Latest

రాష్ట్రం బొందల పడ్డట్టు అయింది ః కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత K. Chandrashekar Rao కీలక వ్యాఖ్యలు చేశారు.2009లో ,చంద్రబాబుతో “జై తెలంగాణ” అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.రైతుల కోసం ‘రైతు బంధు’ పథకాన్ని తాము పెట్టామన్న కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేయడం చేతకావడం లేదని విమర్శించిన ఆయన, రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, పరిస్థితి ‘బొందల పడ్డట్టు’ అయిందని వ్యాఖ్యానించారు.

ఏటా 5 వేలమంది ఇండియన్ టెకీలకు టెంపరరీ వర్కింగ్ వీసాలు !
భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఏటా 5,000 మంది భారతీయ నిపుణులకు 'తాత్కాలిక ఉపాధి వీసాలు' లభించనున్నాయి. దీనివల్ల మన యువతకు న్యూజిలాండ్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలాగే, రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది వ్యవసాయం, సాంకేతిక రంగాలలో ఉపాధిని, వృద్ధిని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఏయూ వేడుకల్లో చంద్రబాబు సచిన్ చిట్ చాట్ !
ఆంధ్రాయూనివర్సిటీ వందేళ్ల వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సీఎం చంద్రబాబుతో సరదాగా కాసేపు చిట్ చాట్ చేశారు. ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఏయూ వందేళ్ల ప్రస్థానాన్ని పంచుకుంటూ క్రీడలు, ఎడ్యుకేషన్ సెక్టర్ల పై అనేక అంశాలను చర్చించారు. దేశానికే గర్వ కారణంగా నిలిచిన సచిన్ ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. సచిన్ రాకతో ఏయూలో సందడి నెలకొంది. చంద్రబాబు, సచిన్ చిట్ చాట్ పలువురి దృష్టిని ఆకర్షించింది.

డిప్రెషన్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
డిప్రెషన్ అంటే ఓన్లీ మూడ్ బాలేకపోవడం కాదు, దాని వెనుక బలమైన Brain cells ఉన్నాయని కెనడా Scientists కనిపెట్టారు. మన brainలోని Excitatory Neurons, Microglia అనే 2 టైప్స్ cells సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుందని తేలింది. వీటిని కనుగొనడం వల్ల ఫ్యూచర్ లో డిప్రెషన్‌ను మాయం చేసే పక్కా ట్రీట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది లక్షలాది మందికి నిజంగా గుడ్ న్యూస్!

ముంబై వాటర్ మిలన్ డెత్స్ కి రీజన్ ఇదేనా?
వాటర్ మిలన్ కలుషిత నీటితో పండితే.. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడితే, లేదా హానికారక బాక్టీరియా అందులో ఉంటే అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుందంటున్నారు డాక్టర్లు. ఒక్కొసారి కొన్నింటిలో ప్రమాదకరమైన ఈ కొలీ, సాల్మనెల్లా, లిస్టిరియోసిస్ లాంటి బాక్టీరియా ఉండొచ్చు. వ్యాపారులు పుచ్చకాయలకు ఎక్కువ స్వీట్ నెస్ కోసం గ్లూకోజ్ , కలర్ ని ఇంజెక్ట్ చేసి అమ్ముతుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉందనిపించడానికి నీటిని కూడా సిరెంజిలతో లోడ్ చేసి అమ్ముతుంటారు. ఇవన్నీ కూడా అనారోగ్యానికి కారణాలే. పైగా పుచ్చకాయను రాత్రిపూట తినక పోవడమే మంచిది.ముంబై డెత్స్ కి వీటిలో ఏదైనా కారణం కావచ్చు.

మా లెక్కలు వేరు.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ గట్టిగా రియాక్ట్ అయ్యింది. తమ ఆయిల్ పైప్లైన్లను తాకితే ఊరుకోమని, ప్రత్యర్థులకు అంతకు 4 టైమ్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా వైపు ఒక్క క్రూడ్ ఆయిల్ బావి దెబ్బతింటే.. మీకు సపోర్ట్ చేసే దేశాల్లో 4 టైమ్స్ లాస్ చేస్తాం అంటూ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో టెన్షన్ మొదలైంది!

భారత-న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
భారత్-న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం (FTA) వల్ల కలిగే మెయిన్ బెనిఫిట్స్ ఇవే: ఇండియాకు లాభం: సుమారు 8,284 రకాల ఇండియన్ ప్రోడక్ట్స్ (లెదర్, హ్యాండ్లూమ్స్ వంటివి) న్యూజిలాండ్‌లోకి ఎలాంటి డ్యూటీ లేకుండా ఎంట్రీ ఇస్తాయి. న్యూజిలాండ్ ఎగుమతులు: అక్కడి నుంచి వచ్చే ఉన్ని, బొగ్గు, పండ్లపై టారిఫ్స్ తగ్గుతాయి. అయితే మన రైతుల కోసం డైరీ, షుగర్, స్పైసెస్ వంటి రంగాలకు మినహాయింపు ఇచ్చారు. బిజినెస్ టార్గెట్: రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేస్తూ $5 బిలియన్లకు చేర్చడమే ఈ డీల్ లక్ష్యం!

