Latest

 ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి ః సంజయ్ సింగ్
Politics· 26 Apr 2026

ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి ః సంజయ్ సింగ్

బీజేపిలో చేరన ఆప్ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు.బీజేపిలో వారు చేరడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. ఏడుగురు ఎంపీలు ఆప్‌ నుంచి రాజ్యసభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆప్‌ నుంచి బీజేపీలో చేరారు. కాబట్ఆటి ఏడుగురి సభ్యత్వాలను రద్దు చేయాలి అని సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ ను కోరారు.

 ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం !
World· 26 Apr 2026

ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం !

పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ఇప్పటి వరకూ జరిపిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం విలువ బిలియన్ల డాలర్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలను దాటుకుని ఇరాన్ జెట్ విమానాలు కీలక స్థావరాలను ధ్వంసం చేయడం గమనార్హం. గతంలో ప్రకటించిన దానికంటే వాస్తవ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అమెరికా అత్యాధునిక పరికరాలు సమకూర్చుకున్నా.. అవన్నీ ఒక్క ఇరాన్ జెట్ దెబ్బకే తుక్కు తుక్కుఅయిపోవడం ఆశ్చర్యంకలిగిస్తోంది.

29న ప్రధాని చేతుల మీదుగా  లాంగెస్ట్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం
Local· 26 Apr 2026

29న ప్రధాని చేతుల మీదుగా లాంగెస్ట్ ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం

UP లోనే అతిపెద్దదైన Ganga Expressway ని ఏప్రిల్ 29న PM నరేంద్ర మోదీ లాంచ్ చేస్తున్నారు. UPEIDA డెవలప్ చేసిన ఈ మెగా ప్రాజెక్ట్ మొత్తం 594 కిలోమీటర్ల మేర ఉంటుంది. మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు ఉండే ఈ హై-స్పీడ్ కారిడార్‌ని దాదాపు రూ. 36,230 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇది ఓపెన్ అయితే ట్రావెల్ టైమ్ తగ్గడమే కాదు, స్టేట్ ఎకానమీకి ఒక రేంజ్‌లో బూస్ట్ రావడం పక్కా!

తమిళనాడులో జార్ఖండ్ గిరిజనులపై దాడులు !!
Crime· 26 Apr 2026

తమిళనాడులో జార్ఖండ్ గిరిజనులపై దాడులు !!

తమిళనాడులోని నామక్కల్‌లో గల ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో వేధింపులు తాళలేక జార్ఖండ్‌కు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. తమకు వేతనాలు చెల్లించలేదని, సరైన ఫుడ్ కూడా ఇవ్వకపోగా, తీవ్రంగా కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వదిలి వెళ్తామంటే తమను బెదిరించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించి విచారణకు ఆదేశించారు.

కంప్యూటర్ ఇంజనీర్, నాసా రీసెర్చర్ అయినా ఎందుకీ కాల్పులు
Crime· 26 Apr 2026

కంప్యూటర్ ఇంజనీర్, నాసా రీసెర్చర్ అయినా ఎందుకీ కాల్పులు

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ పార్టీలో కలకలం రేపిన షూటర్ వివరాలు బయటకొచ్చాయి. 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి ఈ కాల్పులకు తెగబడ్డాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇతను ఒక నాసా (NASA) రీసెర్చ్ స్టూడెంట్, కంప్యూటర్ ఇంజనీర్. అంతేకాకుండా పార్ట్ టైమ్ టీచర్ కూడా! కాలిఫోర్నియాకు చెందిన అలెన్ కి మంచి ప్రొఫైల్ ఉన్నా, ఇలాంటి వయోలెంట్ స్టెప్ ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఫెడరల్ ఆఫీసర్లపై దాడి, అక్రమ ఆయుధాల వినియోగం వంటి సీరియస్ కేసులు ఫైల్ అయ్యాయి.

తెలంగాణలో సెల్ఫ్ జనగణన షురూ.. ఆన్‌లైన్‌లో మీరే నింపేయండి ఇలా!
Local· 26 Apr 2026

తెలంగాణలో సెల్ఫ్ జనగణన షురూ.. ఆన్‌లైన్‌లో మీరే నింపేయండి ఇలా!

