Latest

హుక్కా బార్ నడపడం ప్రాథమిక హక్కు కాదు
హుక్కా బార్ నడపడం ఎవరి ప్రాథమిక హక్కు కాదని..ప్రజల ఆరోగ్యం కోసం స్టేట్ గవర్నమెంట్‌కి దాన్ని మూసేనే హక్కు ఉందని లక్నో హైకోర్టు చెప్పింది. తమ వ్యాపారాన్ని మూసేసారని హుక్కా బార్ యజమానులు కోర్టులో కేసు ఫైల్ చేయగా, ఆ కేసుపై తీర్పు ఇచ్చింది. హుక్కా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందని, అది కూడా తాగుడు, జూదం లాంటిదే అని చెప్పింది. దాన్ని సాధారణ వ్యాపారంలా చూసి కాపాడటం కుదరదని కన్ఫర్మ్ చేసింది. జనం ఆరోగ్యం కోసం దాని మీద రిస్ట్రిక్షన్స్ విధించే హక్కు గవర్నమెంట్‌కి ఉందని వివరించింది.
అమెరికాలో ఇండియన్స్‌కి ఇన్సల్ట్!
అమెరికాలో ఇండియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు. ఒక అమెరికన్ వ్యక్తి ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తూ చాలా రూడ్‌గా మాట్లాడాడు. "మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా కంట్రీలో మీరు ఉండటం మాకు నచ్చట్లేదు, వెంటనే మీ కంట్రీకి వెళ్ళిపోండి" అంటూ ఇన్సల్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
TDP అకౌంట్‌లో చీప్ ట్రిక్స్.. తులసి చందు సీరియస్ క్వశ్చన్స్!
TDP అఫీషియల్ ట్విట్టర్ పేజీ ఒక ‘ట్రోల్ పేజీ’ లాగా మారిపోయిందని జర్నలిస్ట్ తులసి చందు ఫుల్ ఫైర్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఫోటోకు YSRCP కండువా వేసి, దాన్ని TDP అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం చాలా దారుణమన్నారు, ఒక పెద్ద పొలిటికల్ పార్టీ అయ్యుండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో "HOW DARE YOU TDP!" అంటూ గట్టిగా క్వశ్చన్ చేశారు.

ఉత్తర భారతానికి చల్లని న్యూస్
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలకు ఎండల నుంచి బిగ్ రిలీఫ్ . కొత్తగా ఏర్పడిన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావంతో మే 29 నుంచి ఎండలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది., గంటకు 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 8 డిగ్రీల వరకు తగ్గొచ్చు. మరో వైపు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతూ ముందుకు సాగుతున్నాయి.

నీటమునిగిన ధాన్యం.. ఫార్మర్స్‌కు తీవ్ర నష్టం
TG: అకాల వర్షాలతో ఫార్మర్స్ ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ఉమ్మడి మెదక్ జిల్లా, యాదాద్రిభువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్ సహా పలు జిల్లాల్లోని ధాన్యం కల్లాలు చిన్నపాటి చెరువులను తలపించాయి. సరిపడా టార్ఫాలిన్ కవర్లు లేకపోవడం, కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు లోతట్టులో ఉండడంతో ధాన్యం తడిసి అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు గవర్నమెంట్‌ను రిక్వెస్ట్ చేశారు.

'బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి'
TG: బక్రీద్ ఫెస్టివల్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల చెప్పారు. బక్రీద్ పండుగ సందర్భంగా భైంసా టౌన్‌లోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట పోలీస్ బందోబస్తును ఆమె స్వయంగా పరిశీలించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పట్టణంలో గట్టి భద్రతా ఏర్పాటు చేశామన్నారు. ఈ పండుగ నేపథ్యంలో ఇదివరకే ఇరువర్గాల ప్రజలతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించామన్నారు.