భారత్, న్యూజీలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ !
భారత్ ,న్యూజిలాండ్ సోమవారం ఒక చారిత్రాత్మక Free Trade Agreement (FTA) పై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంత్రులు పియూష్ గోయల్, టాడ్ మెక్లే ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. న్యూజిలాండ్ పార్లమెంట్ దీనిని సమీక్షించి, ఆమోదించడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చు. ఈ ఏడాదే అమల్లోకి రానున్న ఈ డీల్ వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపారం నెక్స్ట్ లెవల్‌కు చేరుకోనుంది!

పిల్లల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు గుడ్ న్యూస్..
Live in relationship పై సుప్రీంకోర్టు ఒక షాకింగ్ రియాలిటీ చెక్ ఇచ్చింది. ఇద్దరూ ఇష్టపడి కొన్నేళ్లు కలిసి ఉండి, ఒక బిడ్డ కూడా పుట్టిన తర్వాత.. ఇప్పుడు అది అత్యాచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది. Consent తో రిలేషన్లో ఉండి, ఆ తర్వాత గొడవలొస్తే రేప్ కేసు పెట్టడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదని, వాళ్లకు అన్ని హక్కులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది..
గ్రౌండ్ లో సిక్సర్లు.. బయట ప్రాంక్‌లు! వైభవ్ వీడియో వైరల్..
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బయట చాలా సరదాగా ఉంటాడు. రీసెంట్ గా ఎయిర్‌పోర్ట్‌లో తనను చూడటానికి వచ్చిన కిడ్స్ తో వైభవ్ ప్రాంక్ చేశాడు. నాతో ఫోటో దిగాలంటే 100 ఇవ్వాలి అని సీరియస్‌గా చెప్పడంతో ఆ పిల్లలు షాక్ అయ్యారు. ఒక పిల్లాడు నిజంగానే 200 ఇస్తానని అనడంతో, వైభవ్ నవ్వి వారితో సెల్ఫీలు దిగాడు. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
IPL 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఇతని బ్యాటింగ్ చూసి పాక్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ బ్యాట్‌లో ఏమైనా AI Chip ఉందేమో చెక్ చేయాలి, ఇంత చిన్న వయసులో ఇలా ఆడటం ఇంపాసిబుల్ అని రియాక్ట్ అయ్యాడు. వైభవ్ టెక్నిక్ చూస్తుంటే అతడు ఫ్యూచర్ సూపర్ స్టార్ అవ్వడం ఖాయమని అభినందించారు.
ప్రాణం పోతుంటే కూడా రైలు ఆపరా?
వెస్ట్ బెంగాల్ లోని జల్పాయ్ గురి రూట్లో ఒక అబ్బాయి రైలులో నుంచి కింద పడిపోయిన ఘటన మన రైల్వే వ్యవస్థ ఎలా ఉందో చూపిస్తోంది. ప్యాసింజర్లు వెంటనే Emergency Chain లాగినా రైలు ఆగలేదు. Helpline, TTE కి కంప్లైంట్ చేసినా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఆ ట్రైన్ లోనే ఉన్న వాళ్ళ అక్క తమ్ముడి కోసం ఏడుస్తూ అరిచినా కూడా Railway Administration ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమర్జెన్సీలో చైన్ లాగితే ఆగని ఈ వ్యవస్థ, సామాన్యుల మీద మాత్రం ఫైన్లు వేయడానికి రెడీగా ఉంటుందని నెటిజెన్స్ అంటున్నారు.
KCR ఇంటికి వాటర్ ట్యాంకర్?
మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో వాటర్ ట్యాంకర్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్! తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం ఆయన హైదరాబాద్ వస్తుండగా, ఇంట్లో వాటర్ ప్రాబ్లం కారణంగా స్టాఫ్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. KCR ఇంటికే వాటర్ ట్యాంకర్ రావడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
భర్తకు సీరియస్, భార్య ambulence క్లీనింగ్!
మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. భర్తకి సీరియస్ ఉంది అని హాస్పిటల్ కి తీసుకెళ్తే, హాస్పిటల్ స్టాఫ్ మాత్రం కనీసం కనికరం కూడా లేకుండా అతని భార్య చేత అంబులెన్స్ క్లీన్ చేయించారు. ట్రీట్మెంట్ ఇవ్వడం మానేసి, ఇలాంటి పనులు చేయించడం ఏంటి? ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
AC ఎందుకు బ్రో.. ఉల్లిపాయ చాలు!
ఎండలు మామూలుగా లేవు కదా! దీనిపై కేంద్ర మంత్రి Jyotiraditya Scindia ఒక క్రేజీ టిప్ ఇచ్చారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 51°C ఎండలో కూడా తాను AC అస్సలు వాడనని, తనది స్ట్రాంగ్ "చంబల్ చర్మం" అని ఫన్నీగా చెప్పారు. పాతకాలపు ఈ ఆయుర్వేద హ్యాక్ ఎండల నుంచి మనల్ని కాపాడుతుందని ఆయన గుర్తుచేశారు.

