← Back to news

ప్రాణం పోతుంటే కూడా రైలు ఆపరా?

By Subhash· 27 Apr 2026· X· West Bengal

వెస్ట్ బెంగాల్ లోని జల్పాయ్ గురి రూట్‌లో ఒక అబ్బాయి రైలులో నుంచి కింద పడిపోయిన ఘటన మన రైల్వే వ్యవస్థ ఎలా ఉందో చూపిస్తోంది. ప్యాసింజర్లు వెంటనే Emergency Chain లాగినా రైలు ఆగలేదు. Helpline, TTE కి కంప్లైంట్ చేసినా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఆ ట్రైన్ లోనే ఉన్న వాళ్ళ అక్క తమ్ముడి కోసం ఏడుస్తూ అరిచినా కూడా Railway Administration ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమర్జెన్సీలో చైన్ లాగితే ఆగని ఈ వ్యవస్థ, సామాన్యుల మీద మాత్రం ఫైన్లు వేయడానికి రెడీగా ఉంటుందని నెటిజెన్స్ అంటున్నారు.

More in News