← Back to news

రీల్ లైఫ్ లో నటుడు.. రియల్ లైఫ్ లో క్రిమినల్ - ఇదో క్రైమ్ థ్రిల్లర్

By AR· 28 May 2026· Ahmedabad
రీల్ లైఫ్ లో నటుడు.. రియల్ లైఫ్ లో క్రిమినల్ - ఇదో క్రైమ్ థ్రిల్లర్

బాలీవుడ్ స్టోరీని మించిన ట్విస్ట్ లున్న ఒక రియల్ స్టోరీ ఇది. 2005లో అహ్మదాబాద్‌లో జరిగిన ఒక గొడవ, హత్య కేసులో హేమంత్ మోదీ అనే వ్యక్తికి కోర్టు జీవితఖైదు విధించింది. 2014లో పరోల్‌పై బయటకు వచ్చిన అతడు.. తిరిగి జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. సీన్ కట్ చేస్తే… ముంబై చేరి పేరు మార్చుకుని బాలీవుడ్‌లో సెటిల్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’ లాంటి క్రేజీ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. అయినా పోలీసులు అతనిని గుర్తించలేకపోయారు. 12 ఏళ్ల తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.