← Back to news

రాష్ట్రం బొందల పడ్డట్టు అయింది ః కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

By DS· 27 Apr 2026· Hyderabad
రాష్ట్రం బొందల పడ్డట్టు అయింది ః కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత K. Chandrashekar Rao కీలక వ్యాఖ్యలు చేశారు.2009లో ,చంద్రబాబుతో “జై తెలంగాణ” అనిపించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.రైతుల కోసం ‘రైతు బంధు’ పథకాన్ని తాము పెట్టామన్న కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేయడం చేతకావడం లేదని విమర్శించిన ఆయన, రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, పరిస్థితి ‘బొందల పడ్డట్టు’ అయిందని వ్యాఖ్యానించారు.

More in Politics