సిద్దరామయ్య ఆశీస్సులు తీసుకున్న శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం క్యాబినెట్ సహచరులకు బ్రేక్‌ఫాస్ట్ మీట్ ఇచ్చి థాంక్స్ చెప్పారు. ఈ మీట్ కి హాజరైన కాబోయే సీఎం శివకుమార్ సిద్ధరామయ్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. ముంబై వెళ్లిన ఆయన ఎప్పుడు తిరిగి వస్తారో క్లారిటీ లేదు.
ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ నివాళులు
TDP వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 103 వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.
మామిడి పళ్లు కెమికల్స్ తో పండించారా ? జస్ట్ 10 సెకండ్లలో తెలుసుకోవచ్చు
మామిడి పండ్లు సీజన్ వచ్చిందంటే అందరికీ వచ్చే ఒకే ఒక్క డౌట్. అవి సహజంగా పండాయా ? కెమికల్స్ వేసి పండించారా ? అందుకే ఎంతో ఇష్టమైన మామిడి పండ్లని తినడానికి కూడా ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు. కానీ జస్ట్ పదే సెకండ్లలో వాటిని ఎలా పండించారో తెలుసుకోవచ్చు. ఒంగోలుకు చెందిన డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ఏం చెబుతున్నారో మీరూ వినేయండి మరి.

ట్రంప్ దున్నపోతు సేఫ్ ..!
SMలో వైరల్ అయిన ట్రంప్ దున్నపోతుని అధికారులు జూకి తరలించారు. బంగ్లాదేశ్ లో నారాయణగంజ్ కు చెందిన ఒక ఫామ్ లో అరుదైన అల్బినో జాతికి చెందిన దున్నపోతు ఉంది. దాని తలపై గోల్డెన్ హెయిర్ సేమ్ టు సేమ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ జుట్టుని పోలి ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి క్రేజ్ ఏర్పడింది. 700 కిలోలున్న ఈ దున్నపోతుని బక్రీద్ సందర్భంగా ఒక కస్టమర్ కొనుక్కున్నాడు. ఇంక అది బలైపోతుందని అందరూ తెగ బాధపడ్డారు. కానీ ఆ దున్నపోతుకున్న క్రేజ్ చూసి అధికారులు దానిని జూకి తరలించారు.

రీల్ లైఫ్ లో నటుడు.. రియల్ లైఫ్ లో క్రిమినల్ - ఇదో క్రైమ్ థ్రిల్లర్
బాలీవుడ్ స్టోరీని మించిన ట్విస్ట్ లున్న ఒక రియల్ స్టోరీ ఇది. 2005లో అహ్మదాబాద్‌లో జరిగిన ఒక గొడవ, హత్య కేసులో హేమంత్ మోదీ అనే వ్యక్తికి కోర్టు జీవితఖైదు విధించింది. 2014లో పరోల్‌పై బయటకు వచ్చిన అతడు.. తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే… ముంబై చేరి పేరు మార్చుకుని బాలీవుడ్‌లో సెటిల్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. అయినా పోలీసులు అతనిని గుర్తించలేకపోయారు. 12 ఏళ్ల తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఇరాన్ పై మళ్లీ అమెరికా దాడులు.. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లో ఉద్రిక్తత
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్స్ కి చేరాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో తమ సైనిక బలగాలకు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఇరాన్ వల్ల ముప్పు పొంచి ఉందనే నెపంతో యూఎస్ ఆర్మీ ఇరాన్‌లోని ఒక మిలిటరీ సైట్‌పై విరుచుకుపడింది. తమ వైపు దూసుకొచ్చిన ఇరాన్‌కు చెందిన పలు డ్రోన్లను కూడా అమెరికా దళాలు కూల్చివేసినట్టు యూఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. శాంతి చర్చలు కొనసాగుతున్న టైమ్‌లో ఈ దాడులు జరగడం గ్లోబల్ టెన్షన్ పెంచుతోంది. ఆయిల్ ధరలపై కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది

అధికారం లేకపోవడంతో అరాచకం సృష్టిస్తున్నారు: మందుల సామేల్
TG: బీఆర్ఎస్ పార్టీ లీడర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్క సుమన్ నిన్న సింగరేణి సభలో మాట్లాడిన తీరును తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. ప్రజల పన్నులతో కట్టిన సింగరేణి ఆఫీసును తగలబెట్టాలి, రైల్వేలైను కోసి వేయాలి, మిలిటెంట్ ఉద్యమం చేయాలని అనడం సరికాదన్నారు. అధికారం లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారన్నారు.

ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీతక్క
TG: ప్రజాసమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి దనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో బుధవారం నిర్వహించిన 'ప్రజాదర్బార్'కు విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి సీతక్క స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ దర్బార్‌లో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఇతర సమస్యలపై స్థానికులు పెద్దఎత్తున మంత్రికి దరఖాస్తులు అందజేశారు.

రైతులు పుకార్లు నమ్మొద్దు : కలెక్టర్ ప్రతిమాసింగ్
TG: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు పుకార్లను నమ్మి మోసపోవద్దని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నర్సాపూర్ మండలం తుల్జారంపేట్ గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నిన్న కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా 400 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని రిపోర్ట్ ఉందని, ఆరబెట్టి తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.

తెలంగాణలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఏంటి: మందుల సామెల్
TG: హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటిపై ఆంధ్ర పోలీసులు వెళ్లడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పోలీసుల పెత్తనం ఏంటని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాదులో ఇంకా మీ అయ్య జాగీరు ఉందా, ఇక్కడ మీ పెత్తనం ఏంటని ధ్వజమెత్తారు. మీ అరాచకం తెలంగాణలో నడవదు అని అన్నారు. ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో ఏం పని బతకడానికి వచ్చి పెత్తనం చేయడం సరికాదన్నారు.

నీటి గుంతలో పడి ముగ్గురు మృతి
AP: పొలంలో నల్లనేరేడు పండ్ల కోసం వెళ్లిన ముగ్గురు బాలురు నీటి గుంతలో పడి మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం నారనాగేపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో డెడ్‌బాడీలను బయటకు తీశారు. ముగ్గురు బాలురు మృతితో నారనాగేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గొంతు కోసి మహిళ దారుణ హత్య
TG: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ(50)పై దుండగులు దాడి చేసి కాళ్లు, గొంతు కోసి హతమార్చారు. మహిళ మెడలో బంగారం, చెవులకు కమ్మలు, కాళ్లకు ఉన్న వెండి కడియాల కోసమే దుండగులు మహిళను చంపినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎవరెస్ట్ పై చనిపోయిన హైదరాబాదీ ! ఫ్యామిలీ ఏం చేసిందంటే..
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరుగుప్రయాణంలో మరణించిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారి (53) డెడ్ బాడీని అక్కడే వదిలేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఎవరెస్ట్ పర్వతం శివుని నివాసమని, ఆయనను అక్కడే ప్రశాంతంగా విశ్రమించనివ్వడం సరైనదని కుటుంబసభ్యులు భావించారు. అంతేకాకుండా, తీవ్రమైన వాతావారణం, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరెస్ట్ 'డెత్ జోన్' (హిల్లరీ స్టెప్) నుండి మృతదేహాన్ని తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైన ,కష్టతరమైన ప్రక్రియ కావడంతో వారు ఈ డెసిషన్ తీసుకున్నారు.

ఆ రెండు అంశాల కోసమే మోడీతో విజయ్ భేటీ
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జోసెఫ్ విజయ్ తొలిసారిగా మోడీని కలసింది రెండు అంశాలపై విన్నవించడానికే నని తెలుస్తోంది. కర్ణాటక మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని ప్రధానిని కోరేందుకు, ప్రభుత్వ ఫంక్షన్స్ లో ప్రారంభంలో తమిళ రాష్ట్ర గీతాన్ని ఆలపించేందుకు అనుమతి ఇవ్వాలనీ విజయ్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ ఈ మధ్యనే ఆ ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రానికి సబ్ మిట్ చేశారు. దాంతో తమిళనాట నిరసనలు రేగాయి. అలాగే హాలండ్ నుండి పురాతన రాగి పలకలను తీసుకువచ్చినందుకు ప్రధానికి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

సిద్దూనీ డీకే ఎలా దారికి తెచ్చారంటే !!- అసలు రీజన్ ఇదే !
కర్ణాటకలో డి.కె శివకుమార్ సిద్దరామయ్యకు (సిద్దు) పెద్ద ఝలకే ఇచ్చారు. ఇన్నాళ్లూ నెంబర్ గేమ్ పై నమ్మకం పెట్టుకున్న సిద్దరామయ్య తన పక్కన ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం తననెవరూ ఏం చేయలేరని అనుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చారు. కానీ డీకె మాత్రం కాంగ్రెస్ టాప్ బ్యాండ్ ని నమ్ముకున్నారు. హై కమాండ్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటూ రెండున్నరేళ్లు కంప్లీట్ కాగానే హైకమాండ్ తలుపు తట్టారు. రాజస్థాన్ తరహా క్రైసిస్ రాకూడదని, ఎన్నికల ముందు గొడవలు ఇష్టం లేని రాహుల్ సిద్దరామయ్యకు ఏకాంత భేటీలో కుర్చీ దిగక తప్పదని తేల్చేశారు. ఓబీసీ లీడర్ గా మంచి ఫ్యూచర్ చూపిస్తామని ఆశపెట్టడంతో కథ సుఖాంతం అయ్యింది.