Latest
మైఖేల్ జాక్సన్ లా రోబో డ్యాన్స్.. లాస్ట్ లో ఫన్నీ ట్విస్ట్!
టెక్నాలజీ ఎంత అప్‌డేట్ అయినా కొన్నిసార్లు ఫన్నీ మిస్టేక్స్ జరుగుతుంటాయి. రీసెంట్‌గా ఒక హ్యూమనాయిడ్ రోబో, మైఖేల్ జాక్సన్ లాంటి ఐకానిక్ మూవ్స్‌తో డ్యాన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ, బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఈ ఫన్నీ అండ్ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం రోబోకి దెబ్బ తగిలిందేమో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

బండి భగీరథ్ పై మరో సెక్షన్ ... ఆధారాలు మాయం చేశాడని షాకిచ్చిన పోలీసులు
పోక్సో కేసులొ అరెస్టయిన బండి భగీరథ్ కు పోలీసులు షాక్ వచ్చారు. ఆధారాలు మాయం చేశాడని మరో సెక్షన్ 238ని కూడా జోడించారు. భగీరథ్ అరెస్ట్ తర్వాత విచారణ సమయంలో పోలీసులకు ఖాళీ ఫోన్ ఇచ్చాడు. సిమ్ కార్డు ఎక్కడ పెట్టానో గుర్తు లేదని అతను చెప్పడంతో పోలీసులు ఆధారాల మాయం కింద కేసుని మరింత బిగించారు.

DRDO సరికొత్త రికార్డ్: ‘ULPGM V3’ క్షిపణి ప్రయోగం సక్సెస్!
భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ULPGM V3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల బంకర్లు, ఆర్మీ ట్యాంకులు మరియు కదులుతున్న వాహనాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత.డ్రోన్లు లేదా మానవరహిత విమానాల (UAVs) నుండి ప్రయోగించేలా ఈ అత్యాధునిక వెపన్‌ను డిజైన్ చేశారు. ఈ విజయంతో రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' వైపు దేశం మరో పెద్ద అడుగు వేసినట్లయింది!

WFH చెప్పి…తెల్లవారుజామున 4 గంటలకే లేఆఫ్ షాక్
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటాలో 8,000 మంది ఉద్యోగుల తొలగింపు వెనుక ఘోరమైన నిజాలు బయటకు వచ్చాయి. మొదట ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' అని చెప్పిన మెటా యాజమాన్యం.. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకే ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్లు మెయిల్స్ పంపింది. గత నెలలో జరిగిన ఈ దారుణాన్ని కంపెనీ ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. AI వాడకం పెంచుతూ, ఖర్చులు తగ్గించుకోవడానికే మెటా ఈ నిర్ణయం తీసుకుంది.

అల్లుడికి కిలో బరువున్న వెండి చెప్పులు కానుక
మహారాష్ట్రకు చెందిన ఒక ఫ్యామిలీ పెళ్లిలో అల్లుడికి వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన కొల్హాపూరి చెప్పుల్ని కానుకగా ఇచ్చింది. ఈ చెప్పులకి కిలోకి పైడా వెండి వాడారు . వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్న వేళ చెప్పుల కోసమే 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టడం ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది.

మోదీ ఒక స్నేక్ చార్మర్ ... ప్రధానిపై నార్వ పత్రిక వివాదాస్పద కార్టూన్
నార్వే పత్రిక Aftenposten ప్రధాని మోదీపై వివాదాస్పద కార్టూన్ ని ప్రచురించింది. మీడియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆడిస్తారంటూ ఒక స్నేక్ చార్మర్ గా కార్టూన్ ని గీసింది. నార్వే పర్యటన టైమ్ లో ఒక జర్నలిస్టు ప్రధానిని మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టరు అని అడిగిన దానికి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు. విదేశీ జర్నలిస్టులపై ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో మోదీని విమర్శిస్తూ నార్వే పత్రిక ఈ కార్టూన్ ప్రచురించింది. అయితే నార్వేది రేసిస్ట్ మెంటాలటీ అని మన సంస్కృతిని అవమానించిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో నార్వే ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మన స్థానం 157.

ప్రాణత్యాగానికి సిద్ధమైన జంటలకు ఇరాన్ సామూహిక వివాహాలు
అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న సంకేతాల మధ్య ఇరాన్ ఇమోషనల్ గా కొన్ని పనులు చేస్తోంది. దేశ రక్షణ కోసం, యుద్ధంలో ప్రాణత్యాగానికి సిద్ధమైన 100కి పైగా యువ జంటలకు ప్రభుత్వమే సామూహిక వివాహాలు జరిపించింది. యుద్ధ సమయంలో దేశభక్తిని నూరిపోయడం కోసమే భారీ స్థాయిలో ఈ పెళ్లిళ్లు జరిపించింది. ఒక వేళ యుద్ధం వస్తే తమ దేశ యువత ఎలాగైనా ఎదుర్కొంటారన్న మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ వివాహాలు భారీ స్థాయిలో జరిపించింది.

