Latest
అన్నయ్య మూవీకి క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్
మెగాస్టార్ చిరంజీవీ నటిస్తున్న 158వ చిత్రానికి ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్నయ్య నటించే చిత్రానికి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొడితే, కుమార్తె నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా ఆన్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించే ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ . ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే కారులో రావడం హాట్ టాపిక్ గా మారింది.

రికార్డ్స్ బద్దలు కొడుతున్న NTR డ్రాగన్ మూవీ గ్లింప్స్
జూనియర్ ఎన్డీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్. నిన్న ఎన్డీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తే కేవలం 24 గంటల్లోనే 6.4 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. 4 నిముషాలున్న ఈ వీడియోని చూసి ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు. ఇప్పటివరకు మరే మూవీకి ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్ గా డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది.

అమెరికా చదువు.. ఆప్ క్యాంపెయిన్.. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కింగ్
ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ అభిజిత్ దీప్కే (30). మహారాష్ట్రకు చెందిన ఆయన బేసికల్ గా జర్నలిస్టు. బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. పొలిటికల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో AAP సోషల్ మీడియా క్యాంపెయిన్ సక్సెస్ వెనుక ఆయనే ఉన్నారు. నిరుద్యోగులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్‌కు నిరసనగా ఇతను వ్యంగ్యంగా మొదలు పెట్టిన CJP ఒక జెన్ జీ ఉద్యమంగా మారింది. దీంతో దీనిని ఒక ఉద్యమ పార్టీగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో అభిజిత్ ఉన్నారు.

కుర్చీ తాత మృతి
కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫేమ్ తాత మహమ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్ కృష్ణా నగర్ లో నివాసం ఉంటున్న ఆయన నిన్న కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికి ఆయన మరణించారు. వడదెబ్బ తగలడంతో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ కుర్చీని మడత పెట్టి అన్న డైలాగ్ తో SMలో ఫేమస్ అయిన పాషా గుంటూరు కారం మూవీలో మహేష్ తో కలిసి స్టెప్పులేశారు.

60 రోజుల్లో ఉద్యోగం వెతుక్కోండి.. లేదంటే అమెరికా వదిలిపోండి!
మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలలో జరుగుతున్న లేఆఫ్స్ అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. H-1B వీసా నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు కేవలం 60 రోజుల్లోగా కొత్త కంపెనీలో వీసా స్పాన్సర్‌షిప్ సాధించాలి, లేదంటే దేశం విడిచి వెళ్ళక తప్పదు. ఈ ఏడాది ఇప్పటికే 1.1 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోగా, అందులో అత్యధికులు భారతీయులే. దశాబ్దాలుగా అక్కడే ఇళ్లు కొని, పిల్లలను చదివిస్తూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు వారంతా కెనడా, యూరప్ వైపు చూస్తున్నారు.

H1 బి వీసా హోల్డర్లకు టెన్షన్ టెన్షన్... 60 డేస్ డెడ్ లైన్ తో సతమతం
మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి దిగ్గజ టెక్ సంస్థల్లో జరుగుతున్న తాజా లేఆఫ్స్ వల్ల వేలాది మంది భారతీయ హెచ్-1బి (H-1B) వీసాదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికా నిబంధనల ప్రకారం మరో కొత్త జాబ్ వెతుక్కోవ డానికి కేవలం 60 రోజులు మాత్రమే టైమ్ఉంటుంది. గడువులోగా స్పాన్సర్‌షిప్ దొరకకపోతే దేశం విడిచి వెళ్లాల్సి రావడంతో వారి కలలు, పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయి.

ఇండియన్ పేరెంట్స్ వర్సెస్ జెన్ జీ: మనీ వార్!
సంతృప్తికరమైన జీవితంపై నేటి తరం (జెన్ జీ), తల్లిదండ్రుల ఆలోచనల మధ్య చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. పాత తరం ఇల్లు, పొదుపు, కుటుంబ బంధాలకు , బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తే.. యువత మాత్రం ప్రయాణాలు, తక్షణ అనుభవాల కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే, వారు బాధ్యతారాహిత్యంగా లేరని, NSEలో (నేషనల్ స్టాక్ ఎక్స్ఛ ఛేంజ్ ) 30 ఏళ్ల లోపు పెట్టుబడిదారులు 23% నుండి 40%కి పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సినిమా ఫ్లాప్ అయితే కన్న బిడ్డను కోల్పోయినట్లే- ఆమీర్ ఖాన్
ఆమిర్ ఖాన్ తన సినిమాలను సొంత బిడ్డల్లా భావిస్తారు. అందుకే అవి ఫ్లాప్ అయితే తీవ్రమైన బాధలోకి (డిప్రెషన్) వెళ్తానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేక్షకులు డబ్బులు పెట్టి థియేటర్లకు వచ్చేది ఆనందించడానికేనని, సినిమా నచ్చకపోతే తప్పు మన పనిలోనే ఉందని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడు జునైద్ ఖాన్ నటించిన, నిర్మించిన ఏక్ దిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో ఆమిర్ ఈ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