తెలంగాణలో స్వీయ జనగణన ఇవాళ్టి నుంచి మొదలైంది. మే 9వరకు మీరే డైరెక్ట్ గా ఆన్‌లైన్‌లో మీ డీటెయిల్స్ నింపేయొచ్చు. అఫీషియల్ పోర్టల్ se.census.gov.in ఓపెన్ చేసి తెలంగాణ ఎంచుకోండి. మీ ఇంట్లో కుటుంబ పెద్ద పేరు, మీ మొబైల్ నెంబర్, ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇంటి అడ్రస్ డీటెయిల్స్ 'Google Earth' మ్యాప్ ద్వారా కరెక్ట్ గా మార్క్ చేయాలి. మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. వాటిని నింపి సబ్మిట్ చేయగానే మీకు ఒక Reference ID వస్తుంది. ఎమ్మూనరేటర్లు మే 11 నుంచి జూన్ 9 మధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు ID చూపిస్తే మీ పనైపోతుంది. హెల్ప్ లైన్ నెంబర్ 1855కి కాల్ చేయొచ్చు.

కశ్మీరీలకు గుజరాత్ 'అమూల్' ట్రీట్.. పాలు రవాణాకు ప్రత్యేక రైలు
Business· 26 Apr 2026

కశ్మీరీలకు గుజరాత్ 'అమూల్' ట్రీట్.. పాలు రవాణాకు ప్రత్యేక రైలు

జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇకపై ఫ్రెష్ పాలు, లస్సీలు ఫుల్లుగా అందుబాటులో ఉండబోతున్నాయి! గుజరాత్ నుంచి దాదాపు 1,000 టన్నుల అమూల్ ఉత్పత్తులతో కూడిన దేశంలోనే మొట్టమొదటి 'మిల్క్ ఫ్రైట్ ట్రైన్' శనివారం రాత్రి జమ్మూ చేరుకుంది. రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల వల్ల పాలు పాడవకుండా సేఫ్‌గా వచ్చేశాయి. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా, తక్కువ టైమ్‌లో క్వాలిటీ డైరీ ఐటమ్స్ అందించడమే ఈ ట్రైన్ లక్ష్యం. ఇకపై కాశ్మీర్ లో డైరీ ఉత్పత్తుల కొరత అస్సలు ఉండదు!

ఆ షూటర్ ఇతనే
Crime· 26 Apr 2026

ఆ షూటర్ ఇతనే

అమెరికా వైట్ హౌస్ మీడియా డిన్నర్ మీట్ లో కాల్పులు జరపడంతో అందరూ షాక్ కి లోనయ్యారు. ప్రెసిడెంట్ భద్రతా ఏర్పాట్లలో డొల్లతనం ఈ ఘటనతో బయటపడింది. నిందితుడి వద్ద లెక్కకు మించి ఆయుధాలున్నాయని ట్రంప్ చెప్పారు. అతని ఫోటోని కూడా మీడియాకి రిలీజ్ చేశారు. 31 ఏళ్ల వయసున్న ఆ షూటర్ కాలిఫోర్నియాకు చెందిన టీచర్. అతని పేరు కోలో టమోస్ అలెన్. అతను ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై FBI ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది.

ట్రంప్ మీటింగ్ లో కాల్పుల కలకలం.. ప్రెసిడెంట్ సేఫ్ ▶
Crime· 26 Apr 2026

ట్రంప్ మీటింగ్ లో కాల్పుల కలకలం.. ప్రెసిడెంట్ సేఫ్

అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కరస్పాండెట్స్ కు ఇచ్చిన డిన్నర్ లో ఒక దుండగుడు కాల్పులు తెగపడ్డాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అలెర్ట్ అయి డొనాల్డ్ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను వేదిక నుండి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో షూటర్ గాయపడి పట్టుబడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తర్వాత అంతా క్షేమమేనని ట్రంప్ ప్రకటించారు.డిన్నర్ టైమ్‌లో ఈ 'షాకింగ్' ఇన్సిడెంట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది

