Latest

ప్రతీ ఉదయం.. ప్రతిఒక్కరికీ ఎంతో ప్రత్యేకం
ప్రతీ ఉదయం ప్రతిఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైంది. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించడానికి ఉదయం చాలా ముఖ్యమైన సమయం. నిద్ర లేవడం ఫోన్ పట్టుకుని స్టేటస్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్లతో మునిగిపోకుండా సూర్యోదయం ముందే లేవాలి. ఇలా తొందరగా నిద్ర లేవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచి, శక్తిని పెంచుతుంది. ఆలస్యంగా లేవడం అలసటకు, నీరసానికి కారణమవుతుంది. బాల్కనీలో లేదా బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. ఉదయపు వ్యాయామం లేదా యోగా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ చిన్న చిన్న హెల్త్ టిప్స్ డైలీ ఫోలో అయితే శరీరం ఆరోగ్యంగా, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ పై కామెడీ చేసి దుబాయ్ లో ఇరుక్కున్న స్టాండప్ కమెడియన్
సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో కారణంగా ముంబైకి చెందిన స్టాండప్ కమెడియన్ యశ్ భరద్వాజ్ దుబాయ్‌లో 47 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత మే 5న ఆయనను భారతదేశానికి డిపోర్ట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో దుబాయ్‌లో గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయడం లేదంటూ ఆయన సరదాగా ఒక కామెడీ రీల్ అప్‌లోడ్ చేశారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అక్కడ జీపీఎస్ సమస్యలు తలెత్తుతున్న సమయంలో ఈ వీడియో పెట్టడంతో, దీనిని జాతీయ భద్రతకు ముప్పుగా భావించిన దుబాయ్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. తన జీవితంలో ఇది అత్యంత కష్టమైన కాలమని యశ్ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

త్వరలో గాళ్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్న ఆమీర్ ఖాన్
బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ జులై 5న తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ గౌరీ స్ప్ర ట్ ను మ్యారేజ్ చేసుకోబోతున్నారు.గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన ప్రేయసిని మీడియాకు పరిచయం చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో గౌరీ తన ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.దాదాపు 18 నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆయన, గత సంవత్సరం మీడియాతో మాట్లాడుతూ.. "ఆమె బెంగళూరులో ఉండేది, కాబట్టి నేను ఆమెను కలవడానికి అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మీడియా నిఘా తక్కువగా ఉండటం వల్ల మా విషయం బయటకు రాలేదు" అని సరదాగా జోక్ చేశారు. గతంలో ఆమీర్ రీనా దత్తా, కిరణ్ రావులను పెళ్లి చేసుకున్నారు.

టీఎంసీలో క్రైసిస్... మమతా బెనర్జీకి ట్రబుల్స్ !!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో పెను సంక్షోభం నెలకొంది. తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ రతీంద్ర బోస్ గుర్తించారు. పార్టీలోని 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఆయనకు మద్దతు పలికారు. దీంతో మమతా బెనర్జీ పార్టీపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు, మమతా బెనర్జీ సమర్పించిన లేఖలోని సంతకాలు ఫోర్జరీ అని తేలడంతో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ తన పదవికి రాజీనామా చేశారు.
కేటిఆర్ కామెంట్స్ పై పవన్ కల్యాణ్ రిప్లయ్ !!
కేటీఆర్ ఏమన్నారో తనకు తెలియదని, తాను వినలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్నటి తన ప్రెస్ మీట్ పై బీఆర్ ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ను ఆయన దృష్టికి తేగా ఈ కామెంట్స్ చేశారు. కేటీఆర్ తనకు మంచి దోస్త్ అనీ, చాలా సార్లు ఆయన్ను కలసినట్లు, ఇద్దరికీ మంచి టేస్ట్ లు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆయన మంచిగానే మాట్లాడి ఉంటారని అన్నారు.

