Latest

బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ ని చంపేస్తామంటూ వార్నింగ్స్!
బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. "నాకు ఇప్పుడు చంపేస్తామంటూ బెదిరింపులు (Death Threats) వస్తున్నాయి" అంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేశారు.. సోషల్, పొలిటికల్ టాపిక్స్ పై వాయిస్ వినిపించే అభిజీత్‌కి ఇలాంటి threats రావడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాట్సాప్ లో ఉన్న నెంబర్ పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటూ పబ్లీక్ నుండి డిమాండ్స్ పెరుగుతున్నాయి.
జస్ట్ 5minates లో కార్ ఛార్జింగ్ ఫుల్!
ఎలక్ట్రిక్ కార్ల (EVs) ఛార్జింగ్ టైమ్‌కి బైబై చెప్పే టైమ్ వచ్చేసింది! చైనా ఈవీ జెయింట్ BYD కొత్త 'ఫ్లాష్ ఛార్జింగ్' టెక్నాలజీని లాంచ్ చేసింది. బంకులో పెట్రోల్ ఫుల్ చేయించడానికి పట్టే టైమ్‌లోనే, అంటే ఓన్లీ 5 to 9 minates కార్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయొచ్చని BYD అనౌన్స్ చేసింది. సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీతో పాసిబుల్ అయ్యే ఈ అల్ట్రా-ఫాస్ట్ టెక్నాలజీ ఈవీ ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది.
హిందూ ధర్మం కోసం 200 మంది గిరిజనుల కాళ్లు కడిగిన MLA!
చత్తీస్‌గఢ్‌లోని పండరియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాస్టర్‌తో పాటు దాదాపు 200 మంది గిరిజనులు మళ్లీ హిందూ మతంలోకి మారారు. ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయిన BJP MLA భావనా బోహ్రా. వారందరికీ వెల్‌కమ్ చెప్పారు. స్వయంగా వారి కాళ్లు కడిగి హిందూ ధర్మంలోకి invite చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
CM relatives దగ్గర బండి భగీరథ్ ను దాచారు?
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేస్‌పై KTR షాకింగ్ కామెంట్స్ చేశారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించడానికి.. సీఎం relatives అయిన 'మెడికేర్' హాస్పిటల్‌లో అల్మోస్ట్ 9 డేస్ సీక్రెట్‌గా దాచిపెట్టారంటూ KTR సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే బొద్దింకలు బయటికి వస్తాయి!
ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే, ఆయన CM క్యాండిడేట్‌గా బయటకు వస్తారు" అంటూ CPI నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ వాళ్లు ఆయన్ని అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారని, అరెస్ట్ చేయండి. అలా చేస్తే మిగిలిన 'బొద్దింకలు' (రాజకీయ ప్రత్యర్థులు) కూడా బయటపడతాయని, ఈ మూవ్‌మెంట్ ఇంకా పెద్దదవుతుందని నారాయణ వ్యాగ్యంగా విమర్శించారు.

విజయ్ సర్కార్ యూ-టర్న్ .. డీఎంకే దెబ్బకి టెండర్ క్యాన్సిల్
తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి టెండర్ సెగ తగిలింది. కాంచీపురంలో ₹16.83 లక్షల ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం మే 19న టెండర్లు పిలిచారు. ఉదయం 9 కి ఓపెన్ చేసి, మధ్యాహ్నం 3 కే క్లోజ్ చేసేశారు. కేవలం 6 గంటలే టైమ్ ఇవ్వడంపై ప్రతిపక్ష డీఎంకే గట్టిగా వాయిస్ రైజ్ చేసింది. ఈ కాంట్రాక్ట్ తమ వాళ్లకు ఇచ్చుకోవడానికే అంటూ డీఎంకే ఆరోపించడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దెబ్బకి రూట్ మార్చిన టీవీకే సర్కార్.. ఆ టెండర్‌ను క్యాన్సిల్ చేసింది. రీసెంట్‌గా విజయ్ తన ఆస్ట్రాలజర్‌ను OSDగా నియమించి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో యూ-టర్న్ హాట్ టాపిక్ గా మారింది.
వాటర్ ప్లీజ్ అంటూ బస్సు ఆపేసిన కోతి !!
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తీవ్రమైన ఎండల వల్ల వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. యావత్మాల్ జిల్లా ఖండాలా ఘాట్ సమీపంలో వాషిమ్ నుండి పూసద్ వెళ్తున్న ఒక ప్రభుత్వ బస్సును దాహంతో ఉన్న ఒక కోతి అడ్డుకుంది. డ్రైవర్ బస్సును ఆపగా, అది కదలకుండా అలాగే నిలబడింది. దాని పరిస్థితిని గమనించిన ప్రయాణికులు బాటిల్‌తో నీళ్లు అందించారు. ఆ కోతి నీళ్లు తాగుతుండగా, అడవి నుండి మరికొన్ని కోతులు వచ్చి నీటి కోసం ఎగబడ్డాయి.