 మద్రాస్ ఐఐటిలో వంద రూపాయలకే ఏఐ కోర్సులు !1
Local· 25 Apr 2026

మద్రాస్ ఐఐటిలో వంద రూపాయలకే ఏఐ కోర్సులు !1

మద్రాస్ ఐఐటి వినూత్నంగా వంద రూపాయలకే ఏఐ కోర్సులు అందిస్తోంది. మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించిన ఏఐ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ కోర్సుకు ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే. అలాగే ఏఐ ప్లాట్ ఫామ్ ను సమర్ధవంతంగా యూజ్ చేసుకోవాలనుకునేవారికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు ఫీజు కూడా వంద రూపాయలే. ఏఐ ఫర్ యాస్పైరింగ్ ఇంజనీర్స్ కోర్సుకు మాత్రం ఫీజు రూ.500 గా డిసైడ్ చేశారు. వీటికి జీఎస్టీ అదనం. ఈ కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు మే 10 లోగా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.

  ఏపీ సీఎం చంద్రబాబుకు అవార్డు !
Local· 25 Apr 2026

ఏపీ సీఎం చంద్రబాబుకు అవార్డు !

ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఎకనమిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఇవాళ సాయంత్రం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలాసీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డు ఆయన అందుకున్నారు. సందర్భంగా మీడియానుద్దేశించి కూడా మాట్లాడారు. ఎక్స్ లో బిజినెస్ రిఫార్మర్ సీబీఎన్ పేరుతో హ్యాష్ టాగ నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది

 వచ్చేనెల 9న వరంగల్ కు ప్రధాని
Politics· 25 Apr 2026

వచ్చేనెల 9న వరంగల్ కు ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 9న హైదరాబాద్ రానున్నారు. వరంగల్ లో ఏర్పాటు అవుతున్మాన మునూరు ఎయిర్ పోర్టు ప్రారంభానికి మోడీ వస్తున్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు బీజేపి ప్లాన్ చేస్తోంది. ఇవేకాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

 ఇరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సర్వీసులు షురు !
World· 25 Apr 2026

ఇరాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సర్వీసులు షురు !

ఇరాన్ లోని ఇమామ్ ఖొమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్ సర్వీసులు రీ ఓపెన్ అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి విమాన సర్వీసులు మొదలయ్యాయని, కీలక విమాన సర్వీసులు గతంలోలాగే యధాప్రకారం నడుస్తాయని ఇరాన్ వార్తాసంస్థ మెహర్ తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణల కారణంగా విమాన సర్వీసులు ప్రపంచ వ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగతులసి ఛైర్మన్ కు నోటీసులు
Politics· 25 Apr 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగతులసి ఛైర్మన్ కు నోటీసులు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో మరోసారి సాక్షులను విచారించాలని నిర్ణయించారు. యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ , టి.టి.డి మాజీ సభ్యులు కె. శివకుమార్ కు సిట్ నోటీసులిచ్చింది. మే 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది.

Rowdyలు ఇక "జైలుకు లేదా పైకి"
Politics· 25 Apr 2026

Rowdyలు ఇక "జైలుకు లేదా పైకి"

పశ్చిమ బెంగాల్ election campaignలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టేట్ లో rowdyism చేసేవారిని ఏరివేస్తామని, వారు జైలులో ఉండాలి లేదా పైకి పోవాలని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో కాంప్రమైస్ కామని, TMC గూండాలకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్పష్టం చేశారు. మే 4త్ రిసల్ట్స్ తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత !!
Local· 25 Apr 2026

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత !!

