దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం: 9 మంది అరెస్ట్

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ISI), అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న తొమ్మిది మంది ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఢిల్లీ, ముంబై నగరాల్లోని అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లపై దాడులకు వీరు స్కెచ్ వేశారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఈ ముఠాను పట్టుకోగా, వీరి వెనుక ఉన్న విదేశీ హ్యాండ్లర్ల లింకులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



