Latest

నెక్స్ట్ 5 డేస్ ఎండలు మామూలుగా ఉండవు! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
Politics· 19 May 2026

నెక్స్ట్ 5 డేస్ ఎండలు మామూలుగా ఉండవు! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

తెలంగాణలో రాబోయే ఐదు రోజులు ఎండలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని హైదరాబాద్ వెదర్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఎండలు రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. మెయిన్ గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ 45 డిగ్రీలు దాటే ఛాన్స్ ఉంది. అందుకే afternoon టైమ్ బయటకు వెళ్లొద్దని, వాటర్, మజ్జిగ ఎక్కువగా తాగుతూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఈ బాబా ఎక్కడికెళ్లినా వెంటే వచ్చే స్పెషల్ AC!▶
Politics· 19 May 2026

ఈ బాబా ఎక్కడికెళ్లినా వెంటే వచ్చే స్పెషల్ AC!

పీఎం మోదీ దగ్గర కూడా లేని ‘మొబైల్ AC’ వాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాంపాల్ బాబాకు 11 ఏళ్ల తర్వాత బెయిల్ దొరికింది. 2014లో పోలీస్ అరెస్ట్ తప్పుకోవడానికి ఆశ్రమాన్ని కోటలా మార్చి, ఫైరింగ్ చేయించడంతో ఆరుగురు చనిపోయారు. ఈ మర్డర్ కేసులో లైఫ్ టైమ్ జైలు శిక్ష పడినా. ఇప్పుడు బెయిల్ పై బయటకు రావడంతో భక్తులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి క్రిమినల్స్ ని ఇంకా నమ్మడం దారుణమని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

సీసీటీవీలో దొరికిపోయిన టీనేజర్!▶
Viral· 19 May 2026

సీసీటీవీలో దొరికిపోయిన టీనేజర్!

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో చూసి జనాలు తెగ ఫైర్ అవుతున్నారు. ఒక ఉమెన్ తన చిన్న బేబీని పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుండి వచ్చిన ఒక టీనేజ్ బాయ్ సడన్‌గా మిస్‌బిహేవ్ చేశాడు. ఈ ఊహించని ఇన్సిడెంట్‌తో ఆ ఉమెన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ దారుణమైన సీన్ సిసిటివి కెమెరాలో రికార్డ్ అవ్వగా.. ఆ అబ్బాయిని వెంటనే అరెస్ట్ చేసి పనిష్మెంట్ ఇవ్వాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

మంచు మనోజ్ మీడియా ముందు వాళ్ళ నాన్న మీద ఫన్నీ కౌంటర్!▶
Entertainment· 19 May 2026

మంచు మనోజ్ మీడియా ముందు వాళ్ళ నాన్న మీద ఫన్నీ కౌంటర్!

మంచు మనోజ్ రీసెంట్‌గా మీడియా అడిగిన క్వశ్చన్‌కి ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీ ఫ్యామిలీ ఇష్యూస్ క్లియర్ అయినట్టేనా? అని రిపోర్టర్ అడగ్గా. అది ఎవరిని అడగాలో మీకే తెలుసు, వెళ్లి అడగండి. కానీ మైక్ పట్టుకుని కాదు. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! అంటూ వాళ్ళ నాన్నని ఉద్దేశించి నవ్వుతూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఈ క్రేజీ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కస్టమర్ లా వచ్చి దోస తింటున్న ఆవు!▶
Viral· 19 May 2026

కస్టమర్ లా వచ్చి దోస తింటున్న ఆవు!

ఒక దోస సెల్లర్ తన షాప్‌కి రెగ్యులర్‌గా వచ్చే ఒక ఆవు కోసం స్పెషల్‌గా దోస ప్రిపేర్ చేసి తినిపించాడు. ఆవు కూడా ఎంతో సైలెంట్‌గా, ఓపికగా వెయిట్ చేసి మరీ ఆ దోసను తిని వెళ్ళింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మమతా బెనర్జీకి బిగ్ షాక్!▶
Politics· 19 May 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్!

