫ్‌గా రోడ్డు దాటించాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆ కానిస్టేబుల్‌ని మెచ్చుకుంటున్నారు.

డెప్యూటీ స్పీకర్ Vs IPS: పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ ఛాలెంజ్!▶
Politics· 30 May 2026

డెప్యూటీ స్పీకర్ Vs IPS: పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ ఛాలెంజ్!

డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు IPS పీవీ సునీల్ కుమార్ గట్టి ఛాలెంజ్ విసిరారు. నీకు అంత నమ్మకం ఉంటే వెంటనే రిజైన్ చేసి, నీకు నచ్చిన పార్టీ నుండి టికెట్ తెచ్చుకో. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా, అంటూ సునీల్ కుమార్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నీకంటే ఒక్క వెయ్యి ఓట్లు తక్కువ వచ్చినా నేను పాలిటిక్స్ మాట్లాడటం బంద్ చేస్తా, మరి నాకంటే తక్కువ ఓట్లు వస్తే నువ్వు పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ రఘురామకు కౌంటర్ ఇచ్చారు.

భారత తీరప్రాంతానికి క్లైమేట్ ముప్పు.. షాకింగ్ రిపోర్ట్
General· 30 May 2026

భారత తీరప్రాంతానికి క్లైమేట్ ముప్పు.. షాకింగ్ రిపోర్ట్

భారతదేశానికి ఉన్న 11,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతానికి రాబోయే కాలంలో తీవ్ర పర్యావరణ ముప్పు పొంచి ఉందని 'అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ' నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ముంబై, కేరళ, తమిళనాడు సహా 40 తీరప్రాంత జిల్లాల్లో అసాధారణ ఎండలు, భారీ వర్షాలు, తీవ్రమైన తుఫానులు రానున్నాయి. దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు, 2050 నాటికి సముద్ర మట్టాలు పెరిగి ఒడిశా వంటి రాష్ట్రాల్లో తీరప్రాంత గ్రామాలు జనాభా లేక ఒక స్మశానంలా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

ఎండ ధాటికి పేలిన Samsung ఫోన్ ▶
TG· 30 May 2026

ఎండ ధాటికి పేలిన Samsung ఫోన్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలు ఉన్నాయంటే చివరికి స్మార్ట్ ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా మగ్దంపూర్ అనే ఊళ్లో చంద్రగౌడ్ అనే వ్యక్తి జేబులో పెట్టుకున్న శామ్ సంగ్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. అతను అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మండే ఎండల్లో వెళ్లినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలతో కాస్త జాగ్రత్త

 ఆసియన్ గేమ్స్ నుంచి వినేష్ పోగట్ అవుట్ !!
Sports· 30 May 2026

ఆసియన్ గేమ్స్ నుంచి వినేష్ పోగట్ అవుట్ !!

న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్‌లో మీనాక్షి గోయాత్ చేతిలో 4-6 తేడాతో ఆమె ఓడిపోయారు.ఈ ఓటమితో ఈ ఏడాది జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో (Asian Games) పాల్గొనే సువర్ణావకాశాన్ని వినేష్ పూర్తిగా కోల్పోయారు. తొలి మ్యాచ్‌లో జ్యోతిపై 7-1 తేడాతో వినేష్ సులువుగా విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో నిషు అనే రెజ్లర్ వినేష్‌కు గట్టి పోటీ ఇచ్చారు.

 ట్విషా శర్మ కేసులో గిరిబాలతో  సీన్ రిక్రియేషన్ చేయిస్తున్న సీబీఐ
Politics· 30 May 2026

ట్విషా శర్మ కేసులో గిరిబాలతో సీన్ రిక్రియేషన్ చేయిస్తున్న సీబీఐ

భోపాల్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ట్విషా శర్మ అనుమా నాస్పద మృతి కేసులోCBI విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీబీఐ అధికారులు సీన్ రిక్రియేట్ చేయనున్నారు. ట్విషా శర్మ మే 12వ తేదీ రాత్రి తమ నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతదేహాన్ని తానే ఉరితాడు నుండి కిందకు దించానని భర్త సమర్థ్ సింగ్, అలాగే మెడకు ఉన్న ముడిని తన తల్లి గిరిబాల సింగ్ విప్పారని విచారణలో అధికారులకు తెలిపారు. ఈ నేపధ్యంలోనే సీన్ రిక్రియేషన్ టెస్ట్ చేస్తున్నారు.నిందితులకు జూన్ 2 వరకూ సీబిఐ కస్టడీ విధించారు.

