Latest

హైదరాబాద్ లో భారీ నకిలీ టీ పొడి దందా !
హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలయ్యింది. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను అధికారులు గుర్తించారు.కొందరు షాప్ ఓనర్స్ వాడేసిన టీ పొడికే మళ్లీ రంగులు వేసి అమ్ముతున్నారు. H- FAST పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ లో ఇది బయట పడింది. ఈ దందాలో 10 మంది నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. H- FAST ఏర్పడిన తర్వాత భారీగా కల్తీ దందాలను గుర్తించగలుగుతున్నారు. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు.

మీదే అసలైన నరకం ః ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
భారత్, చైనా తదితర దేశాలను నరకకూపాలుగా వర్ణిస్తూ రేడియో హోస్ట్ మైకేల్ సావెజ్ సోషల్ మీడియా పోస్టును అధ్యక్షుడు ట్రంప్ రీ పోస్ట్ చేయడంపై ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత, చైనా దేశాలు అద్భుతమైన నాగరికతలకు పెట్టింది పేరని, వేల ఏళ్ల చరిత్రను కలిగి చిరకాలం విస్తరించి ఉన్నాయని హైదరాబాద్ లోని ఇరాన్ ఎంబసీ కౌంటర్ ఇచ్చింది.బలమైన నాగరికతకు ఈ రెండు దేశాలు కేంద్రాలనీ, ఇరాన్ నాగరికతను అంతం చేస్తానన్న ట్రంప్ తీరే అసలైన నరకమని ఇరాన్ కామెంట్ చేసింది.

హర్ముజ్ లో డేటా కేబుల్స్ కి ముప్పు !
సీజ్ ఫైర్ ప్రకటించినా అమెరికా హర్ముజ్ ను దిగ్బంధించడంపై ఇరాన్ మండి పడుతోంది. ఈ సీన్ ఇలాగే కొనసాగితే సముద్రం లోపల్ ఉండే అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ తెగితే ఆ ప్రభావం పర్షియన్ గల్ఫ్ అంతటా పడుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఆ డేటా కేబుల్స్ కి ఉద్దేశపూర్వకంగా గానీ, ఏదైనా ఒత్తిడి వల్ల కానీ హాని కలిగితే పెను ముప్పే ఏర్పడుతుందని అంది. బ్యాకింగ్, క్లౌడ్ సర్వీస్ లాంటి కీలక కేబుళ్లన్నీ అక్కడ కుప్పలా ఉండటం వల్ల ప్రమాదం జరిగితే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది.

ఉస్మానియా దవఖానలో తాగు నీటి కొరత !!
ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో తాను నీరు లేక రోగులు నానా అగాట్లు పడుతున్నారు. కనీసం వాష్ రూమ్స్ లోసైతం నీటి సౌకర్యం లేక నానా అవస్థలూ పడుతున్నారు.రోజుకు వేల సంఖ్యలో పేషెంట్స్ వచ్చే ఆస్పత్రిలో తాగు నీరు లేకపోవడం మెట్రో వాటర్ బోర్డు వైఫల్యమేనని రోగులు ఆరోపిస్తున్నారు. అధికార్ల నిర్లక్ష్యం వల్ల నిరపరాధ రోగులకు శిక్ష పడుతోందని.. అధికారుల వైఫల్యాన్ని చక్క దిద్దాలని పేషెంట్స్ కోరుతున్నారు.

తమిళనాడులో 70 శాతం పోలింగ్..బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు !
ఎన్నికలు ఎదుర్కొంటున్న తమిళనాడు, బెంగాల్ లో ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు.. ఉదయం ఏడు గంటలకే రెండు చోట్లా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్ లోని నందిగ్రామ్ లో బీజేపి కార్యకర్తలు పోలింగ్ బూత్ లలోకి చొరబడటంతో ఘర్షణ రేగిందని టీఎంసీ ఆరోపించింది. మే 4వ తేదీన బెంగాల్ లో తృణమూల్ పాలనకు చెల్లు చీటి పడుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బెంగాల్ లో చెదురు మదురు ఘర్షణలతో పోలింగ్ కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా పోలింగ్ జరుగుతోంది.
పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు !!
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుని పోలీస్ బందోబస్తు నడుమ ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలు నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యంని స్థానిక ఆర్టీసీ కార్మికులు బతిమాలుకున్నారు.తమ సమ్మెను అడ్డుకోవద్దని, బస్సులు నడపవద్దని పోలీసుల కాళ్లమీద పడి ప్రాధేయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో డిపో నుండి ఒక్కో బస్ బందోబస్తుకు ఒక్కో కానిస్టేబుల్‌ను పెట్టి పోలీసులు బస్సులను నడిపిస్తున్నారు.

