Latest

డికే శివకుమార్ కు కర్ణాటక సీఎం పోస్ట్ వెనక అంత జరిగిందా?
కర్ణాటక సీఎం పీఠం డి.కె. శివకుమార్ కి దక్కడం అంత ఈజీగా అవలేదు. సొంత పార్టీలో అంతర్గత శత్రువులు, సిద్ద రామయ్య ఎత్తుకి పై ఎత్తులు వేసే నైజం...ఒక దాని తర్వాత ఒకటిగా తలెత్తిన సవాళ్లు అన్నింటినీ అధిగమించి ఇప్పుడు సీఎం పీఠం డీకే ఎక్కబోతున్నారు. సీఎం కాలేనేమోనని ఆయన చాలాసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేశారని ఆయన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ చెప్పారు. తాను ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి గైడెన్స్ ఇచ్చానని, శివకుమార్ పోరాట పటిమ వల్లే ఇప్పుడు అనుకున్నది జరిగిందని అన్నారు. ముళ్ల బాట లాంటి ఈ పదవిని జాగ్రత్తగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తూ నిర్వహించాలని ఆయనకు సూచించారు.

ఉపాధి పనుల్లో వింత ఘటన.. బయటపడ్డ సాఫ్ట్‌వేర్ లోపం
TG: ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ ఇటీవల కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించాడు. ఉపాధి పనులకు వెళ్లిన శ్రీనివాస్ ఫేస్ రికగ్నేషన్ యాప్‌తో ఫోటో తీయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోటో తీసుకోలేదు. చివరికి గడ్డం, మీసాలను పోలినట్లు నల్లని బొగ్గు కలర్ వేసుకున్నాడు. తలపై ఓ మహిళ జుట్టును వేసుకోగా ఫేస్ రికగ్నేషన్ యాప్ వెంటనే ఫోటో తీసుకుంది. హమ్మయ్య అంటూ శ్రీనివాస్ ఉపాధి పనుల్లో పాల్గొన్నాడు.

నేషనల్ హైవేపై యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్‌డెడ్
TG: నేషనల్ హైవేపై జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు బొలెరో వాహనంలో ప్రయాణిస్తుండగా, వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని ముమ్మల్లపల్లి వద్ద అతివేగంగా వచ్చిన లారీ బొలెరోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

భారత మామిడిపై జపాన్ నిషేధం .. ఎందుకంటే
భారత మామిడిపండ్ల దిగుమతిని జపాన్ నిలిపివేసింది. 20 ఏళ్ల తర్వాత ఆల్ఫోన్సో, కేసర్, లాంగ్రా, బంగినపల్లి వంటి ఇండియన్ మామిడిపండ్ల దిగుమతులను జపాన్ స్టాప్ చేసింది. ఇటీవల భారత్ నుంచి వెళ్లిన మామిడి షిప్‌మెంట్లలో ప్రమాదకరమైన ఫ్రూట్ ఫ్లైస్ అంటే పళ్లపై ఉండే క్రిమి కీటకాలు ఉన్నట్లు అక్కడి ఆహార భద్రతా అధికారులు గుర్తించడమే దీనికి కారణం. క్వాలిటీ విషయంలో జపాన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. ఏప్రిల్-జూన్ పీక్ సీజన్‌లో ఈ బ్యాన్ రావడంతో భారత్ ఎగుమతిదారులకు భారీ నష్టం తప్పేలా లేదు.
వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో శరవేగంగా కంచె నిర్మాణం
దేశ రక్షణకు కీలకమైన WB సరిహద్దుల్లోని 600 Acrను BSFకు ఇవ్వాలని నిర్ణయించిన అక్కడి GOVT 142.79 ఎకరాలను అప్పగించింది. ఈ భూముల్లో BSF కంచె నిర్మాణ పనుల్ని చేపట్టింది. కూచ్ బీహార్, జల్పాయ్ గురి, డార్జిలింగ్, ఉత్తర&దక్షిణ దినాజ్పుర్, మాల్దా, ముషీరాబాద్, నాడియా, 24 పరగణాలలో పనులు కొనసాగిస్తోంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు దాడులు చేస్తున్నారు. వీటిని అధిగమిస్తూ BSF, CRPF పనులు కొనసాగిస్తున్నాయి.

బస్‌స్టేషన్‌లో చోరీ.. 24 అవర్స్‌లో రికవరీ
TG: మెదక్ జిల్లా రామాయంపేట బస్‌స్టేషన్‌లో బుధవారం జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీస్‌లు 24 అవర్స్‌లో ఛేదించారు. కర్ణాటక స్టేట్‌కు చెందిన ఇద్దరు మహిళ నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేత కాలే, శిల్పా వేలును రిమాండ్‌కు తరలించినట్లు రామాయంపేట సీఐ సైదా నాయక్ తెలిపారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన SI బాలరాజు, పోలీస్ సిబ్బందిని అభినందించారు.

