Latest

కేరళలో మండుతున్న ఎండలు.. పాముల రూపంలో కొత్త టెన్షన్!
కేరళలో మండే ఎండలకు తోడు మరో టెన్షన్ ప్రజల్లో మొదలైంది. పాము కాట్లు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజుల్లో ఏడుగురు వ్యక్తులు పాముకాటుకి బలైపోయారు. భూమి లోపల వేడికి తట్టుకోలేక పాములు జనావాసాల్లోకి దూరిపోతున్నాయి.ఎండల వల్ల పాముల్లో crankiness పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అవి మనుషులపై అటాక్ చేస్తాయని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. So Guys వేసవిలో పాములతో కాస్త జాగ్రత్త.
ఈవీఎం ట్యాంపరింగ్ అనుమానాలు.. స్ట్రాంగ్ రూమ్ దగ్గర మమత పహారా
పశ్చిమ బెంగాల్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. దక్షిణ కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపరిచిన సాఖావత్ మెమోరియల్ స్కూల్ దగ్గర గురువారం అర్ధరాత్రి ఆమె మూడు గంటలు పహారా కాశారు. ఆ స్కూల్లో మమత పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఈవీఎంలను ఉంచారు. అక్కడ పరిస్థితులు పర్యవేక్షించాక మమత మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తాను జీవితాంతం పోరాటం చేస్తానన్నారు. మమత ఈ స్థాయిలో ఈవీఎంలకు పహారా కాయడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

బండ బాదుడు.. కమర్షియల్ సిలండర్ పై రూ.993 పెంపు
కమర్షియల్ LPG సిలండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీలు ఉండే ఒక్కో సిలండర్ పై రూ.993 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్క సిలండర్ ధర రూ. 3,315కి చేరుకుంది. గృహ అవసరాలకు వినియోగించే సిలండర్ ధర మాత్రం పెంచలేదు. అమెరికా, ఇరాన్ యుద్ధంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ సిలండర్ ధర పెరిగినా సామాన్యుడి జేబుకు చిల్లు పడినట్టే. చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగా కాస్ట్లీ కానుంది.
డేగ వర్సెస్ నల్ల త్రాచు - గెలుపెవరిది? వైరల్ వీడియో !
డేగ కళ్లు అని ఊరికే అనరు. ఆకాశంలో ఎగిరే డేగ నేలపై ఉన్న జీవులను వేటాడుతుంది. అలాగే ఓ డేగ నేలపై పాకుతున్న నల్లత్రాచును పట్టుకుంది, కానీ పాము దాన్ని చుట్టేసి బంధించింది. ఒకరికి వేట. మరొకరికి ప్రాణంకోసం ఆత్మరక్షణ. వీర లెవెల్ లో సాగుతున్న వీటి ఫైటింగ్ లో అప్పుడే అక్కడికి వచ్చిన సింహాలు డేగను పాము బారినుంచి కాపాడాయి. ఈ ఘటన నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ దృశ్యాన్ని తలపించేలా ఉండటంతో, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది..

ఫెయిల్ భయంతో ఆత్మహత్య... తీరా రిజల్ట్ చూస్తే పాస్ !!
పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఒక తెలంగాణ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, ఆ తర్వాత ఆమె ఫస్ట్-క్లాస్ మార్కులతో పాస్ అయినట్లు తెలిసింది. మెదక్ జిల్లాకు చెందిన సాయిప్రియ అనే విద్యార్థిని, పరీక్షలలో ఫెయిల్ అవుతాననే తీవ్ర ఆందోళనతో ఏప్రిల్ 24న ఆత్మహత్య చేసుకుంది. ఫెయిల్ అయినా పర్వాలేదని తల్లిదండ్రులు భరోసా ఇచ్చినప్పటికీ, ఆమె భయం కొనసాగుతూనే ఉంది. మరుసటి రోజు ప్రకటించిన ఫలితాల్లో ఆమె 480 మార్కుల అధిక స్కోరుతో ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది..
ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు !!
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ఇరికించే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ ఎస్ నేత ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సంధ్య శ్రీధర్ రావుపై ఇప్పటికే 26 కేసులున్నాయని అతడిని గుప్పిట్లో పెట్టుకుని అతని చేత నవీన్ పేరు, ఇతరుల పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 45 రోజులు జైలులో ఉండి వచ్చిన సీనియర్ జర్నలిస్టు చేత హరీష్ రావు ప్రమేయం ఉన్నట్లు చెప్పించే కుట్ర జరుగుతోందని తమకు సమాచారం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు.

ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్- డ్యాన్స్ రాదని తిట్టారు!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్ స్టార్టింగ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ ఆమెపై అందరిముందే అరిచారట. అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్ కూడా నేర్చుకో అని మైక్ విసిరేసి వెళ్ళిపోయారట. దీంతో పట్టుదలతో కత్రినా కైఫ్‌తో కలిసి రోజుకు 6 గంటలు ప్రాక్టీస్ చేశానని ప్రియాంక చెప్పారు. ప్రస్తుతం ఆమె రాజమౌళి - మహేష్ బాబు సినిమా ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ మూవీలో తనకు ఒక మంచి డ్యాన్స్ సాంగ్ కావాలని రాజమౌళిని రిక్వెస్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.

TRS పార్టీ పేరు నాకే రాసిపెట్టి ఉంది!
కవిత అనౌన్స్ చేసిన ‘TRS’ (తెలంగాణ రక్షణ సేన) పార్టీకి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ పేరు ఓకే అవ్వడంపై కవిత చాలా హ్యాపీగా ఉన్నారు. ‘TRS’ అనే పేరు తనకే రాసిపెట్టి ఉందేమో అని ఆమె ఎమోషనల్ అయ్యారు. బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు దీనికి సంబంధించిన లెటర్ ఇచ్చారు. ఒకవేళ ఈ పేరుపై ఎవరికైనా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే 30 డేస్ లోనే చెప్పాలని EC ఇన్ఫార్మ్ చేసింది. ఇకపై కూడా తెలంగాణ కోసం తన పని కొనసాగుతుందని కవిత క్లారిటీ ఇచ్చారు.
మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. కంట్రోల్ తప్పిన కారు!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఓవర్ స్పీడ్ ఒకరి ప్రాణం తీసింది. ఎదురుగా బైకర్ రావడంతో కారు కంట్రోల్ తప్పి, పక్కనే ఉన్న రెండు బైకులను అండ్ ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్‌లోనే చనిపోగా, నలుగురి కండిషన్ సీరియస్ గా ఉంది. ఓవర్ స్పీడ్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ పై కంట్రోల్ ఉండాలని ఈ incident చెప్తోంది. సో అందరూ సేఫ్ గా డ్రైవ్ చెయ్యండి.

ఎల్లుండినుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు పడే ఛాన్స్ !!
ఎండలకు మాడిపోతున్న ఉత్తరాంధ్ర వాసులకు శుభవార్త. మే 2వ తేదీ నుండి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వర్షాలు పెరుగుతాయని, అదే సమయంలో తిరుపతి, నెల్లూరు, ఒంగోలు దక్షిణ కోస్తా ప్రాంతంలో తీవ్రమైన వడగాల్పులు, అలాగే తూర్పు రాయలసీమ, విజయవాడ, గోదావరి ప్రాంతాలలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా. నిన్నటి ఉరుములు, వడగళ్ల వాన వాతావరణమే ఈరోజు కూడా కొనసాగుతూ చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు,సాయంత్రానికి తిరుపతి పశ్చిమ ప్రాంతాలతో పాటు ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
12 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద!
నిర్మల్ జిల్లా పెంబి మండలంలో షార్ట్ సర్క్యూట్ వల్ల 12 ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. నెలల కష్టం కళ్లముందే కాలిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇంత జరిగినా లీడర్లు పట్టించుకోలేదు, మీడియా కూడా దీని గురించి మాట్లాడటం లేదు.ఈ పంట నష్టం రైతులకు వాళ్ళ లైఫ్ లో చాలా పెద్ద దెబ్బ. ఆ రైతుల కష్టాన్ని, ఆవేదనను అందరూ ఇగ్నోర్ చేయడం బాధాకరం, ప్రబుత్వం ఇప్పడికి అయిన నిర్మల్ జిల్లా రైతులని ఆదుకోవాలి.