హిందీ స్పీచ్ తో సర్ ప్రైజ్ చేసిన ఇటలీ ప్రధాని !!
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భారత ప్రధాని నరేంద్ర మోదీల జాయింట్ మీటింగ్ లో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకుంది. ఇరు దేశాల సంబంధాల బలాన్ని వివరించడానికి మెలోని "పరిశ్రమే విజయానికి మూలం" (పరిశ్రమ్ హీ సఫలతా కీ కుంజీ హై) అనే హిందీ సామెతను ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మోదీ పర్యటనతో భారత్-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని, బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు. మెలోనీ హిందీ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డాలర్ పవర్ ని అడ్డుకోవాలి : పుతిన్, జిన్ పింగ్ భేటీలో 5 కీలక నిర్ణయాలు
పశ్చిమ దేశాల ఆంక్షల నడుమ చైనా అధినేత జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహాత్మక భేటీ ముగిసింది. డాలర్ ఆధిపత్యానికి కౌంటర్‌గా రూబుల్, యువాన్ కరెన్సీలలోనే రికార్డు స్థాయిలో $200 బిలియన్ల వ్యాపారం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఉమ్మడి మిలిటరీ సహకారంతో పాటు పవర్ ఆఫ్ సైబీరియా 2 గ్యాస్ పైప్‌లైన్ వేగవంతం చేయనున్నారు. బ్రిక్స్ వేదికగా గ్లోబల్ పాలిటిక్స్‌లో వెస్ట్రన్ పవర్‌కు ఎదురుదెబ్బ కొట్టడమే పుతిన్, జిన్ పింగ్ లక్ష్యంగా ఉంది.

మెలోడీ గిఫ్ట్.. స్టాక్ మార్కెట్ లో గందరగోళం
ఇటలీ పర్యటనలో పీఎం మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి పార్లే మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు పార్లే ఇండస్ట్రీస్ షేర్లను కొన్నారు. దీంతో ఆ షేర్ వాల్యూ 5శాతం పెరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మెలోడీ చాక్లెట్లు తయారు చేసేది పార్లే ప్రొడక్ట్స్ అనే కంపెనీ, ఇది అసలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ లో లేదు. ఇన్వెస్టర్లు కొన్న పార్లే ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చేసే కంపెనీ. ఇప్పుడు ఈవిషయం కూడా ట్రెండింగ్ అవుతోంది.

రెబెల్స్ కి బెర్తులు లేవ్- విజయ్ ప్రభుత్వం క్లారిటీ
తమిళనాడులో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలకు కేబినెట్ బెర్తులు ఇస్తారన్న వార్తల్లో నిజం లేదని టీవీకే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్నాడిఎంకే రెబెల్స్ కు గనక మినిస్ట్రీలిస్తే సపోర్ట్ విషయంపై మళ్లీ ఆలోచిస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్చరించడంతో విజయ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇటు ఇతర మిత్రపక్షాలు కూడా సంకీర్ణ ధర్మానికి అది విరుద్ధం అని అబ్జెక్షన్ చెప్పాయి. దాంతో ప్రభుత్వంలో మంత్రి ఒకరితో విజయ్ క్లారిటీ ఇప్పించారు. అలాంటిదేమీ లేదని, అవన్నీ ఊహాగానాలేనని చెప్పారు.ఎట్టకేలకి ఈ ఇష్యూకి తెరపడినట్లయ్యింది.

స్టేట్ టాపర్ కి చిరంజీవి అదిరిపోయే సర్ప్రైజ్!
TG EAPCET లో స్టేట్ టాప్ ర్యాంక్ కొట్టిన ఎం. రుషిని మెగాస్టార్ చిరంజీవి కలిసి విష్ చేశారు. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రుషి ఎగ్జామ్స్ రాసేటప్పుడు, నువ్వు గనుక స్టేట్ టాప్ ర్యాంక్ కొడితే. చిరంజీవిని కలిపిస్తా అని వాళ్ల ఫాదర్ మాట ఇచ్చారు. అన్నట్టుగానే రుషి టాపర్ అవ్వడంతో. ఈరోజు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు. చిరంజీవి ఆమెను కలిసి విశ్ చేసారు.

KCR ఫ్యామిలీ రూలింగ్‌ని ఎండ్ చేశాం: బండి సంజయ్!
హైదరాబాద్ BJP ఆఫీస్‌లో సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు ఫ్యామిలీ రూలింగ్‌ని రిజెక్ట్ చేశారని, KCR అవినీతి, కుటుంబ పాలనను అంతం చేసింది BJPనే అని మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమే అని, అందుకే తన సొంత కొడుకుని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ మాట్లాడారు.

