దంచికొట్టిన వాన.. ఉక్కపోత నుండి ఢిల్లీవాసులకు భారీ ఊరట!
తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వాన పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఐజీఐ ఎయిర్‌పోర్ట్, గురుగ్రామ్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బలమైన గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ ముందే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.