ఆ మ్యూజిక్ కంపోజర్ మద్రాస్ ఎపిస్టిన్ !!
తమిళ సింగర్ స్వాగత ఎస్. కృష్ణ ఓ తమిళ మ్యూజిక్ కంపోజర్ తనను సెక్సువల్ గా హెరాస్ చేశాడని ఆరోపించింది. ఇండస్ట్రీలో పేరున్న ఆ కంపోజర్ తనను పలుమార్లు వేధించాడని ఆ వేధింపులకు భయపడి తాను సింగింగ్ ప్రొఫెషనే వదిలేసుకుని రిషికేష్ షిష్ట్ అయిపోయినట్లు తెలిపింది. అతని స్టూడియోలోనే ఈ వేధింపులకు పాల్పడేవాడని తనతో పాటు చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని అంది. ఆకంపోజర్ ను మద్రాస్ ఎప్ స్టిన్ అని ఆమె కామెంట్ చేసింది. ఆ వేధింపులు తనను మానసి కంగా ఇబ్బంది పెట్టాయని, ఇప్పుడు ధైర్యం వచ్చి ఈ ఇష్యూలో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నట్లు స్వాగత కృష్ణ తెలిపింది.

వర్కవుట్ చేసేవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
చాలామందికి Exercise చేయడం మీద ఉన్న consetration, అది కంప్లీట్ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇంట్రెస్ట్ చూపించరు. Exercise తర్వాత బాడీని సరిగ్గా కూల్ డౌన్ చేయకపోతే మజిల్ పెయిన్, injure అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వర్కవుట్ అయ్యాక వెంటనే రిలాక్స్ అవ్వకుండా కాసేపు నడవాలి, బాడీకి తగినంత వాటర్ తాగాలి. అలాగే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. చెమట పట్టిన క్లాత్స్ వెంటనే చేంజ్ చేసి స్నానం చేయాలి, అలాగే నైట్ 6 to 7hours ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

రక్షించాల్సిన పోలిసే చేసిన ఘాతకం!
వినుకొండ మాజీ CI చిన్న మల్లయ్యపై లైంగిక దాడి మరియు బెదిరింపుల కేసు నమోదైంది. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లి, దాడి చేసి రేప్ చేయడానికి ప్రయత్నించినట్లు కంప్లయింట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. బాధితురాలిని మెడికల్ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారే ఇలాంటి నేరానికి పాల్పడటం సంచలనంగా మారింది.

గుండె పోటుకు ఆరేళ్ళ పాప బలి!
గుండె పోటుకు వయసుతో సంబంధం లేదని మరొక సారి నిరూపితం అయ్యింది. AP లోని అనంతపురం జిల్లాలో నైనీక అనే 6 ఏళ్ల పాప ఆడుకుంటూ కింద పడిపోయింది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప చనిపోయిందని కన్ఫార్మ్ చేసిన డాక్టర్లు, పాప మరణానికి హార్ట్ అటాక్ కారణం అని ధృవీకరించారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

