తెలంగాణలో ప్రత్యామ్నాయం TRS: నల్లమాస శ్రీకాంత్

TG: తెలంగాణ స్టేట్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలంగాణ రక్షణ సేననే అని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇంఛార్జ్ డాక్టర్ నల్లమాస శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో రెండేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ పవర్‌లోకి వస్తుందన్నారు. గిరిజన జిల్లాగా ఉన్న మానుకోటలో గిరిజనులను ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.


