చిత్తూర్ లో జర్నలిస్ట్ హత్య!

ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అయిన వారణాసి జగన్ మోహన్ రెడ్డి అలియాస్ జగన్(49)ను, నిన్న మంగళవారం ఉదయం 7:30 నిమిషాల ప్రాంతంలో వీకోట మండలంలోని ధన్నూపురం గ్రామంలో, మరో జర్నలిస్ట్ సుబ్రమణ్యం తో పాటు వాకింగ్ చేస్తున్న టైమ్లో, మహబూబ్ బాష అలియాస్ తానీమ్ అనే రౌడీ షీటర్ మటన్ కొట్టే కత్తి తో బైక్ పై తన బావమరిధి సుభాన్ తో వచ్చి దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన సుబ్రమణ్యం ను తోసివేశాడు. అనతరం వారిద్దరూ బైక్ పై పారిపోయారు. ప్రస్తుతం వారిద్దహరి కొసం పోలీసులు వెతుకుతున్నారు.