AP రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు!..మరో 500 సిఎన్జి బస్సులు
ఆర్టీసీలో కాలం చెల్లిన, ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దశలవారీగా మొత్తం 6వేల బస్సులు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో విద్యుత్ బస్సులు 5,500, సీఎన్జీ బస్సులు 500 ఉంటాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సిటీ బస్సుల్లో కాలం చెల్లినవి ఏవేవి ఉన్నాయో, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అవే సర్వీసులుగా నడపనున్నారు. ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. వీటిలో 300 బస్సులు జులైలో రోడ్డెక్కనున్నాయి.

అమెరికాలో మధు యాష్కీ భార్యకు కారు ప్రమాదం ః తీవ్రగాయాలు
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సతీమణికి అమెరికాలో కారు యాక్సిడెంట్ అయ్యింది.కుమార్తె గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. బోస్టన్ నుంచి న్యూయార్క్ కు వస్తుండగా భారీ వర్షం కారణంగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది.డాక్టర్ కూడా అయిన సుచీ యాష్కీకి రిబ్స్ విరిగాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి జంట రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. లగేజీ ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ వేర్వేరు కార్లలో ట్రావెల్ చేస్తున్నారు. మధు యాష్కీ ఫౌండేషన్ ద్వారా డాక్టర్ సుచీ పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు..

వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నం.. ఉద్రిక్తత
AP: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ లీడర్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో వైసీపీ ఆఫీస్‌పై దాడికి యత్నించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్‌లోని వైఎస్సాఆర్ సీపీ ఆఫీస్‌పై టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు వెళ్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది.

తెలంగాణలో ప్రత్యామ్నాయం TRS: నల్లమాస శ్రీకాంత్
TG: తెలంగాణ స్టేట్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలంగాణ రక్షణ సేననే అని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జ్ డాక్టర్ నల్లమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో రెండేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ పవర్‌లోకి వస్తుందన్నారు. గిరిజన జిల్లాగా ఉన్న మానుకోటలో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

'బీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది'
TG: గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అవినీతి, అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం విలేజ్‌లో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన సబ్ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పేదలు ఆకలితో ఉండవద్దని ఒక్కోవ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం: మంత్రి అడ్లూరి
TG: తెలంగాణ మీ జాగీరా అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో గోదావరి పుష్కరాల పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీరేనని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను హీరోగా అందరూ అభిమానిస్తారని, కానీ తెలంగాణపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం సహించమన్నారు.
పవన్ కళ్యాణ్: హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉంది!
AP ప్రజలు ఓటు వేసి గెలిపించినా కూడా.. తన ఇల్లు ఉన్నది మాత్రం హైదరాబాద్‌లోనే అని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రెసెంట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. APలో పెద్ద పోస్ట్‌లో ఉంటూ, "హైదరాబాద్‌లోనే నా ఇల్లు ఉంది" అని పవన్ అనడం సోషల్ మీడియాలో పొలిటికల్ చర్చకు దారితీసింది.
పవన్ కళ్యాణ్: 100% తెలంగాణ మీదే!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా జరిగిన కాంట్రవర్సీపై రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అనేది 100% అక్కడి మట్టి బిడ్డలదే అని స్పష్టం చేశారు. తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని కొందరు అంటున్నారని, అలాంటి వాళ్లను ఉద్దేశించే తాను ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చిందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అసలు తెలంగాణ భారతదేశంలో భాగం కాదా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ప్రెసెంట్ #JanaSenaTelangana హ్యాష్‌ట్యాగ్‌తో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ ల్లో BRS మెంబర్‌షిప్!
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ మెంబర్స్‌కి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల నుంచే BRS పార్టీ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను డిజిటల్ మోడ్‌లో స్టార్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రాబోయే ఒక నెల రోజుల పాటు పార్టీ కోసం ఫుల్ గా కష్టపడి పనిచేయాలని లీడర్స్, వర్కర్లకు పిలుపునిచ్చారు.
కన్నతల్లిపైనే అత్యాచార యత్నం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగ్గదాపురంలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి ఫుల్‌గా ఆల్కహాల్ తీసుకొని, కన్నతల్లిపైనే రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ తల్లి గట్టిగా కేకలు వేయడంతో అలర్ట్ అయిన గ్రామస్తులు వెంటనే అక్కడికి వెళ్లారు. సీన్ చూసి షాక్ అయిన లోకల్స్. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఇన్సిడెంట్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
కోమటిరెడ్డికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓపెన్ చాలెంజ్!
మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్‌పై EX మినిస్టర్, BRS MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ తో ఆంధ్రా ప్రజలకు ఒక్క కాంట్రాక్ట్ కూడా దక్కకూడదని, దానికోసం ఒక చట్టం తెస్తానని కోమటిరెడ్డి అనడంపై తలసాని కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే మీ CMని ఒప్పించి ఒక చట్టం తీసుకురావాలని, అలా తెస్తే తాను వెంటనే MLA పోస్ట్‌కి రిజైన్ చేయడానికి రెడీ అని తలసాని ఓపెన్ చాలెంజ్ చేశారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ వార్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
కర్ణాటక CMగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం!
కర్ణాటక పాలిటిక్స్‌లో ఎన్నో రోజుల నుండి wait చేస్తున్న బిగ్ మూమెంట్ రానే వచ్చింది. కర్ణాటక కొత్త CMగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు కాంగ్రెస్ టాప్ లీడర్స్ అంతా వచ్చారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కేరళ CM సతీశన్, అలాగే తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా ఈ సెర్మనీకి అటెండ్ అయి డీకే శివకుమార్‌కి కంగ్రాట్స్ చెప్పారు. ప్రెసెంట్ ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్‌కు గద్దర్ కూతురు కౌంటర్!
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మాటలను ఖండిస్తూ. "తెలంగాణ కచ్చితంగా మా ముత్తాతల జాగీరే,ఇప్పుడు మా జాగీరు, రేపు పొద్దున మా పిల్లల జాగీరే అవుతుంది. ఎన్నో త్యాగాలు చేసి మేము తెలంగాణను సాధించుకున్నాం అంతే తప్ప. ఎవరో డబ్బులు ఇచ్చి, లాబీయింగ్ చేసి తెచ్చింది కాదు" అని వెన్నెల ఫైర్ అయ్యారు. గద్దర్ కూతురు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.