కూతురు వెడ్డింగ్ కార్డ్ లో సైబర్ జాగ్రత్తలు!
ఖమ్మంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తన కూతురు వెడ్డింగ్ కార్డ్ ను సమాజ సేవకు వేదికగా మార్చుకున్నారు. వెడ్డింగ్ కార్డ్ లో ఒక పేజీని ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పైఅవగాహన కల్పించేందుకు కేటాయించారు. ఫ్రీ గిఫ్ట్స్ కి ఆశపడొద్దు, తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దు అంటూ పెళ్లికి వచ్చే అతిథులకు ఉపయోగపడేలా ముఖ్యమైన జాగ్రత్తలు ప్రింట్ చేయించాడు. ఇలాంటి కొత్త ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒంటరి యువతికి కేరళ ఆర్టీసీ బస్సు రక్షణ !
కేరళలోని అలప్పుజి జిల్లాలో మానవత్వం వెల్లి విరిసింది.కోజి కోడ్ నుంచి పత్తనం తిట్ట వెళుతున్న కేఎస్ ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12 గంటల సమయంలోఎస్ ఎల్ ఆర్ పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగగా ఓ మహిళ బస్సు దిగింది. కానీ చుట్టుపక్కల తనను రిసీవ్ చేసుకునేవారు లేకపోవడంతో అలాగే నిలబడింది. బస్సు డ్రైవర్ పెద్ద మనసు చేసుకుని ఆమె సంబంధికులు వచ్చే వరకూ బస్సును అక్కడే నిలిపివేశాడు. బస్సులో ప్రయాణికులు కూడా సహకరించారు. ఆమె బంధువులు రాగానే ఆమె బయల్దేరింది. ఆ తర్వాతే బస్సు బయల్దేరింది.
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి!
కేరళలో ఒక వింత ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటూ ఒక చిన్నారి ప్రమాదవశాత్తూ అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బిడ్డ బయటకు రాకపోవడంతో టెన్షన్ తో పేరెంట్స్ ఫైర్ అండ్ రెస్కూ ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాత్రను జాగ్రత్తగా కట్ చేసి బిడ్డను క్షేమంగా బయటకు తీసారు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్‌పై దాడి!
హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు, థియేటర్ మేనేజ్మెంట్కు మధ్య పెద్ద గొడవ జరిగింది. డార్లింగ్ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఒక సాంగ్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో థియేటర్ స్టాఫ్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన videos ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమార్ గంజ్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్‌పై టిఎంసి కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రాణభయంతో ఆయన పొలాల్లోకి పరుగులు తీసి అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన video ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!
అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఇది కోర్టు నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నోటిస్ లు జారీ చేసింది.

అప్పుడే పుట్టిన బిడ్డని చంపిన కన్న తల్లి!
కర్ణాటకలోని దేవనహళ్లిలో ఒక ఘోరం జరిగింది. ఒక ప్రముఖ సంస్థలో పనిచేసే 19 ఏళ్ల యువతి, ఆఫీస్ బాత్రూమ్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడంతో, ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి, పుట్టిన వెంటనే చిన్నారి గొంతు కోసి చంపేసింది. బాత్రూమ్లో మరో మహిళా రక్తం చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా?
షుగర్ ఉన్నవారు మామిడి పండును పూర్తిగా మానేయాల్సిన పనిలేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. రోజుకు 100-150 grams మించకుండా మితంగా తీసుకోవాలి. భోజనంతో కలిపి కాకుండా, భోజనానికి రెండు గంటల తర్వాత తినడం మంచిది. పండును నేరుగా ముక్కలుగా తింటేనే ఫైబర్ అందుతుంది, జ్యూస్‌లా తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. తినే ముందు రెండు గంటలు వాటర్ లో నానబెడితే హీట్ తగ్గుతుంది.
అంబులెన్స్‌ని OYO రూమ్‌లా వాడుతున్న యువత!
మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ ను తమ సొంత పనులకి వాడుకున్నారు. ఒక అంబులెన్స్‌లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉండగా స్థానికులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అంబులెన్స్‌ను ఇలా OYO రూమ్ లా మార్చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారంలో పెళ్లి.. ప్రియుడితో పారిపోతుండగా దొరికిపోయారు!
వారంలో పెళ్లి పెట్టుకుని, తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది ఒక యువతి. అయితే వీరిని గమనించిన ఆమె ఫాదర్, బ్రదర్ వారిని సమయానికి పట్టుకున్నారు. నడిరోడ్డుపైనే ఆమెని తన లవర్ ని తీవ్రంగా కొట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్: సమ్మర్ హాలిడేస్ షెడ్యూల్ వచ్చేసింది!
ఈ విద్యా సంవత్సరం నేటితో ముగియనుంది. రేపటి అంటే శుక్రవారం నుంచి June 11 వరకు స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. తిరిగి జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. కాలేజీలకు కూడా హాలిడేస్ షెడ్యూల్ చేశారు. ఇవాళ స్టూడెంట్స్‌కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. అలాగే కొత్త అడ్మిషన్ల కోసం బడి బాట ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలని అధికారులు సూచించారు.