వైరల్ అవుతున్న రైతన్న పాట.. చూస్తే ఏడుపొస్తది!▶
Politics· 30 May 2026

వైరల్ అవుతున్న రైతన్న పాట.. చూస్తే ఏడుపొస్తది!

"రైతునై పుట్టినాను రైతునై పెరిగినాను.. రాజకీయం నేను చేస్తే రంది లేకుండా ఉందునయ్యా" అంటూ ఒక రైతు వడ్ల కుప్ప దగ్గర నిలబడి పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 6 మంత్స్ కష్టపడి పండించిన వడ్లను కొనే నాథుడే లేడంటూ ఈ రైతు చాలా ఎమోషనల్‌గా ఈ పాట పాడాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసి నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీలో అక్కినేని నాగ చైతన్య కేసు !!
Cinema· 30 May 2026

పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీలో అక్కినేని నాగ చైతన్య కేసు !!

తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ వాడుతున్న వారిపై నటుడు అక్కినేని నాగచైతన్య దాఖలు చేసిన 'పర్సనాలిటీ రైట్స్' కేసులో ఢిల్లీ హైకోర్టు త్వరలోనే కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. తన పేరును అశ్లీల వెబ్‌సైట్లలో వాడటం, మాజీ భార్య సమంతతో కలిపి ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, యూట్యూబ్‌లో వ్యక్తిగత ట్రోలింగ్‌కు పాల్పడటం వంటి వాటిపై చైతన్య కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణకు పరిమితులు ఉంటాయని పేర్కొంది. త్వరలోనే దీనిపై తీర్పు నివ్వనుంది.

 విదేశీ బీచ్ ల క్లీనింగ్ ఎలా జరుగుతుందో చూశారా?▶
World· 30 May 2026

విదేశీ బీచ్ ల క్లీనింగ్ ఎలా జరుగుతుందో చూశారా?

బీచ్ లలో విహరించే విజిటర్స్ ఒక్కోసారి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కానీ అది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆ వస్తువులు జనరల్ గా దొరకవు. కానీ విదేశీ బీచ్ లలో ఒక అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఆపరేషన్ జరుగుతుంది. అదే విజిటర్స్ వెళ్లిపోయాక బీచ్ ను జల్లెడ పట్టే మిషన్ తో లాగుతూ వెడతారు. అందులోంచి ఇసక జారిపోయి అక్కడ వదిలేసిన వస్తువులు దొరుకుతుంటాయి. బీచ్ క్లీనింగ్ విదేశాలలో ఎలా జరుగుతుందో ఈ వీడియో ఒక్కసారి చూడండి.

జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం వెనుక ..|
Politics· 30 May 2026

జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం వెనుక ..|

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అదే రోజు ప్రమాణం చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మే ఆయన, తన ఆస్థాన ఆస్ట్రాలజర్ ద్వారకానాథ్ పెట్టిన ముహూర్తానికే ఆ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 3 అత్యంత శుభ ముహూర్తమని, ఆ సమయంలో బాధ్యతలు చేపడితే ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా ఐదేళ్ల పదవీకాలం సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

'పెద్ది' మూవీ టీమ్ వెనక్కి తగ్గింది!
Entertainment· 30 May 2026

'పెద్ది' మూవీ టీమ్ వెనక్కి తగ్గింది!

రామ్ చరణ్ 'పెద్ది' మూవీ జూన్ 4న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని హోం సెక్రటరీని అడిగితే నో రెస్పాన్స్. దాంతో ప్రొడక్షన్ టీమ్ తెలంగాణ హైకోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు నుండి ఎలాంటి పాజిటివ్ ఆర్డర్స్ రాకపోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గి ఆ పిటిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పెద్ది సినిమా నార్మల్ రేట్లకే థియేటర్స్‌లోకి రానుంది.