పశ్చిమ బెంగాల్ ఫల్తా నియోజకవర్గం TMC MLA క్యాండిడేట్ జహంగీర్ ఖాన్ CM మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. మే 21న జరిగే రీపోలింగ్‌ నుండి డ్రాప్ అవుతున్నట్లు అనౌన్స్ చేస్తూ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. ఏరియా డెవలప్‌మెంట్ కోసమే ఈ డిసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. లాస్ట్ టైం పోలింగ్‌లో గొడవలు, EVM ఇష్యూస్ వల్ల ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రీపోలింగ్‌కి ఆర్డర్ ఇచ్చింది. ఈ ట్విస్ట్‌తో మమతా బెనర్జీకి లాస్ అనే చెప్పాలి అని ఆమె అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మైనర్ గర్ల్‌ను వేదించిన జనసేన లీడర్!
Crime· 19 May 2026

మైనర్ గర్ల్‌ను వేదించిన జనసేన లీడర్!

నరసాపురం జనసేన లీడర్ వెంకటరాజు ఒక మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె మైనర్ కూతురిని కూడా టార్గెట్ చేశాడు. తనతో రిలేషన్‌షిప్‌లో ఉండాలంటూ ఆ అమ్మాయిని ప్రెజర్ చేశాడు. వినకపోతే ఫ్యూచర్ పాడుచేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దారుణం ఏంటంటే, కన్నతల్లే కూతురిని ఫోర్స్ చేసింది. దీంతో ఆ గర్ల్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి, జస్టిస్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చింది.

వీధి కుక్కల ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్!
Politics· 19 May 2026

వీధి కుక్కల ఇష్యూపై సుప్రీంకోర్టు సీరియస్!

రోడ్లపై స్ట్రీట్ డాగ్స్ ను తీసేయాలన్న పాత రూల్స్‌ను మార్చాలని వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఈ డాగ్స్ ప్రాబ్లమ్‌ను అనిమల్ విషయంగా కాకుండా, ప్రజల ప్రాణాల సేఫ్టీ లాగా చూడాలని కోర్టు క్లియర్ గా చెప్పింది. ప్రతి జిల్లాలో డాగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేసే సెంటర్స్ పెట్టాలని, యాంటీ రేబిస్ మందులు రెడీగా ఉంచాలని గవర్నమెంట్స్‌కు చెప్పింది. డేంజర్ గా మారిన కుక్కలపై లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.

మల్టిపుల్ రోల్స్ చేయలేను.. టీచర్ జాబ్‌కు రిజైన్ చేస్తున్నాను!▶
Politics· 19 May 2026

మల్టిపుల్ రోల్స్ చేయలేను.. టీచర్ జాబ్‌కు రిజైన్ చేస్తున్నాను!

నేను నా టీచర్ జాబ్‌కు రిజైన్ చేశాను అంటూ ఒక యంగ్ టీచర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. స్కూల్‌లో తనతో టేబుల్స్ క్లీన్ చేయించారని, ఒక్క టీచర్ శాలరీతోనే ఇంగ్లీష్, కంప్యూటర్స్, మ్యాథ్స్, సైన్స్, డాన్స్ లాంటి మల్టిపుల్ రోల్స్ చేయించుకున్నారని ఆమె బాధపడ్డారు. రూల్స్ పేరుతో శాలరీ కట్ చేశారని, హిందీ మాట్లాడితే ఫైన్ వేసేవారని చెబుతూ.. చిన్నప్పుడు మనం టీచర్స్ ని దేవుడిలా చూసేవాళ్లం అంటూ ఆమె వీడియొ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కష్టమంతా మర్చిపోయే క్షణం!▶
Viral· 19 May 2026

కష్టమంతా మర్చిపోయే క్షణం!

వ్యవసాయం చేసే రైతులకు పంట చేతికొచ్చే టైమే అసలైన పండగ. పొలంలో డే అండ్ నైట్ కష్టపడి, ఫైనల్‌గా ఆ హార్వెస్ట్ చేసిన పంట చేతికి వస్తే ఆ హ్యాపీనెస్ వేరు. రైతుల కష్టాన్ని, వాళ్ల సంతోషాన్ని చూపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్రికల్చర్ లవర్స్ అండ్ నెటిజన్స్‌ను తెగ అట్రాక్ట్ చేస్తోంది.

పవన్ కళ్యాణ్‌కు అమిత్ షా షాకింగ్ అడ్వైస్!▶
Politics· 19 May 2026

పవన్ కళ్యాణ్‌కు అమిత్ షా షాకింగ్ అడ్వైస్!

