భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster) కూర్చోమన్న శాడిస్ట్ !!

ముంబైలో ఒక కిరాతక భర్త తన భార్యను గృహనిర్బంధం చేసి, గంటల తరబడి క్రూరంగా హింసించాడు. గృహవివాదం నేపథ్యంలో 25 ఏళ్ల అర్బాజ్ సయ్యద్ అనే రౌడీషీటర్, తన భార్యను కత్తితో బెదిరించి దాదాపు నాలుగు గంటల పాటు 'కోడిపుంజు' (Rooster) పొజిషన్‌లో ఉంచాడు. యాసిడ్ పోస్తానని, చంపేస్తానని భయపెట్టాడు. ఆమె ప్రాణాలు దక్కించుకుని పుట్టింటికి పారిపోగా, అక్కడికి కూడా వెళ్ళి ఆమెపై కత్తితో దాడి చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.