సింగిల్ ఎగ్జిట్.. ఇల్లీగల్ రూమ్స్ ... ఢిల్లీ ఘోరానికి రీజన్స్
ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగిన బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ BnB దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ రూమ్స్ నిర్మించడంతో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంది. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో బయటపడే మార్గం లేక అది కాస్తా డెత్ ట్రాప్ గా మారింది. కనీసం ఫైర్ సేఫ్టీ లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని తేలింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
తెలంగాణ లో 91 మంది ఖైదీలు రిలీజ్!
తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. జైల్లో మంచిగా ఉంటూ గుడ్ behaviour చూపించిన 91 మంది ఖైదీలను విడుదల చేసింది. ఈ రిలీజ్ అయిన వాళ్లలో 85 మంది మెన్, అలాగే ఆరుగురు ఉమెన్ ఖైదీలు ఉన్నారని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా చెప్పారు. ఖైదీల మైండ్‌సెట్‌లో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడమే కాకుండా, జైళ్లను స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లుగా మారుస్తున్నామని ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఈ ఫేక్ న్యూస్ అస్సలు నమ్మొద్దు!
సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక మెసేజ్‌పై IPS ఆఫీసర్ V.C. సజ్జనార్ గట్టిగా రియాక్ట్ అయ్యారు. వాట్సాప్ కాల్స్ అన్నీ రికార్డ్ అవుతున్నాయంటూ వస్తున్న న్యూస్ లో అస్సలు నిజం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. "ఇలాంటి విషయాలపై పాస్ట్‌లోనే చాలా సార్లు క్లారిటీ ఇచ్చాం. అయినా సరే కొందరు కావాలనే ఈ అబద్ధాలను షేర్ చేస్తున్నారు" అని ఆయన చెప్పారు. రెస్పాన్సిబిలిటీ ఉన్న సిటిజన్స్‌గా ఇలాంటి ఫేక్ న్యూస్ ను నమ్మొద్దని, ఎవరికీ షేర్ చేయొద్దని సజ్జనార్ చెప్పారు. ఇలాంటి తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లపై పోలీస్ యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.