Latest
congress, BJPకి KTR స్ట్రాంగ్ వార్నింగ్!
BRS లీడర్ KTR కాంగ్రెస్ అండ్ BJP పార్టీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. "మనల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్, BJPలకు గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. అందరం కలిసి గట్టిగా ఫైట్ చేద్దాం.. ఇంకొక్క వన్ ఇయర్ కష్టపడితే చాలు" అంటూ BRS పార్టీ వాళ్లలో ఫుల్ జోష్ నింపారు. తమను ట్రబుల్ చేసిన వాళ్లకు వడ్డీతో సహా తిప్పికొడతామని చాలా అగ్రెసివ్‌గా చెప్పారు. KTR చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
అమరవీరుడి భార్యను తాగుబోతు అని అవమానించిన జనసేన లీడర్?
తెలంగాణ ఉద్యమ అమరవీరుడు బాల్య కొమురయ్య అతని భార్య పూలమ్మను ఉద్దేశించి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. పూలమ్మను తాగుబోతు అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై తెలంగాణ ప్రజలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వీరుడి భార్యను ఇలా మాట్లాడటం ఏంటంటూ కిరణ్ రాయల్‌ను నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్: ఇండియా వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు!
సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజీత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఇండియాకు తిరిగి వస్తే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఓపెన్ అయ్యాడు. అసలు ఈ వైరల్ మూవ్‌మెంట్ ఏంటి, ఇది ఇంత స్పీడ్‌గా ఎలా పెరిగింది, ప్రెజెంట్ యూత్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాల గురించి మాట్లాడాడు. ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు ప్లాన్!
మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడంపై AP CM చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డీలిమిటేషన్ వల్ల మనకు నష్టం రాకుండా ఉండాలంటే సీట్లను 50% పెంచాలని, ఆ పెంచిన సీట్లనే మహిళలకు ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు బిల్లులను తీసుకురావడానికి రెడీ అవుతోందని, రెండింటినీ కలిపి తెస్తేనే మహిళలకు ఫుల్ బెనిఫిట్ ఉంటుందని అన్నారు. ఈ బిల్లులు దేశ పాలిటిక్స్‌ను టోటల్‌గా మార్చేస్తాయని చంద్రబాబు చెప్పారు.

గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గూడెం
TG: నేటి యూత్ గేమ్స్‌పై ఇంట్రెస్ట్ పెంపొందించుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానురు విలేజ్‌లో ఏర్పాటు చేసిన పీపీఆర్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని తెలిపారు. నేటి యూత్ ఎక్కువ టైమ్ ఫోన్లు, సోషల్ మీడియాకే పరిమితం కాకుండా గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. క్రీడా సదుపాయాలను సద్వినియోగం చేసుకొని నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్‌లో రాణించేలా కృషి చేయాలని కోరారు.

ఢిల్లీ పెద్దల ప్రపోజల్‌కు డీకే శివకుమార్ నో!
కర్ణాటక కొత్త CMగా జూన్ 3rd డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే తన క్యాబినెట్‌లో నలుగురు డిప్యూటీ CMలను పెట్టాలనే ప్రపోజల్‌ను ఆయన రిజెక్ట్ చేశారు. అంతమందిని పెడితే పార్టీలో మిగతా సీనియర్స్ హర్ట్ అవుతారని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 4గంటలకు జరిగే సీఎల్‌పీ మీటింగ్‌లో లీడర్‌ను అఫీషియల్‌గా సెలెక్ట్ చేయనున్నారు. ఫస్ట్ డీకేతో పాటు కొద్దిమంది మంత్రులే ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ తర్వాత ఎంబీ పటేల్, ప్రియాంక్ ఖర్గే లాంటి సీనియర్లకు క్యాబినెట్‌లో ఛాన్స్ దొరకనుందని టాక్.
రియల్ హీరో అంటే ఇతనే!
కర్ణాటక బైటరాయణపురలో అనిల్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ రియల్ హీరో అనిపించుకున్నాడు. హెవీ రెయిన్ వల్ల ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ రోడ్డు క్రాస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుండటం గమనించిన అనిల్ కుమార్ వెంటనే వెళ్ళి, ఆ పర్సన్‌ని తన భుజాల మీద ఎక్కించుకుని సేఫ్‌గా రోడ్డు దాటించాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆ కానిస్టేబుల్‌ని మెచ్చుకుంటున్నారు.
డెప్యూటీ స్పీకర్ Vs IPS: పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ ఛాలెంజ్!
డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు IPS పీవీ సునీల్ కుమార్ గట్టి ఛాలెంజ్ విసిరారు. నీకు అంత నమ్మకం ఉంటే వెంటనే రిజైన్ చేసి, నీకు నచ్చిన పార్టీ నుండి టికెట్ తెచ్చుకో. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా, అంటూ సునీల్ కుమార్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. నీకంటే ఒక్క వెయ్యి ఓట్లు తక్కువ వచ్చినా నేను పాలిటిక్స్ మాట్లాడటం బంద్ చేస్తా, మరి నాకంటే తక్కువ ఓట్లు వస్తే నువ్వు పాలిటిక్స్ నుండి తప్పుకుంటావా అంటూ రఘురామకు కౌంటర్ ఇచ్చారు.