ఇరాన్ ని కట్టడి చేయడానికి ఓ గంట చాలు : ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసే ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై యుద్ధం చేయడం ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. వచ్చేవారంలో దాడి చేయడానికి టైమ్ లైన్ ఫిక్స్ చేసినట్టు చెప్పారు. ఇరాన్ పై దాడి చేసి దారిలోకి తీసుకురావడానికి తమకు ఒక గంట చాలని అన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్లాంట్లలో యురేనియం శాతాన్ని ప్రమాదకర స్థాయికి పెంచిందని, అందుకే ఈ ఆపరేషన్ తప్పడం లేదని యూఎస్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

తెలంగాణ అగ్నిగుండం : 47డిగ్రీలవరకు నమోదయ్యే ఛాన్స్
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 10 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుంది. 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయకు వెళ్లొద్దని సూచించింది.

పాక్ పంజాబ్ ప్రావిన్స్ లో వెల్లి విరుస్తున్న హిందూ కల్చర్
పాకిస్థాన్లో వీధులన్నీ పాత కళను సంతరించు కుంటున్నాయి. అక్కడి ఒకప్పటి హిందూ గల్లీలకు కాలక్రమంలో ముస్లిం పేర్లు పెట్టేశారు . కానీ ప్రస్తుతం మళ్లీ గాలి మళ్లింది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో లాహోర్ హెరిటేజ్ రివైవల్ ఏరియా కార్యక్ర మంలో ఆ పేర్లన్నింటినీ తిరిగి హిందూ పేర్లుగా మారుస్తున్నారు. అందుకే రెహమాన్ గల్లీ కాస్తా రామ్ గల్లీగా మారిపోయింది. ఇస్లాం పురాను క్రిష్ణ నగర్ గానూ, బాబ్రీ మసీద్ చౌక్ ను జైన్ మందిర్ చౌక్ గానూ మారుస్తున్నారు. ఇవే కాదు దాదాపు12 గల్లీల పేర్లు మారిపోతున్నాయి.

విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలోచ్చు- స్టాలిన్
తమిళనాడులో జోసెఫ్ విజయ్ కొత్తప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ఫీలర్ వదిలారు. పార్టీకార్యకర్తలంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డీఎంకే జిల్లా కార్యదర్శులతో సమావేశంలో స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని కాబట్టి 2029లో జరిగే ముందస్తుఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, లెఫ్ట్ ప్రధాన మద్దతుదారుగా టీవీకే పార్టీ ఇతర చిన్న పార్టీలతో కలసి కొత్తప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ ?
దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన Cockroaches అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనికి నిరసనగా 'X' నెటిజన్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అనే ఒక సెటైరికల్ పేజీని క్రియేట్ చేయగా, దానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా టీఎంసీ నేతలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ కూడా ఈ 'బొద్దింకల పార్టీ'లో చేరడం విశేషం. కేవలం 24 గంటల్లోనే దాదాపు 40 వేల మంది యువత ఇందులో మెంబర్స్‌గా జాయిన్ అయ్యారు. యువత వాయిస్‌ని వినిపించడానికే ఈ డిజిటల్ ఫ్రంట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చారు
UPలో ఎన్‌కౌంటర్లు పెరుగుతున్నాయి.. మహిళలపై దాడులు ఆగట్లేదు!
ఉత్తరప్రదేశ్ CM యోగి గవర్నమెంట్ పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫుల్ ఫైర్ అయ్యారు. UPలో ఎన్‌కౌంటర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అదే టైమ్‌లో మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం అస్సలు ఆగడం లేదని క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ బాలేదనేలా ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
సొంత MLA కి పబ్లిక్‌గా క్లాస్ పీకిన చంద్రబాబు నాయుడు!
AP CM చంద్రబాబు ఒక MLA తీరుపై పబ్లిక్‌గానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్పీచ్ అదరగొట్టాడు.. కానీ పని దగ్గర కొంచం వెనుక పడ్డాడు అంటూ ఆ MLA చేసిన తప్పులను ఓపెన్‌గా గుర్తుచేశారు. వీలైనంత త్వరగా ఆ లోపాలను సరిదిద్దుకుని లైన్లోకి రావాలని క్లాస్ పీకారు. బాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
AI కాదు చైనా కట్టిన ఈ బ్రిడ్జ్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాక్ ఔతుంది!
ఇది గ్రాఫిక్స్ లేదా ఏఐ క్రియేట్ చేసిన పిక్చర్ కాదు.. చైనాలోని గుయిజౌలో ఉన్న 'హుయాజియాంగ్ కాన్యన్ బ్రిడ్జ్'. రివర్ కి దాదాపు 625 మీటర్స్ height లో ఉన్న ఈ వండర్.. వరల్డ్ లోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటంటే.. టన్నెల్ కడుతున్నప్పుడు బయటపడ్డ స్ప్రింగ్ వాటర్‌ని దారి మళ్లించి, బ్రిడ్జ్ పైనుంచే పడేలా ఒక different మ్యాన్ మేడ్ వాటర్‌ఫాల్‌ను కూడా క్రియేట్ చేశారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
మినిస్టర్ పర్ఫార్మెన్స్‌పై పోస్ట్: హైకోర్టు లాయర్ పై దాడి!
మినిస్టర్ సత్యకుమార్ పర్ఫార్మెన్స్ అస్సలు బాలేదంటూ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసిన హైకోర్టు లాయర్ అంజన్ రెడ్డిపై అటాక్ జరిగింది. మినిస్టర్ పీఏ హరీష్, అతని అనుచరులు కలిసి ఈ దాడి చేశారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వల్లే ఈ అటాక్ జరిగిందని లాయర్ చెప్పారు. ఈ ఇష్యూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు, అటు లాయర్లలోనూ ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రీతీ జింటా ఇంట్లోనే గార్డెనింగ్!
యాక్ట్రెస్ ప్రీతీ జింటా తన ఇంటి గార్డెన్‌లో పచ్చిమిర్చి, ఫ్రెష్ వెజిటబుల్స్ పెంచుతూ నెటిజన్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. అంతా గ్రీనరీతో నిండిన ఆమె ఇంటి గార్డెన్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