ఎవరూ ఆవులను బలి ఇవ్వొద్దు: ముస్లిం లీడర్స్
TG: జాతీయ పక్షి నెమలి మాదిరిగానే ఆవును కూడా నేషనల్ యానిమల్‌గా ప్రకటించాలని చేగుంటలోని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. గురువారం బక్రీద్ ఫెస్టివల్ సందర్భంగా చేగుంట టౌన్‌లోని ఈద్గాలో ముస్లిం సోదరులు శాంతియుత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం మతపెద్దలు మాట్లాడుతూ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!
పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పర్సన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దేశంలో పెట్రోల్ రేషన్ విధించాలని ఆయన కోరారు. పేద, మధ్య తరగతి వాళ్లకు ఒక రేటు, ధనవంతులకు మరొక రేటుతో పెట్రోల్ అమ్మాలని చెప్పారు. ముఖ్యంగా ఆడి లాంటి లగ్జరీ కార్లలో వచ్చేవాళ్లకు ఎక్కువ రేటుకు, చిన్న కారు లేదా బైకుల మీద వచ్చేవారికి తక్కువ రేటుకే పెట్రోల్ ఇవ్వాలంటూ ఆయన చేసిన ఈ ప్రపోజల్ అందరినీ ఆలోచింప చేస్తుంది.
దంచికొట్టిన వాన.. ఉక్కపోత నుండి ఢిల్లీవాసులకు భారీ ఊరట!
తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వాన పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్, గురుగ్రామ్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ ముందే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

నేషనల్ పాలిటిక్స్ కి పోను. స్టేట్ లోనే ఉంటా- సిద్ద రామయ్య !!
నేషనల్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. స్టేట్ లోనే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటానంటున్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. డి.కె శివకుమార్ ను ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు సీఎంగా నియమించడంతో సిద్దు తప్పుకున్నారు. అయితే రాజ్య సభ సీట్ రాహుల్ ఆఫర్ చేయగా తనకు నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని స్మూత్ గా రిజెక్ట్ చేశారు. కానీ సిద్దరామయ్య ఏజ్ ను, ఆయన పాలన తీరు కూడా పెద్ద ఎఫెక్టివ్ గా లేదనే ఉద్దేశం కూడా కాంగ్రెస్ హై కమాండ్ కు ఉంది. అందుకే ఆయన్ను తప్పించారు. స్టేట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటాననడం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జర్నలిస్టుల క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోయిన జనసేన లీడర్స్!
తెలంగాణ సీనియర్ జర్నలిస్టుల, యాక్టివిస్టులపై జనసేన లీడర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో తెలంగాణ జర్నలిస్టులు ఆ పార్టీ లీడర్ ను చుట్టుముట్టి గట్టిగా క్వశ్చన్ చేశారు. వారు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక, ఆ పార్టీ లీడర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించిన videos ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బాంబేలో సల్మాన్, ఇక్కడ చరణ్.. నాకు ఇద్దరూ భాయ్ లే !!
సినిమా కోసం బాడీని మార్చడమంటే మామూలు విషయం కాదు అంటున్నారు సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.'సుల్తాన్', 'దంగల్' చిత్రాల్లో సల్మాన్, అమీర్ ఖాన్‌లను రెజ్లర్స్‌గా మార్చిన సెలబ్రిటీ ట్రైనర్ రాకేష్ ఉద్దియార్.. ఇప్పుడు రామ్ చరణ్‌ను అప్కమింగ్ మూవీ 'పెద్ది' కోసం ఒక రేంజ్ 'క్రాస్ఓవర్ అథ్లెట్'గా రెడీ చేస్తున్నారు. "చరణ్ చాలా డిసిప్లిన్డ్. తెల్లవారుజామున 4 గంటలకే నన్ను నిద్ర లేపుతాడు" అని రాకేష్ చెప్పారు. అంతేకాదు, "బాంబేలో నాకు సల్మాన్ భాయ్ ఎలాగో.. సౌత్‌లో చరణ్ నాకు అలా 'భాయ్'తో సమానం" అంటూ వాళ్ల బాండింగ్‌ని షేర్ చేసుకున్నారు.
KTR పేరులో NTR పేరు ఉంది. దాన్ని మారుస్తారా?
ప్రెస్ క్లబ్ లో సాగర్ అనే ఆక్టర్ మాట్లాడుతూ KTR పేరులోనే తారక రామారావు ఉందని, మరి ఆ పేరును కూడా మారుస్తారా అని క్వశ్చన్ చేశారు. NTR విగ్రహాలు పెడుతున్నారంటూ కొందరు గొడవలు చేస్తున్నారని.. కానీ BRS టైమ్‌లో ఇన్ని విగ్రహాలు పెడుతుంటే అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని అడిగారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ కోసం మీరు పోరాడే పద్ధతి ఇదేనా? మిమ్మల్ని యూత్‌కి గైడ్ అనుకుంటున్నారు కానీ, ఇంత లో లెవెల్‌కి దిగజారుతారని అస్సలు అనుకోలేదు, అంటూ సాగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మహానాడు సభలో అనిత పవర్‌ఫుల్ స్పీచ్!
మహానాడు సభలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏ తల్లి చేయని ధైర్యం చేసిన నారా భువనేశ్వరి థాంక్స్ చెప్తూ. జగన్ మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో. నీలాగా యూత్ చేతికి గొడ్డళ్లు, కత్తులు ఇచ్చి రెచ్చగొట్టడం మా హిస్టరీ కాదు, అంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. గతంలో మైకులు లాక్కున్నా, స్టేజీలు పగలగొట్టినా ఒక్క అడుగు కూడా బ్యాక్ వెయ్యకుండా యూత్‌ను ముందుకు నడిపించడం లోకేష్ హిస్టరీ అని మాట్లాడారు. అనిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్
TG: రైతులు పండించిన ప్రతి గింజను స్టేట్ గవర్నమెంటే కొనుగోలు చేస్తుందని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని కలెక్టర్ అనురాగ్ జయంతిని అడిగి తెలుసుకున్నారు. రానున్న ఫోర్ డేస్‌లో అధికారులు అలెర్ట్‌గా ఉంటూ కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. జూన్ 1 నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు.