బండి భగీరథ్ కేసులో మరో అప్‌డేట్!
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. తన బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామంటూ భగీరథ్ వైపు లాయర్స్ కోర్టును రిక్వెస్ట్ చేయడంతో హైకోర్ట్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, బండి భగీరథ్‌ను పోలీసులు ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్న మ్యాటర్ తెలిసిందే.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీస్ కేస్!
ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఒక టీవీ ఛానల్‌పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. ఒక TV డిబేట్ షోలో నాగేశ్వర్ మాట్లాడుతూ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టెంపరరీ ఫ్రెండ్స్ అని. జగన్ మాత్రమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పారు అంటూ కామెంట్స్ చేశారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ జనసేన లీడర్స్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు ఈ కేస్ రిజిస్టర్ చేశారు.

ఎండలకు చెక్.... ఇక భారీ వర్షాలేనా?వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది?
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగించే న్యూస్ ఇది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఉత్తర భారతదేశం వైపు ఒక భారీ 'వెస్టర్న్ డిస్టర్బెన్స్సు దూసుకొస్తోంది. దీనివల్ల త్వరలోనే వర్షాలు కురిసి, ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. మే 21న INSAT-3DS ఉపగ్రహం తీసిన చిత్రాలలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ , వాయువ్య భారత ప్రాంతాలపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్లు స్పష్టమైంది. వర్షాలే పడితే ఈ మండే ఎండలనుంచి కాస్త రిలీఫ్ పొందచ్చు..

ఉగ్రవాది హంజా బుర్హాన్ హతం
2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులలో ఒకడైన హంజా బుర్హాన్ (అలియాస్ అర్జుమంద్ గుల్జార్ దార్) పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. 'డాక్టర్' గా పిలవబడే ఇతడిని భారత హోంమంత్రిత్వ శాఖ 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో పలువురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఇలాగే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవ్వడం గమనార్హం.

వదల బొమ్మాళీ అంటున్న కాక్రోచ్ జనతా పార్టీ !!
మన దేశంలో బ్యాన్ చేసిన కొద్ది గంటల్లోనే 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తన కొత్త X (ట్విట్టర్) ఖాతాను ప్రారంభించింది. ఇటీవల బిజెపి (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను ఈ సెటైరికల్గ్రూ ప్ అధిగమించడంతో దీని ప్రజాదరణ బాగా పెరిగింది. తిరిగొచ్చిన గంటలోనే, విమర్శకులను హేళన చేస్తూ రెండు పోస్ట్‌లు పెట్టింది. "మమ్మల్ని వదిలించుకోగలరని అనుకున్నారా?" అని సెటైర్లు కూడా వేసింది. బిజెపితో ఫాలోవర్ల సంఖ్యను పోలుస్తూ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది.