విడుదలైన AP 10th SSC రిసల్ట్స్!
AP లో SSC వాళ్ళకు 10th రిసల్ట్స్ విడుదల అయ్యాయి. వారిలో 85.25% మంది పాస్ ఏయినట్లు తెలిసింది. పార్వతీపురం మన్యం జిల్లా 96.07% తో టాప్ లో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా మాత్రం 57.12% తో క్రింది స్థాయిలో నిలిచినధి. దీంతో చాలా మంది విధ్యార్థులు పండగ చేసుకుంటున్నారు. అందరికంటే టాప్ వచ్చింది ఎన్. సాయిపర్ణిక (విజయవాడ): 593 మార్కులు.
మేస్త్రి దగ్గరకు కారు రిపేర్: సిమెంట్, ఇటుకలతో అతికించేశారు!
సోషల్ మీడియాలో ఒక వెరైటీ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా కారు బాడీ డ్యామేజ్ అయితే మెకానిక్ షెడ్ కి వెళ్తాం, కానీ ఒక వ్యక్తి మాత్రం తాపీ మేస్త్రి దగ్గరకు వెళ్లాడు. ఆ మేస్త్రి ఇటుకలు, సిమెంట్‌తో కారు వెనుక భాగాన్ని రిపేర్ చేయడం నెటిజన్లను షాక్ కి గురిచేస్తోంది. షోరూమ్ వాళ్లు ఎక్కువ డబ్బులు అడిగితే, మేస్త్రి ఓన్లీ రూ. 200కే పని పూర్తి చేశాడు, ఇంకా ఈ వీడియో కింద ఇలాంటి ఐడియాస్ మన ఇండియన్స్ కే వస్తాయని క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.

చట్టాలు మార్చండి : టీనేజీ బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీం
15 ఏళ్ల టీనేజ్ బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దానిని తొలగించుకునేలా చట్టంలో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించింది. 20 వారాలు దాటిన తర్వాత అబార్షన్ చేస్తే ఆ బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు అత్యాచారం కేసుల్లో గర్భాన్ని మోయడం అంటే ఆమె ఎంత మానసిక వేదనకు గురై ఉంటుందో ఆలోచించాలని చెప్పింది. దానికి అనుగుణంగా చట్టసవరణలు చేయాలని అభిప్రాయపడింది.
పులుల ఫైట్ ... టూరిస్టుల డేంజర్ గేమ్
రాజస్థాన్ లోని రణతంబోర్ నేషనల్ పార్క్ లో రెండు పులులు భీకరంగా పోరాడుతూ ఉంటే టూరిస్టులు వాటికి దగ్గరగా వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. మాజీ IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్ చేస్తూ..టూరిస్టులు బాధ్యతతో ప్రవర్తించాలని అన్నారు, జంతువుల ఏకాంతాన్ని భంగం కలిగించడం రిస్క్ అని హెచ్చరించారు. పులులకి అంత దగ్గరగా వెళితే మీ ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

స్టార్ బౌలర్ బుమ్రాకు ఏమైంది?
IPL 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో ఓన్లీ 2 వికెట్లు మాత్రమే తీయడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అయితే కోచ్ పొలార్డ్ మాత్రం బుమ్రాకు సపోర్ట్ చేశారు. బుమ్రా కూడా మనిషే కదా, ఎవరికైనా కొన్ని డేస్ కలిసి రావు అని బుమ్రా failureని వెనకేసుకొచ్చారు. టీమ్ వరుసగా ఓడుతున్నా, తాము ఇంకా Playoffs రేసులోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు.
పొలాల్లో మంటలకు చెక్.. రైతులకు వరం ఈ-బ్రష్ కట్టర్స్
పంటల కోత తర్వాత పొలాల్ని మంటల్లో తగులబెట్టే తలనొప్పులు ఇక ఉండవు. పర్యావరణానికి అనుకూలంగా, రైతులకు ఆదాయం వచ్చే ఒక కొత్త టెక్నాలజీ వినియోగాన్ని యూపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. వికల్ప్ సంస్థకు చెందిన బ్యాటరీతో నడిచే 100 బ్రష్ కట్టర్లను అవురయ్యా జిల్లా రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవి నేలకి దగ్గరగా పంటను కోయడమే కాకుండా, మిగిలిన వ్యర్థాలను సోలార్ మెషిన్లతో పశువుల మేతగా మారుస్తాయి. దీనివల్ల పొలాల్ని తగులబెట్టాల్సిన పని లేదు. పశువులకి మేత దొరుకుతుంది.