రాఘవ చద్దా డెసిషన్ జెన్ జీ కి నచ్చలేదా?

రాఘవ చద్దా బీజేపిలో చేరడాన్ని జెన్ జీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుంది. ఆయన బీజేపి లో చేరిన మరుక్షణమే ఆయన ఇన్ స్టా గ్రామ్ ఫాలోయర్లు పది లక్షల మంది తగ్గిపోయారు. ఆయనకు ఇన్ స్టాలో 14.6 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా, నిన్నటికి ఇవాల్టికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసే రాఘవ్ చద్దాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈమధ్య ఆయన బీజేపిని ఎక్కువగా తిట్టడం లేదు.