RGIA లో కుక్క!
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సీన్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే! ఒక స్ట్రే డాగ్ ప్యాసింజర్ ఏరియాలోకి వచ్చి మిగిలిపోయిన ఫుడ్ తింటూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎయిర్‌పోర్ట్ లాంటి హై సెక్యూరిటీ ప్లేస్‌లోకి కుక్క ఎలా వచ్చిందని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఇది మేనేజ్‌మెంట్ కేర్‌లెస్ అంటూ ఫుల్ ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలు క్లీన్‌లీనెస్ ఏమైందని ప్యాసింజర్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సీన్ అయితే ఫుల్ మెస్సీగా ఉంది!

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు!
హైదరాబాద్ గోల్డ్ లవర్స్‌కి ఇది ఒక మేజర్ రిలీఫ్! మే 28న గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. టెన్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ప్రైస్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ రేట్స్ రెండూ డిక్రీజ్ అవ్వడంతో మార్కెట్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ రేట్ కట్ అయ్యింది. ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్. త్వరగా ప్లాన్ చేసుకోకపోతే రేట్లు మళ్ళీ హై అయ్యే ఛాన్స్ ఉంది.

ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్
మాజీ మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో నిందితురాలిగా ఉన్న ట్విషా శర్మ అత్తగారు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ న CBI ఈరోజు భోపాల్‌లో అరెస్ట్ చేసింది. ఆమె ఇంట్లో దాదాపు 7 గంటల పాటు సోదాలు, విచారణ జరిపిన అనంతరం సీబీఐ ఈ చర్య తీసుకుంది. గిరిబాల సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు నిన్న రాత్రి (మే 27) రద్దు చేసింది. ఆమె దర్యాప్తుకు సహకరించడం లేదని, నోటీసులకు స్పందించడం లేదని కోర్టు తీవ్రంగా పరిగణించింది.మే 12న భోపాల్‌లోని అత్తవారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించగా, వరకట్న వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది.

మల్కాజ్గిరి లో డ్రోన్స్!
మల్కాజ్గిరి పోలీస్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ చూపిస్తున్నారు. ట్రాఫిక్ ని మానిటర్ చేయడానికి ఇంకా సస్పెక్ట్స్ ని ట్రాక్ చేయడానికి డ్రోన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ ఏరియల్ సర్వైలెన్స్ వల్ల సిటీ లో క్రైమ్ కి చెక్ పెట్టచ్చు. సీసీటీవీ కెమెరాస్ తో పాటు డ్రోన్స్ కూడా తోడవడం తో సెక్యూరిటీ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. టెక్నాలజీ తో పోలీస్-లు చేసే ఈ స్మార్ట్ వర్క్ నిజంగా వేరే లెవల్ అంతే!

ప్రొఫెషన్ మారాడు !!. పాపం ప్రాణం పోయింది..
టెకీ జాబ్ కన్నా వ్యవసాయమే బెటర్ అనుకుని అటు వెళ్లాడు .పాపం లైఫే పోయింది. కర్ణాటకలోని మడికేరికి చెందిన రోషన్ బాలకృష్ణ (43) అనే ఐటీ ఉద్యోగి జాబ్ వదిలేసి, వ్యవసాయం ఆధునిక వ్యవసాయ పరికరాల మార్కెటింగ్ (modern agricultural equipment) రంగంలోకి ప్రవేశించారు.. ఆయన, పొలం స్థలాన్ని పరిశీలించడానికి భార్యాపిల్లలతో కలిసి వెళ్లారు. అక్కడ ఒక మామిడి చెట్టు వద్ద కాయలు కోస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీ లో ఫైరింగ్; మైనర్ బాయ్ డెడ్!
సౌత్ ఢిల్లీ లోని అమర్ కాలనీ లో జరిగిన ఫైరింగ్ కేసు లో పోలీసు ఒక జువెనైల్ ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ హీటెడ్ ఆర్గ్యుమెంట్ గా మారి, చివరకు షూటింగ్ కి దారితీసింది. ఆ మైనర్ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపడంతో ఏరియా లో అందరు షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి పోలీసు ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం పోలీసు ఆ వెపన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.