watermelon తిని ఫ్యామిలీ మొత్తం చనిపోయారు!
ముంబైలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. saturday నైట్, ఫ్యామిలీ పార్టీలో వాటర్మిలాన్ తిని ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు . ఫ్రూట్ తిన్న కొద్దిసేపటికే వాంథింగ్స్ , స్టమక్ పెయిన్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లారు, కానీ దురదృష్టవశాత్తు వైఫ్ అండ్ హస్బండ్ తో పాటు వాళ్ళ డాటర్స్ కూడా చనిపోయారు. వాటర్మిలాన్ లో ఏవైనా కెమికల్స్ కలిశాయా లేదా అనేది Post-mortem రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది.
స్కూల్ ప్రిన్సిపల్ రూడ్ బిహేవియర్!
యూపీలోని హర్దోయ్ Sunbeam School ప్రిన్సిపల్ మమతా మిశ్రా ఒక పేరెంట్‌పై రూడ్ గా బిహేవ్ చేసింది. స్టూడెంట్ నోట్‌బుక్స్ స్కూల్లో కాకుండా బయట కొన్నారనే కోపంతో ఆమె షటప్ అంటూ గట్టిగా అరిచారు. అంతేకాకుండా స్టూడెంట్ ని స్కూల్ నుండి పంపేస్తానని బెదిరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో Viral కావడంతో, "స్కూలా లేక బిజినెస్ సెంటరా?" అంటూ నెటిజన్లు ప్రిన్సిపల్‌పై ఫైర్ అవుతున్నారు.

గుండుసూది మింగిన 8th క్లాస్ స్టూడెంట్!
గంపలగూడెంలో కోట వరుణ్ సందేశ్ అనే బాబు సరదాగా టీత్ ని గుండుసూదితో క్లీన్ చేసుకుంటూ, పొరపాటున దాన్ని మింగేశాడు. అది లంగ్స్ వరకు వెళ్లడంతో నోటి నుంచి బ్లడ్ వచ్చింది. వెంటనే విజయవాడలోని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. అక్కడ డాక్టర్స్ Magnet హెల్ప్ తో ఆ సూదిని బయటకు తీశారు. ప్రెసెంట్ బాబు సేఫ్ గా ఉన్నాడు.

సింగిల్స్‌కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కాకపోతే క్యాన్సర్ రిస్క్?
రీసెంట్ స్టడీస్ ప్రకారం.. పెళ్లయిన వారితో పోలిస్తే సింగిల్స్ లో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉందట! పెళ్లి కాకపోవడం వల్ల ఈ డిసీస్ రాదు, కానీ సింగిల్‌గా ఉండటం వల్ల సరిగ్గా తినకపోవడం, టైమ్‌కి చెక్అప్స్ చేయించుకోకపోవడమే మెయిన్ రీజన్ అని తేలింది. ముఖ్యంగా లేడీస్‌లో ఈ రిస్క్ ఇంకా ఎక్కువని Experts చెబుతున్నారు. సో పెళ్లి సంగతి పక్కన పెడితే, హెల్త్ విషయంలో మాత్రం కేర్లెస్గా ఉండకండి!

ఆ జడ్జి ముందు హాజరుకాను _కేజ్రివాల్
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఆమె ఈ కేసుని విచారిస్తే తనకు న్యాయం జరగదని, అందుకే తాను కానీ, తన తరఫున లాయర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకూడదని డెసిషన్ తీసుకున్నామంటూ న్యాయమూర్తికే ఒక లెటర్ రాశారు. స్వర్ణకాంత శర్మ విషయంలో తాను సుప్రీం కోర్టులో పోరాడతానని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తన నిరసన తెలియజేస్తున్నానని చెప్పారు.

పెళ్లి పీటలెక్కిన F2 నటి
సినీ నటి మెహరీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఆదివారం నాడు తన చిరకాల మిత్రుడు అర్ష్ ఔలఖ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వెడ్డింగ్ ఫోటోలను ఆమె ఇన్ స్టాలో షేర్ చేశారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీతో టాలీవుడ్ లోకి మెహరీన్ అడుగు పెట్టారు. అనిల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన F2, F3 మూవీస్ లో వరుణ్ తేజ్ పక్కన నటించి పేరు తెచ్చుకున్నారు.