← Back to news

విజయ్ సర్కార్ యూ-టర్న్ .. డీఎంకే దెబ్బకి టెండర్ క్యాన్సిల్

By aravinda nyayapati· 22 May 2026· Indiatoday· Chennai
విజయ్ సర్కార్ యూ-టర్న్ .. డీఎంకే దెబ్బకి టెండర్ క్యాన్సిల్

తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి టెండర్ సెగ తగిలింది. కాంచీపురంలో ₹16.83 లక్షల ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం మే 19న టెండర్లు పిలిచారు. ఉదయం 9 కి ఓపెన్ చేసి, మధ్యాహ్నం 3 కే క్లోజ్ చేసేశారు. కేవలం 6 గంటలే టైమ్ ఇవ్వడంపై ప్రతిపక్ష డీఎంకే గట్టిగా వాయిస్ రైజ్ చేసింది. ఈ కాంట్రాక్ట్ తమ వాళ్లకు ఇచ్చుకోవడానికే అంటూ డీఎంకే ఆరోపించడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దెబ్బకి రూట్ మార్చిన టీవీకే సర్కార్.. ఆ టెండర్‌ను క్యాన్సిల్ చేసింది. రీసెంట్‌గా విజయ్ తన ఆస్ట్రాలజర్‌ను OSDగా నియమించి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో యూ-టర్న్ హాట్ టాపిక్ గా మారింది.

More in India