ఐదు దేశాలకు ఇండియన్ ట్రెడిషన్ ఉట్టిపడేలా ప్రధాని కానుకలు
ప్రధాని నరేంద్ర మోదీ తన అయిదు దేశాల (ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, యూఏఈ) పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలకు భారతీయ సంస్కృతి ప్రతిబింబించే బహుమతులు అందజేశారు. ఇటలీ ప్రధాని మెలోనికి అసోం ముగా సిల్క్ శాలువా, యూఏఈ అధ్యక్షుడికి కేసర్ మామిడి పండ్లు, నెదర్లాండ్స్ రాజుకు రాజస్థాన్ బ్లూ పాటరీ, నార్వే ప్రధానికి సిక్కిం ఆర్కిడ్ పెయింటింగ్స్, స్వీడన్ ప్రధానికి లడఖ్ పష్మినా శాలువాను ప్రధాని మోదీ గిఫ్ట్ చేశారు.
బొద్దింకల జనతా పార్టీ క్యాంపెయిన్ చూశారా?
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'బొద్దింకల జనతా పార్టీ' (CJP) క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ ఈ పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది చూసిన పబ్లిక్ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్‌లోనూ ఈ 'బొద్దింకల జనతా పార్టీ'నే గెలుస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తమిళనాడులో కాంగ్రెస్ మంత్రి ప్రమాణ స్వీకారంలో రాహుల్ నినాదాలు
తమిళనాడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం కాంట్రవర్సీకి దారి తీసింది. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కిలియూర్ ఎమ్మెల్యే ఎస్. రాజేష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేస్తూ ఆయన కామరాజ్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది ప్రమాణ స్వీకారంలో భాగం కాదని సున్నితంగా మందలించారు.60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ భాగస్వామిగా మారింది.

ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ కు ఎబోలా వైరస్ దెబ్బ !
ఇండియా-ఆఫ్రికన్ యూనియన్ మధ్య జరగాల్సిన 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కాంగోలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. మే 28 నుంచి ఢిల్లీలో జరగాల్సిన ఈ సమ్మిట్ ను ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో పోస్ట్‌పోన్ చేశాయి. హెల్త్ ఎమర్జెన్సీపై కలిసి పోరాడతామని చెబుతూనే, సమ్మిట్ కొత్త డేట్స్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని గవర్నమెంట్ స్పష్టం చేసింది.
బండి భగీరథ్ సరెండర్ అవ్వలేదు!
బండి భగీరథ్‌ను సరెండర్ చేశానంటూ బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారని CM క్లారిటీ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆయన్ను అరెస్ట్ చేశామని క్లియర్‌గా చెప్పిందని, తాను పోలీసుల మాటలనే నమ్ముతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కిడ్నాప్ అండ్ అరెస్ట్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న Cockroach Revolution!
Cockroach Revolution ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూత్ ఇండియాను ఒక బెటర్ కంట్రీగా మార్చడం కోసం సొల్యూషన్స్ వెతకడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌గా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేశం గురించి ఆలోచించే యూత్ అంతా ఇప్పుడు ఈ ట్రెండ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు.

'బొద్దింక జనతా పార్టీ' బ్యాన్
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన 'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) అకౌంట్‌ను బ్యాన్ చేశారు. మే 16న స్టార్ట్ అయిన ఈ అకౌంట్, జస్ట్ 4 డేస్ లోనే 200K కంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ టైమ్‌లో అంత ఎక్కువ ఫాలోవర్స్ రావడంతోనే ఆ అకౌంట్‌ను బ్యాన్ చేశారు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరిని గన్‌తో కాల్చి చంపిన బాలకృష్ణ?
గతంలో బాలకృష్ణ గతంలో గన్‌తో ఇద్దరిని కాల్చి చంపిన మ్యాటర్‌ను వైఎస్ జగన్ మళ్లీ గుర్తు చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే, సాక్షులు ఎవరూ లేకుండా చేయడం కోసం వాళ్ల ఇంటి వాచ్‌మన్‌ను బండరాయితో కొట్టి చంపేశారని జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో చంద్రబాబు తన పవర్‌తోనే ఈ కేసును కవర్ చేశారంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ట్రెండింగ్‌లో 'బొద్దింకలా జనతా పార్టీ' సాంగ్!
'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) రిలీజ్ చేసిన ఒక పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ వినడానికి చాలా బాగుందని, ముఖ్యంగా GenZ యూత్ ని ఫుల్లుగా అట్రాక్ట్ చేసేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.