రాబోయే 4 రోజులు జాగ్రత్త.. పెరగనున్న ఎండలు!
రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఎండలు భారీగా పెరగనున్నాయి. మామూలు కంటే టెంపరేచర్ మరో 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నా, మిగిలిన చోట్ల ఎండలు మండిపోతాయి. రాజధాని చెన్నైలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. ప్రజలు ఈ హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

TVK విజయ్ సెన్సేషనల్ లెటర్: ECకి అత్యవసర విజ్ఞప్తి!
తమిళనాడు ఎలక్షన్స్ సందర్భంగా TVK అధినేత విజయ్ ఎలక్షన్ కమిషన్‌కు ఒక ఎమర్జెన్సీ లెటర్ రాశారు. చెన్నై వంటి నగరాల నుండి సొంత ఊర్లకు వెళ్లి ఓటు వేయాలనుకునే వారికి బస్ లు సరిగ్గా లేవని ఆయన చెప్పారు. బస్సులు లేక వేలాది మంది ఓటర్లు బస్టాండ్లలోనే వెయిట్ చేస్తున్నారని, వారి కోసం వెంటనే Special Buses ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, అందరూ ఓటు వేసే ఛాన్స్ ఉండాలని పోలింగ్ టైమ్‌ను మరో 2 గంటలు పెంచాలని విజయ్ తన లేఖలో రిక్వెస్ట్ చేశారు.

మేకిన్ ఇండియా అద్భుతం.. పోర్టబుల్ వాటర్ పంప్ !!
సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే సరికొత్త పరికరాన్ని డీఆర్ డీవో తయారు చేసింది.దీనికి ఎలాంటి కరెంటు అవసరం లేదు. ఇది మాన్యువల్ ప్రెషర్ పంప్.. బ్యాటరీ, ఫిల్టర్ కూడా అవసరం లేదు. హ్యాండ్ పంపు కొట్టినప్పుడు సముద్రపు నీరు మెంబ్రేన్ ఫిల్టర్ల గుండా లోపలికి వెళ్లి, ఉప్పు, బాక్టీరియా , వైరస్ లను వడకట్టి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తుంది. గంటకు 4-5 లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఇది యుద్ధరంగంలో సైనికులకు, విపత్తులప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా డీఆర్డీవో స్వదేశీ టెక్నాలజీతో దీనిని తయారు చేసింది.

పెళ్లిలో కెవ్వుమనిపించిన వెడ్డింగ్ కేక్ !!
రాజస్థాన్ ఉదయ్ పూర్లో జరిగిన కాస్ట్లీ వెడ్డింగ్ లో ఓ వెడ్డింగ్ కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజస్థానీ ఆర్కిటెక్చర్ తో రూపొందిన ఓ మల్టీ స్టోరీడ్ కేక్ ను ఫ్రెంచ్ చెఫ్ బాస్టియన్ బ్లాంక్ టైలర్ తయారు చేశారు. దీని తయారీకి పట్టిన సమయం 3,500 గంటలు. సుమారు రూ. 56 కోట్ల బడ్జెట్‌తో జరిగిన ఈ వేడుకలో ఈ విలాసవంతమైన కేక్ మెయిన్ అట్రాక్షన్. కోటీశ్వరులు నేత్ర మంతెన, టెక్ ఎంటర్ ప్రిన్యుయర్ వంశీ గాదిరాజుల పెళ్లి వేడుకలో ఈ వండర్ చోటు చేసుకుంది.