← Back to news

ఇరాన్ ని కట్టడి చేయడానికి ఓ గంట చాలు : ట్రంప్ ప్రకటన

By aravinda nyayapati· 20 May 2026· Washington
ఇరాన్ ని కట్టడి చేయడానికి ఓ గంట చాలు : ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసే ఒక సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై యుద్ధం చేయడం ఇష్టం లేకపోయినా ఆ పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. వచ్చేవారంలో దాడి చేయడానికి టైమ్ లైన్ ఫిక్స్ చేసినట్టు చెప్పారు. ఇరాన్ పై దాడి చేసి దారిలోకి తీసుకురావడానికి తమకు ఒక గంట చాలని అన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఇరాన్ తన న్యూక్లియర్ ప్లాంట్లలో యురేనియం శాతాన్ని ప్రమాదకర స్థాయికి పెంచిందని, అందుకే ఈ ఆపరేషన్ తప్పడం లేదని యూఎస్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

More in World