డ్యాన్స్ అదరగొట్టేసిన తేజస్విని▶
Viral· 30 May 2026

డ్యాన్స్ అదరగొట్టేసిన తేజస్విని

నటుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డ్యాన్స్ అదరగొట్టేసింది. ఆమె డ్యాన్స్ మాస్టర్ తో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster)  కూర్చోమన్న శాడిస్ట్ !!
Crime· 30 May 2026

భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster) కూర్చోమన్న శాడిస్ట్ !!

ముంబైలో ఒక కిరాతక భర్త తన భార్యను గృహనిర్బంధం చేసి, గంటల తరబడి క్రూరంగా హింసించాడు. గృహవివాదం నేపథ్యంలో 25 ఏళ్ల అర్బాజ్ సయ్యద్ అనే రౌడీషీటర్, తన భార్యను కత్తితో బెదిరించి దాదాపు నాలుగు గంటల పాటు 'కోడిపుంజు' (Rooster) పొజిషన్‌లో ఉంచాడు. యాసిడ్ పోస్తానని, చంపేస్తానని భయపెట్టాడు. ఆమె ప్రాణాలు దక్కించుకుని పుట్టింటికి పారిపోగా, అక్కడికి కూడా వెళ్ళి ఆమెపై కత్తితో దాడి చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా బాస్ ఫిట్‌గా ఉన్నారట!
Health· 30 May 2026

ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా బాస్ ఫిట్‌గా ఉన్నారట!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (79) రీసెంట్‌గా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు. 22 మంది డాక్టర్ల టీమ్ చేసిన టెస్టుల ప్రకారం ఆయన ప్రెజెంట్ బరువు 108 kg కాగా, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 6kg పెరిగారు. బరువు కొంచెం ఎక్కువ ఉన్నా ఆయన మైండ్ అండ్ బాడీ యాక్టివ్‌గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కంటిన్యూస్‌గా ప్రజలతో షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం, హార్ట్ మెడిసిన్స్ వాడడం వల్ల కాళ్ల వాపు, చేతులపై చిన్న మచ్చలు వచ్చాయట. దీంతో డైట్ కంట్రోల్, ఎక్సర్‌సైజ్ చేయాలని డాక్టర్లు సజెస్ట్ చేశారు.

అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
Crime· 30 May 2026

అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలోని నెబ్రాస్కాలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో గుజరాత్‌కు చెందిన హోటల్ ఉద్యోగి కవన్‌కుమార్ పటేల్ (27) అనే ఇండియన్ కి అ క్కడి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హోటల్ గది అద్దె తగ్గించడం కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) ముఠాకు హోటల్ డ్రాయర్ నుంచి డబ్బులు చెల్లించి, మైనర్ బాలికపై పటేల్ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పనిష్ మెంట్ పూర్తయ్యాక అతడిని భారత్‌కు డిపోర్ట్ (నగరం నుంచి బహిష్కరణ) చేస్తారు.

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది అరెస్ట్
Politics· 30 May 2026

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది అరెస్ట్

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ISI), అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న తొమ్మిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ, ముంబై నగరాల్లోని అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లపై దాడులకు వీరు స్కెచ్ వేశారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఈ ముఠాను పట్టుకోగా, వీరి వెనుక ఉన్న విదేశీ హ్యాండ్లర్ల లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూ్క్లియర్ మిసైల్స్ కోసం లాంచ్ పాడ్లు, బంకర్లు సిద్ధం చేస్తున్న చైనా
World· 30 May 2026