EX CM జగన్ అరెస్ట్ గురించి మాట్లాడటానికి ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌కు హోం మినిస్టర్ అమిత్ షా నుండి గట్టి రిప్లై వచ్చినట్లు పొలిటికల్ అనలిస్ట్‌లు చెబుతున్నారు.. జగన్ అరెస్ట్‌పై ప్రెజర్ పెట్టగా.. అమిత్ షా దాన్ని స్మూత్‌గా రిజెక్ట్ చేశారని సమాచారం. అంతేకాదు, పాలిటిక్స్‌లో పర్మనెంట్ ఫ్రెండ్స్, టెంపరరీ ఫ్రెండ్స్ ఎవరుంటారని, పోలిటిక్స్ లో ఎలా ఉండాలనే దానిపై పవన్‌కు అమిత్ షా కొన్ని క్లాసులు చెప్పి పంపించారట.

రోడ్లపై ఫుల్ డిమాండ్‌లో తాటిముంజలు!
Health· 19 May 2026

రోడ్లపై ఫుల్ డిమాండ్‌లో తాటిముంజలు!

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి, టెంపరేచర్స్ ఆల్రెడీ 44డిగ్రీలు దాటేసింది. మే 23 వరకు హీట్‌వేవ్స్ ఇంకా పెరుగుతాయని ఎక్స్పర్ట్ అలర్ట్ చేశారు. afternoon అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు. ఈ ఎండల నుండి రిలీఫ్ కోసం పబ్లిక్ coconut water, తాటిముంజలు, sugarcane జ్యూస్ లాంటి నేచురల్ డ్రింక్స్‌ను తెగ కొనేస్తున్నారు. దీంతో రోడ్ల పక్కన ఉండే చిన్న వ్యాపారులకు మంచి బిజినెస్ జరుగుతోంది.

PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!▶
Politics· 19 May 2026

PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!

లిఫ్ట్ దగ్గరకు వెళ్లే దారిలో PM మోదీని ఒక క్వశ్చన్ అడుగుదామని ట్రై చేశాను, కానీ డోర్స్ క్లోజ్ అవ్వడంతో అడగలేకపోయాను అంటూ నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ మరో ట్వీట్ చేశారు. ఇండియాలో హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్, ప్రెస్ ఫ్రీడమ్‌పై రూల్స్ ఉన్నా సరే. నార్డిక్ దేశాలు ఆయన్ని నమ్మడం కరెక్టేనా? అని అడగాలనుకున్నట్లు ఆమె పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.

అదానీ VS అమెరికా: ₹1,210 కోట్ల భారీ సెటిల్‌మెంట్‌తో కేసులన్నీ క్లోజ్
World· 19 May 2026

అదానీ VS అమెరికా: ₹1,210 కోట్ల భారీ సెటిల్‌మెంట్‌తో కేసులన్నీ క్లోజ్

పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులన్నీ పర్మనెంట్ గా క్లోజ్ అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌లో కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారీగా లంచాలు ఆఫర్ చేశారంటూ Fraud, Bribery కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుల్ని అదానీ సెటిల్ మెంట్ చేసుకున్నారు. అదానీ గ్రూప్ మొత్తం $145 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో ₹1,210 కోట్లు సివిల్ పెనాల్టీ చెల్లించడానికి అంగీకరించింది. ఈ మొత్తంలో సెక్యూరిటీ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ కు $85 మిలియన్లు, జస్టిస్ డిపార్ట్ మెంట్ కి $60 మిలియన్లు చెల్లిస్తారు. దీంతో అమెరికా కేసులన్నీ క్లోజ్ చేసింది.

విజయ్ కి వెంకట్ ప్రభు స్పెషల్ గిఫ్ట్
Viral· 19 May 2026

విజయ్ కి వెంకట్ ప్రభు స్పెషల్ గిఫ్ట్

తమిళనాడు సీఎం విజయ్ సినిమా GOAT‌లో కనిపించిన “TN07 CM 2026” నంబర్ ప్లేట్ ఇప్పుడు రియల్ లైఫ్‌లో వైరల్ అవుతోంది. అప్పట్లో అది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు hint అని ఫ్యాన్స్ అప్పట్లో పండగ చేసుకున్నారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మ్యానిఫెస్టేషన్ నిజమైంది సంబరాలు చేసుకున్నారు. గోట్ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు అదే నెంబర్ ప్లేట్ ను విజయ్ కి గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఆ ఫోటోతో పాటు A history is made అంటూ వెంకట్ ప్రభు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది

శాన్ డియాగో మసీదులో కాల్పులు .. ముగ్గురు మృతి
World· 19 May 2026

శాన్ డియాగో మసీదులో కాల్పులు .. ముగ్గురు మృతి

అమెరికాలోని శాన్ డియాగోలో దారుణం జరిగింది. ఒక మసీదు ప్రాంగణంలోకి చొరబడిన ఇద్దరు టీనేజ్ సాయుధులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నిందితులిద్దరూ శవాలుగా కనిపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయుధాలపై యాంటీ ముస్లిం మెసేజ్లు, సూసైడ్ నోట్ దొరకడంతో FBI రంగంలోకి దిగి దీనిని Hate Crime కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటన ఈద్‌కు ముందు జరగడం అక్కడి ముస్లిం కమ్యూనిటీలో భయాందోళనలు పెంచింది.

మళ్లీ పెట్రో బాదుడు
General· 19 May 2026

మళ్లీ పెట్రో బాదుడు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు షాక్ ఇస్తూ పెట్రోల్, డీజిల్ 90 పైసల వరకు పెంచాయి. వారం రోజుల్లోనే రెండోసారి ధరలు పెరగడంతో సామాన్యుడిపై ఎనలేని భారం పడింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రో సంస్థలు ఇక్కడ ధరల్ని పెంచేస్తున్నాయి. దీంతో మొత్తం నిత్యావసరాల ధరలపై ఎఫెక్ట్ పడి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది.

అమిత్ షా- నక్సలిజం ఖతం!
Politics· 18 May 2026

అమిత్ షా- నక్సలిజం ఖతం!

దేశంలో నక్సలైట్ల ప్రాబ్లమ్‌ను పూర్తిగా ఎండ్ చేయడమే తమ టార్గెట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడంలో హెల్ప్ చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్, డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆయన ప్రత్యేకంగా సన్మానించారు. మార్చి 31, 2026 నాటికి దేశం మొత్తం నక్సలిజాన్ని క్లియర్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, బస్తర్ ఏరియా ఇప్పుడు ఫుల్ సేఫ్‌గా మారిందని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!▶
Politics· 18 May 2026

PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!

ఇండియా PM నరేంద్ర మోదీ నా క్వశ్చన్స్ తీసుకోలేదు, అయినా ఆయన ఆన్సర్ చేయరని నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే. ఇండియా 157వ ప్లేస్ లో పాలస్తీనా, యూఏఈ, క్యూబాతో పోటీ పడుతోందని ఆమె కామెంట్ చేశారు. మనతో కలిసి పనిచేసే పవర్స్‌ను క్వశ్చన్ చేయడం మా బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు.

కృష్ణ - విజయనిర్మల కార్ వాల్యూ అన్ని కోట్లా?▶
Entertainment· 18 May 2026

కృష్ణ - విజయనిర్మల కార్ వాల్యూ అన్ని కోట్లా?

సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలల కార్ గురించి యాక్టర్ నరేష్ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. 15 ఏళ్ల క్రితమే ఈ కార్‌ను ఒక కోటికి పైగా పెట్టి కొన్నారని ఆయన చెప్పారు. వాళ్లిద్దరి జ్ఞాపకాలకు గుర్తుగా ఆ కార్ ఇప్పటికీ తమ దగ్గరే సేఫ్‌గా ఉందని నరేష్ చెప్పారు. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

జైల్లో యాక్టర్ సూసైడ్ అటెంప్ట్?
News· 18 May 2026

జైల్లో యాక్టర్ సూసైడ్ అటెంప్ట్?

మర్డర్ కేస్‌లో జైల్లో ఉన్న కన్నడ యాక్టర్ దర్శన్ సూసైడ్ అటెంప్ట్ చేశారంటూ వచ్చిన రూమర్స్ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేశాయి. దీంతో జైలు దగ్గర కొద్దిగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఈ న్యూస్‌లో ఎలాంటి నిజం లేదని, దర్శన్ సేఫ్‌గా ఉన్నారని జైలు డీజీపీ క్లారిటీ ఇచ్చారు. రేపు తన వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఫ్యామిలీని కలవడానికి పర్మిషన్ ఇవ్వాలని దర్శన్ కోర్టును కోరారు.