← Back to news

త్వరలో గాళ్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్న ఆమీర్ ఖాన్

By DS· 3 Jun 2026· Ndtv· Mumbai
త్వరలో  గాళ్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్న ఆమీర్ ఖాన్

బాలీవుడ్ యాక్టర్ ఆమిర్ ఖాన్ జులై 5న తన లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్ గౌరీ స్ప్ర ట్ ను మ్యారేజ్ చేసుకోబోతున్నారు.గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ ఖాన్ తన ప్రేయసిని మీడియాకు పరిచయం చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో గౌరీ తన ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.దాదాపు 18 నెలల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆయన, గత సంవత్సరం మీడియాతో మాట్లాడుతూ.. "ఆమె బెంగళూరులో ఉండేది, కాబట్టి నేను ఆమెను కలవడానికి అక్కడికి వెళ్లేవాడిని. అక్కడ మీడియా నిఘా తక్కువగా ఉండటం వల్ల మా విషయం బయటకు రాలేదు" అని సరదాగా జోక్ చేశారు. గతంలో ఆమీర్ రీనా దత్తా, కిరణ్‌ రావులను పెళ్లి చేసుకున్నారు.

More in Cinema