న్యూ్క్లియర్ మిసైల్స్ కోసం లాంచ్ పాడ్లు, బంకర్లు సిద్ధం చేస్తున్న చైనా

చైనా తన అణ్వాయుధ సంపత్తిని రక్షించుకోవడానికి జింజియాంగ్ ఎడారిలో భారీ సైనిక కేంద్రాన్ని నిర్మిస్తోంది. అమెరికా దాడి చేసినా ఎదురుదెబ్బ తీసేలా రెండోసారి దాడి సామర్థ్యాన్ని (Second-strike capability) పెంచుకుంటోంది. రాయిటర్స్ ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. హమీ సైలో క్షేత్రాల సమీపంలో 80కి పైగా వెపన్ ప్రయోగ కేంద్రాలు, బంకర్లు, 'అష్టభుజి' (Octagon) ఆకారపు రక్షణ కట్టడాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేస్తోంది. మొబైల్ క్షిపణి లాంచర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కోసం ఈ కొత్త మౌలిక సదుపాయాలను చైనా చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసుకుంటోంది.

భార్య కోరిక తీర్చలేక హత్య చేసి తాను సూసైడ్
Crime· 29 May 2026

భార్య కోరిక తీర్చలేక హత్య చేసి తాను సూసైడ్

TG: భర్త భార్యకు ఉరి వేసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో చోటు చేసుకుంది. దాసరి అంజయ్య(25), యాదమ్మ(20)లకు రీసెంట్‌గా వివాహం జరిగింది. బైక్ కొనివ్వాలన్న భార్య కోరిక తీర్చలేక, ఆమెతో గొడవపడి మామిడి తోటలో భార్య యాదమ్మకు ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అంగన్వాడీ టీచర్లకు అవమానం
Local· 29 May 2026

అంగన్వాడీ టీచర్లకు అవమానం

TG: అంగన్వాడీ టీచర్లను కింద కూర్చోబెట్టి వారి ఎదుట ఐసీడీఎస్ సీడీపీవో, సూపర్వైజర్ కుర్చీలపై కూర్చొని అంగన్వాడీ టీచర్లను అవమానపరిచారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండలోని అంగన్వాడి కేంద్రంలో వెయ్యిరోజుల ప్రాముఖ్యత ప్రొగ్రామ్ నిర్వహించారు. తల్లులు, గర్భిణీలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసీడీఎస్ సీడీపీవో వెంకటరమణ, సూపర్‌వైజర్లు గోదా ధనమ్మ, పారిజాత బాలమణి కుర్చీలపై కూర్చొని మిగతా వారిని కింద కూర్చొబెట్టారు. మేము మీకంటే స్థాయిలో ఎక్కువ అనే విధంగా వారు బిహెవ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు?: సుప్రీంకోర్టు
India· 29 May 2026

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు?: సుప్రీంకోర్టు

అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని అవమానించడం ఎందుకు? ఇక ఇలాంటి వేధింపులు కొనసాగడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒక మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన కేసు విచారణలో జస్టిస్‌లు బి.వి.నాగరత్న, ఉజ్జ్వల్ భుయాన్ బెంచ్ భర్త కుటుంబం వేధింపులపై సీరియస్‌గా స్పందించింది. భర్త తమ్ముడికి సెక్షన్ 498A కింద కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించింది.

5 టైమ్స్ MLA, 2టైమ్స్ మినిస్టర్ గాదె వెంకటరెడ్డి ఇక లేరు!
News· 29 May 2026

5 టైమ్స్ MLA, 2టైమ్స్ మినిస్టర్ గాదె వెంకటరెడ్డి ఇక లేరు!

సీనియర్ లీడర్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన ఇంట్లో చనిపోయారు. ఇంకొల్లు మండలం పావులూరు విలేజ్ లో ఒక నార్మల్ ఫార్మర్ ఫ్యామిలీలో పుట్టిన ఆయన. లాయర్‌గా లైఫ్ స్టార్ట్ చేసి స్టేట్ మినిస్టర్ వరకు ఎదిగారు. కాంగ్రెస్‌లో నిఖార్సైన లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన 5 టైమ్స్ MLAగా, 2టైమ్స్ మినిస్టర్ గా పని చేశారు. స్టేట్ డివిజన్ టైమ్‌లో సీమాంధ్ర తరపున ఢిల్లీలో గట్టిగా వాయిస్ వినిపించారు. ఆయన చనిపోవడంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల పాలిటిక్స్‌లో ఒక శకం ముగిసినట్లయింది.