ఫేక్ మెడిసిన్స్ అలర్ట్!
మార్కెట్లో Fake Medicines సేల్స్ పెరిగిపోతున్నాయి. అందుకే మెడిసిన్స్ కొనేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టాబ్లెట్ ప్యాకెట్‌పై ఉన్న స్పెల్లింగ్స్, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, కంపెనీ లోగో కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ప్యాకెట్‌పై QR కోడ్ ఉంటే ఫోన్‌తో స్కాన్ చేసి డీటెయిల్స్ వెరిఫై చేసుకోండి. ఎప్పుడూ లైసెన్స్ ఉన్న మెడికల్ షాప్స్ లోనే టాబ్లెట్స్ కొని, బిల్ ఖచ్చితంగా తీసుకోండి. టాబ్లెట్స్ పొడిపొడిగా ఉన్నా, కలర్ మారినా అస్సలు వాడొద్దు.
రక్తం కారుతూ, IV బ్యాగ్‌తో బైక్ రైడింగ్.. రీల్స్ పిచ్చా? రియలా?
ఒక వ్యక్తి తల నుండి కాళ్ల వరకు బ్యాండేజీలు కట్టేసి, రక్తం కారుతున్నా సరే.. బైక్‌కి ఐవీ (IV) ఫ్లూయిడ్ బ్యాగ్ తగిలించుకుని రోడ్డుపై వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన పబ్లిక్ షాక్ అవుతున్నారు. నిజంగా అంత సీరియస్ కండిషన్ లో ఉన్న అతను బైక్ నడపడం ఇంపాజిబుల్ కాబట్టి, ఇది పక్కా రీల్స్ కోసం లేదా ఏదైనా అటెన్షన్ కోసమే చేసి ఉంటారని నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనిపై పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అక్కడ ఉదయం 10 నుంచే షాపులు బంద్
యూపీలోని బండా జిల్లాలో ఎండల ధాటికి జనం నరకం చూస్తున్నారు. ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు నమోదు కావడంతో అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే షాపులన్నీ బంద్ అయిపోతున్నాయి. జనాలు బయటకి రాకపోవడంతో అప్రకటిత కర్ఫ్యూలా పరిస్థితి మారిపోయింది. కూలీలు రాత్రి పూట ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో పొలం పనులు చేసుకుంటున్నారు. ఎండ వేడికి ట్రాన్స్‌ఫార్మర్లు పేలకుండా నీళ్లు చల్లుతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణ విధ్వంసమే ఈ విపత్తుకు కారణం!

పేపర్ లీక్ డబ్బులతో స్కూల్ ప్లాన్
NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుల్లో ఒకరైన శివరాజ్ రఘునాథ్ మోటే గోయెంకర్ .. ఈయనని M Sir అని పిలుస్తారు. ఇప్పుడు ఈయన చేసిన పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బులతో లాతూర్ లో 8 ఎకరాల స్థలం కొనుగోలు చేసి స్కూల్, కాలేజ్ పెట్టాలని ప్లాన్ చేసినట్టు CBI దర్యాప్తులో బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడి సంపాదించిన డబ్బుతోనే ఎడ్యుకేషన్ బిజినెస్ చేయాలనుకోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

భర్తతో గొడవపడి భార్య సూసైడ్!
విశాఖపట్నం సింహాచలంలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్యామిలీ గొడవల వల్ల ఇందుమతి (40) అనే ఉమెన్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. లాస్ట్ నైట్ హస్బెండ్ మహేష్‌తో గొడవ జరగడంతో, ఆమె రూమ్‌లోకి వెళ్లి ఈ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ తీసుకుంది. ఎంతకీ బయటకు రాకపోవడంతో భర్త రూమ్‌లోకి వెళ్లి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. దీనిపై పోలీసులు కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
మోదీ గిఫ్ట్‌పై ఇటలీ PM ట్వీట్!
ప్రధాని మోదీ అయిదు దేశాల టూర్ సందర్భంగా రోమ్ పర్యటన ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇటలీ ప్రధాని మెలోనితో ఆత్మీయ కలయికకు సంబంధించి వీడియోలు, ఫోటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. వీరిద్దరూ సెల్ఫీ దిగారు. కారులో రైడ్ కి వెళ్లారు. కలిసి డిన్నర్ చేశారు. ఈ టైమ్ లో మోదీ మెలోనికి మెలోడీ చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ వీడియోని మెలోని SMలో పోస్టు చేయడంతో ఇద్దరి మధ్య మెలోడీ మూమెంట్స్ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాయి.

కులగణనపై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
జనగణనలో క్యాస్ట్ కౌంటింగ్‌కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ఓకే చెప్పింది. కులగణన వద్దు అంటూ వేసిన కేస్‌ని బుధవారం కోర్టు రిజెక్ట్ చేసింది. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వారికి గవర్నమెంట్ స్కీమ్స్ కరెక్ట్‌గా అందాలంటే ఈ డేటా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. ఇది పూర్తిగా గవర్నమెంట్ పాలసీ డెసిషన్ అని, ఇందులో కోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వలేవని క్లియర్‌గా చెప్పేసింది.