భారత తీరప్రాంతానికి క్లైమేట్ ముప్పు.. షాకింగ్ రిపోర్ట్
భారతదేశానికి ఉన్న 11,000 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతానికి రాబోయే కాలంలో తీవ్ర పర్యావరణ ముప్పు పొంచి ఉందని 'అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ' నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ముంబై, కేరళ, తమిళనాడు సహా 40 తీరప్రాంత జిల్లాల్లో అసాధారణ ఎండలు, భారీ వర్షాలు, తీవ్రమైన తుఫానులు రానున్నాయి. దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినడంతో పాటు, 2050 నాటికి సముద్ర మట్టాలు పెరిగి ఒడిశా వంటి రాష్ట్రాల్లో తీరప్రాంత గ్రామాలు జనాభా లేక ఒక స్మశానంలా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ఎండ ధాటికి పేలిన Samsung ఫోన్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలు ఉన్నాయంటే చివరికి స్మార్ట్ ఫోన్లు కూడా పేలిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా మగ్దంపూర్ అనే ఊళ్లో చంద్రగౌడ్ అనే వ్యక్తి జేబులో పెట్టుకున్న శామ్ సంగ్ ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. అతను అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. మండే ఎండల్లో వెళ్లినప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలతో కాస్త జాగ్రత్త

ఆసియన్ గేమ్స్ నుంచి వినేష్ పోగట్ అవుట్ !!
న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్‌లో మీనాక్షి గోయాత్ చేతిలో 4-6 తేడాతో ఆమె ఓడిపోయారు.ఈ ఓటమితో ఈ ఏడాది జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో (Asian Games) పాల్గొనే సువర్ణావకాశాన్ని వినేష్ పూర్తిగా కోల్పోయారు. తొలి మ్యాచ్‌లో జ్యోతిపై 7-1 తేడాతో వినేష్ సులువుగా విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో నిషు అనే రెజ్లర్ వినేష్‌కు గట్టి పోటీ ఇచ్చారు.

ట్విషా శర్మ కేసులో గిరిబాలతో సీన్ రిక్రియేషన్ చేయిస్తున్న సీబీఐ
భోపాల్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ట్విషా శర్మ అనుమా నాస్పద మృతి కేసులోCBI విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీబీఐ అధికారులు సీన్ రిక్రియేట్ చేయనున్నారు. ట్విషా శర్మ మే 12వ తేదీ రాత్రి తమ నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతదేహాన్ని తానే ఉరితాడు నుండి కిందకు దించానని భర్త సమర్థ్ సింగ్, అలాగే మెడకు ఉన్న ముడిని తన తల్లి గిరిబాల సింగ్ విప్పారని విచారణలో అధికారులకు తెలిపారు. ఈ నేపధ్యంలోనే సీన్ రిక్రియేషన్ టెస్ట్ చేస్తున్నారు.నిందితులకు జూన్ 2 వరకూ సీబిఐ కస్టడీ విధించారు.
వైరల్ అవుతున్న రైతన్న పాట.. చూస్తే ఏడుపొస్తది!
"రైతునై పుట్టినాను రైతునై పెరిగినాను.. రాజకీయం నేను చేస్తే రంది లేకుండా ఉందునయ్యా" అంటూ ఒక రైతు వడ్ల కుప్ప దగ్గర నిలబడి పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 6 మంత్స్ కష్టపడి పండించిన వడ్లను కొనే నాథుడే లేడంటూ ఈ రైతు చాలా ఎమోషనల్‌గా ఈ పాట పాడాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసి నెటిజన్లు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీలో అక్కినేని నాగ చైతన్య కేసు !!
తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ వాడుతున్న వారిపై నటుడు అక్కినేని నాగచైతన్య దాఖలు చేసిన 'పర్సనాలిటీ రైట్స్' కేసులో ఢిల్లీ హైకోర్టు త్వరలోనే కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. తన పేరును అశ్లీల వెబ్‌సైట్లలో వాడటం, మాజీ భార్య సమంతతో కలిపి ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, యూట్యూబ్‌లో వ్యక్తిగత ట్రోలింగ్‌కు పాల్పడటం వంటి వాటిపై చైతన్య కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణకు పరిమితులు ఉంటాయని పేర్కొంది. త్వరలోనే దీనిపై తీర్పు నివ్వనుంది.
విదేశీ బీచ్ ల క్లీనింగ్ ఎలా జరుగుతుందో చూశారా?
బీచ్ లలో విహరించే విజిటర్స్ ఒక్కోసారి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. కానీ అది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆ వస్తువులు జనరల్ గా దొరకవు. కానీ విదేశీ బీచ్ లలో ఒక అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఆపరేషన్ జరుగుతుంది. అదే విజిటర్స్ వెళ్లిపోయాక బీచ్ ను జల్లెడ పట్టే మిషన్ తో లాగుతూ వెడతారు. అందులోంచి ఇసక జారిపోయి అక్కడ వదిలేసిన వస్తువులు దొరుకుతుంటాయి. బీచ్ క్లీనింగ్ విదేశాలలో ఎలా జరుగుతుందో ఈ వీడియో ఒక్కసారి చూడండి.

జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం వెనుక ..|
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అదే రోజు ప్రమాణం చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. జ్యోతిష్యాన్ని పూర్తిగా నమ్మే ఆయన, తన ఆస్థాన ఆస్ట్రాలజర్ ద్వారకానాథ్ పెట్టిన ముహూర్తానికే ఆ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. జూన్ 3 అత్యంత శుభ ముహూర్తమని, ఆ సమయంలో బాధ్యతలు చేపడితే ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకుండా ఐదేళ్ల పదవీకాలం సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

'పెద్ది' మూవీ టీమ్ వెనక్కి తగ్గింది!
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ జూన్ 4న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని హోం సెక్రటరీని అడిగితే నో రెస్పాన్స్. దాంతో ప్రొడక్షన్ టీమ్ తెలంగాణ హైకోర్టులో కేసు వేసింది. కానీ కోర్టు నుండి ఎలాంటి పాజిటివ్ ఆర్డర్స్ రాకపోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గి ఆ పిటిషన్ క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పెద్ది సినిమా నార్మల్ రేట్లకే థియేటర్స్‌లోకి రానుంది.
డ్యాన్స్ అదరగొట్టేసిన తేజస్విని
నటుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని డ్యాన్స్ అదరగొట్టేసింది. ఆమె డ్యాన్స్ మాస్టర్ తో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

భార్యని కోడిపుంజు పొజిషన్ లో (Rooster) కూర్చోమన్న శాడిస్ట్ !!
ముంబైలో ఒక కిరాతక భర్త తన భార్యను గృహనిర్బంధం చేసి, గంటల తరబడి క్రూరంగా హింసించాడు. గృహవివాదం నేపథ్యంలో 25 ఏళ్ల అర్బాజ్ సయ్యద్ అనే రౌడీషీటర్, తన భార్యను కత్తితో బెదిరించి దాదాపు నాలుగు గంటల పాటు 'కోడిపుంజు' (Rooster) పొజిషన్‌లో ఉంచాడు. యాసిడ్ పోస్తానని, చంపేస్తానని భయపెట్టాడు. ఆమె ప్రాణాలు దక్కించుకుని పుట్టింటికి పారిపోగా, అక్కడికి కూడా వెళ్ళి ఆమెపై కత్తితో దాడి చేశాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్రంప్ హెల్త్ రిపోర్ట్: బరువు పెరిగినా బాస్ ఫిట్‌గా ఉన్నారట!
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (79) రీసెంట్‌గా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నారు. 22 మంది డాక్టర్ల టీమ్ చేసిన టెస్టుల ప్రకారం ఆయన ప్రెజెంట్ బరువు 108 kg కాగా, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 6kg పెరిగారు. బరువు కొంచెం ఎక్కువ ఉన్నా ఆయన మైండ్ అండ్ బాడీ యాక్టివ్‌గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. కంటిన్యూస్‌గా ప్రజలతో షేక్‌హ్యాండ్స్ ఇవ్వడం, హార్ట్ మెడిసిన్స్ వాడడం వల్ల కాళ్ల వాపు, చేతులపై చిన్న మచ్చలు వచ్చాయట. దీంతో డైట్ కంట్రోల్, ఎక్సర్‌సైజ్ చేయాలని డాక్టర్లు సజెస్ట్ చేశారు.

అమెరికాలో గుజరాత్ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని నెబ్రాస్కాలో ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో గుజరాత్‌కు చెందిన హోటల్ ఉద్యోగి కవన్‌కుమార్ పటేల్ (27) అనే ఇండియన్ కి అ క్కడి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హోటల్ గది అద్దె తగ్గించడం కోసం హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) ముఠాకు హోటల్ డ్రాయర్ నుంచి డబ్బులు చెల్లించి, మైనర్ బాలికపై పటేల్ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పనిష్ మెంట్ పూర్తయ్యాక అతడిని భారత్‌కు డిపోర్ట్ (నగరం నుంచి బహిష్కరణ) చేస్తారు.