ఏపీలో పెట్రోల్, డీజిల్ లకు కొరత ఏర్పడింది. అనేక బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. కర్నూలులో బంక్ ల దగ్గర రద్దీ పెరిగింది . కొరత వస్తోందన్న భయంతో జనం క్యూ కట్టేస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో డీజిల్ కొరతతో వెహికల్స్ నానా అగచాట్లు పడుతున్నాయి.నిడమర్రు, గణపవరం, భీమడోలులో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. కాకినాడ పెట్రోల్ బంకుల దగ్గర చాంతాడంత క్యూ కనిపిస్తోంది. ఇవే కాదు.. ఇంకా చాలా చోట్ల పెట్రోల్, డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

చనిపోయిన వ్యక్తి కోసం డ్యాన్సర్లను పిలిపించిన ఫ్యామిలీ!
World· 25 Apr 2026

చనిపోయిన వ్యక్తి కోసం డ్యాన్సర్లను పిలిపించిన ఫ్యామిలీ!

సాధారణంగా అంత్యక్రియలు సాడ్ గా జరుగుతాయి, కానీ థాయిలాండ్ లో ఒక పర్సన్ తన డెత్ ని అందరూ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకున్నాడు. అతడి చివరి కోరిక మేరకు ఫ్యామిలీ మెంబర్స్ శవపేటిక ముందే Dancersతో డాన్స్ చేయించారు. బౌద్ధ టెంపుల్ లో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పబ్లిక్ రకరకాలుగా రియాక్ట్ ఔతున్నారు.

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!
Crime· 25 Apr 2026

నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!

కాన్పూర్ కోర్టు భవనంపై నుంచి దూకి పాతికేళ్ల లాయర్ ప్రియాన్షు శ్రీవాస్తవ చనిపోయాడు. ఆత్మ హత్యకు ముందు వాట్సప్ లో సూసైడ్ నోట్ వైరల్ గా మారింది. బాల్యంలో తండ్రి అకృత్యాలే సూసైడ్ కి కారణమని నోట్‌లో ఆరోపించాడు ప్రియాన్షు. తండ్రి కఠినంగా వ్యవహరించడంవల్ల మెంటల్ టెన్షన్ పెరిగిందని, ఇష్టం లేని చదువువల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు అందులో రాశాడు.ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి పెరిగి, ఆత్మన్యూనత భావంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.“నా డెడ్ బాడీని నా తండ్రి తాకకూడదు” అని రాయడం సంచలనం. తన తల్లిని నిందించొద్దని అతడు కోరాడు.

కమర్షియల్ టాక్సెస్ శాఖ అటెండర్ ఇంట్లో కోట్లాది ఆస్తులు !!
Crime· 25 Apr 2026

కమర్షియల్ టాక్సెస్ శాఖ అటెండర్ ఇంట్లో కోట్లాది ఆస్తులు !!

విజయవాడలో వాణిజ్య పన్నుల శాఖ అటెండర్‌ కొండపల్లి శ్రీనివాసరావుపై ACB కేసు నమోదైంది. ఆతని ఇల్లు, సోదరుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్లు అధికారులు నిర్ధారించారు..760 గ్రాముల బంగారం,5 గోల్డ్ బిస్కెట్లు,7.8 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో రూ.22 లక్షల క్యాష్ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు పేరిట .ఖరీదైన బంగ్లా,, స్థలం ఉన్నట్లు బయటపడ్డాయి..బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ACB అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

 తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనగణన
Local· 25 Apr 2026

తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనగణన

తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు. జనగణన రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో డీటైల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది.

 కేజ్రీ కొత్త బంగ్లా శీష్ మహల్- 2 ః బిజేపి
Politics· 25 Apr 2026

కేజ్రీ కొత్త బంగ్లా శీష్ మహల్- 2 ః బిజేపి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన కొత్త బంగళాను బీజేపీ 'శీష్ మహల్ 2'గా అభివర్ణించింది. ఈ బంగ్లా కో సం భారీగా ఖర్చు చేశారని, విలాసవంతమైన సౌకర్యాల కోసం ప్రైవేట్ డబ్బును ఉపయోగించారని బీజేపీ నేత పర్వేష్ వర్మ ఆరోపిస్తూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. అయితే, అవి నకిలీవని, వాటిని 'పింటరెస్ట్' నుండి డౌన్‌లోడ్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గట్టిగా బదులిచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆప్ మండిపడింది.