కొడుకు కోసం ముంబై వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయిన హీరో మాధవన్!
యాక్టర్ మాధవన్ సన్ వేదాంత్ స్విమ్మింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. అయితే సన్ కెరీర్ కోసం తమ ఫ్యామిలీ ముంబై వదిలి దుబాయ్ ఎందుకు షిఫ్ట్ అయిందో మాధవన్ రీసెంట్‌గా చెప్పారు. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఇండియాలో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ క్లోజ్ చేశారు. ప్రాక్టీస్ ఆగితే సన్ కెరీర్ దెబ్బతింటుందని, దుబాయ్‌లో పూల్స్ ఓపెన్ ఉండటంతో అక్కడికి వెళ్ళిపోయామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దుమారానికి దారి తీసిన విజయ్ నివాళులు !
నిషేధిత ఎల్ టీటీఈ ఫౌండర్ వేలు పిళ్లై ప్రభాకరన్ కు తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అంజలి ఘటించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. ప్రభాకరన్ వర్ధంతి రోజున విజయ్ ఆతనికి నివాళులర్పించి ప్రవాస తమిళులకు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. అయితే దీనిని బీజేపి తప్పుబట్టింది. తండ్రిని హతమార్చిన కిరాతకునికి సీఎం నివాళి ఇస్తుంటే రాహుల్ చూస్తూ ఊరుకున్నాడని ఎద్దేవా చేసింది. సీఎం చర్యను టీవీకే సమర్ధించుకుంది. అక్కడ లంకలో తమిళుల ఊచకోతలో చనిపోయిన బాధితులు కూడా ఉన్నారని వారికి అంజలి ఘటించామని వివరణ ఇచ్చింది.

రేపిస్టుకు దండలేసి, భుజాలపై ఊరేగించిన యూపీ జనం
రేప్ చేసిన వ్యక్తి జైలు కెడితే బెయిల్ పై బయటికొచ్చాక దండలేసి, షేక్ హ్యాండ్ ఇచ్చి భుజాలపై మోస్తున్నారు యూపీలో.. యూపీలోని ఘజియాబాద్ లో హిందూ యువ వాహిని అనే ధార్మిక సంస్థ మాజీ సభ్యుడైన సుశీల్ ప్రజాపతి ఓ అమ్మాయిని రేప్ చేశాడు. లా గ్రాడ్యుయేట్రే అయిన బాధితురాలు కేసు పెట్టి, జైలులో పెట్టిస్తే బెయిల్ మీద రిలీజ్ అయ్యాక ఘన కార్యం చేసిన వాడిలా దండలేసి దండం పెట్టారు ఫాలోయర్లు. అంతేకాదు భుజాలపై ఎక్కించుకుని ఆ రేపిస్ట్ ని విక్టరీ ర్యాలీ అంటూ ఊరేగించారు కూడా. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పోలింగ్‌కు ముందే తప్పుకున్న TMC candidate! ఏమైంది?
బెంగాల్ ఫల్తా ఉప ఎన్నికల్లో ఊహించని షాక్! మరో రెండ్రోజుల్లో రీపోలింగ్ అనగా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై టీఎంసీ ఫుల్ ఫైర్ అవుతోంది. బీజేపీ బెదిరింపులు, ఒత్తిడి వల్లే జహంగీర్ ఖాన్ పోటీ నుండి తప్పుకున్నారని ఆరోపించింది. ఏజెన్సీలతో తమ కార్యకర్తలను భయపెడుతున్నారని మండిపడింది. మే 21న ఇక్కడ రీపోలింగ్ జరగనుండగా.. ఈ ట్విస్ట్‌తో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.