Latest

పండ్లు, కూరగాయలు తింటే క్యాన్సర్ వస్తుందా?
Health· 24 Apr 2026

పండ్లు, కూరగాయలు తింటే క్యాన్సర్ వస్తుందా?

హెల్దీగా ఉండాలంటే రోజూ వెజిటేబుల్స్ , ఫ్రూట్స్ తినాలని అనుకుంటాం కదా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతున్నాయట! అయితే తప్పు వాటిది కాదు, వాటిని పండించడానికి, మోతాదుకు మించి వాడుతున్న పెస్టిసైడ్స్ దేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలోని కణాలు దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందట. ఇకపై మీరు కొనేటప్పుడు అవి ఆర్గానిక్ అవునో కాదో ఒక్కసారి చెక్ చేసుకోండి.

అణుదాడులు చెయ్యం : ట్రంప్
World· 24 Apr 2026

అణుదాడులు చెయ్యం : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సీరియస్ అల్టిమేటం జారీ చేశారు. "టైమ్ అయిపోతోంది.. జాగ్రత్త!" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అణు దాడుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అణు బాంబు వేసే ఆలోచనదేమీ లేదని వైట్ హౌస్ లో విలేకరులతో చెప్పారు. తమ డిమాండ్లకు ఇరాన్ తలొగ్గాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. అణు దాడులు చెయ్యబోమన్న ట్రంప్ ప్రకటన కాస్త ఊరటనిచ్చేది.

టాప్ సైంటిస్టుల మిస్టరీ డెత్స్.. వరల్డ్ పవర్స్ మధ్య ఏం జరుగుతోంది?
World· 24 Apr 2026

టాప్ సైంటిస్టుల మిస్టరీ డెత్స్.. వరల్డ్ పవర్స్ మధ్య ఏం జరుగుతోంది?

అమెరికా, చైనాల్లో టాప్ లెవల్ శాస్త్రవేత్తలు వరుసగా మాయమవ్వడం లేదంటే అనుమానాస్పదంగా చనిపోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రెండు మూడేళ్లలో AI, స్పేస్, న్యూక్లియర్ రంగాలకు చెందిన 20 మంది ఎక్స్‌పర్ట్స్ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మామూలు వాళ్లు కాదు.. ప్రపంచ గమనాన్ని మార్చే టెక్నాలజీపై వర్క్ చేస్తున్న వాళ్లు! ఒకరు కార్ క్రాష్‌లో, మరొకరు బిల్డింగ్ పైనుంచి పడి.. ఇలా వరసపెట్టి మరణిస్తున్నారు. దీని వెనుక ఏదైనా 'స్పై వార్' ఉందా అని గ్లోబల్ మీడియా కోడై కూస్తోంది.

మన నౌకని ఇరాన్ హైజాక్ చేసింది ఇలా.. ▶
World· 24 Apr 2026

మన నౌకని ఇరాన్ హైజాక్ చేసింది ఇలా..

దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న 'ఎపామినోండాస్' అనే భారీ కంటైనర్ నౌకను ఇరాన్ కమాండోలు హైజాక్ చేశారు. ముసుగులు ధరించి, గన్‌లతో స్పీడ్ బోట్లపై వెంబడించి మరీ ఓడను చుట్టుముట్టారు హార్మూజ్ జలసంధి మీదుగా వస్తున్న మన నౌక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఎలా మన ఓడను హైజాక్ చేసిందో ఈ వీడియోలో మీరే చూడండి.

ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 8 వేల మందికి ఉద్వాసన
World· 24 Apr 2026

ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 8 వేల మందికి ఉద్వాసన

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో మళ్ళీ లేఆఫ్స్ మొదలయ్యాయి. ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను (సుమారు 8,000 మంది) తొలగిస్తున్నట్లు ఇంటర్నల్ మెమోలు అందాయి. మే 20 నుంచి ఈ కోతలు మొదలవుతాయి. ఏఐ డెవలప్ మెంట్ కోసం భారీగా నిధులు మళ్లిస్తూ ఉండడం వల్ల టెక్కీలపై ఎఫెక్ట్ పడింది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ మృతి
Local· 24 Apr 2026

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీడ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మరణించారు. 80శాతానికి పైగా గాయాలతో హైదరాబాద్ అపోలో DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఉండడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో పని చేస్తున్న శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినా ఫలితం లేకుండా పోయింది.

 మైన్లు అమర్చే బోట్లను కాల్చేయండి ః ట్రంప్
World· 23 Apr 2026

మైన్లు అమర్చే బోట్లను కాల్చేయండి ః ట్రంప్

హర్ముజ్ లో మైన్లు అమర్చే ఏ చిన్న నౌకలైనా,బోట్లనైనా వెంటనే కాల్చి పారేయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. అమెరికా మైన్ స్వీపర్లుప్రస్తుతం జల సంధిని క్లియర్ చేస్తున్నాయని, ఇరాన్ దళాలేవైనా జలసంధిలో మైన్లు పెడుతున్నట్లు అనిపిస్తే ఆ నౌకలని నిర్దాక్షిణ్యంగా కాల్చి యాలని ఆదేశించారు.

రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్
Crime· 23 Apr 2026

రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో షాకింగ్ ఇన్నిడెంట్ బయట పడింది. బి.ఏ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ ఇద్దరు ఎగ్జామ్ హాల్ లో బాహా టంగా సెల్ ఫోన్స్ పెట్టుకుని కాపీ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాపీలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతుంటే వీరు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అధికారులకు రూ.300 లంచమిచ్చి ఫోన్లు దగ్గరుంచుకుని గూగుల్ లో ఆన్సర్స్ వెతుకుతూ ఎగ్జామ్ రాశారు.

 ఆలియా భట్ కు ఇళ్లు అమ్మేసిన అనుపమ్ ఖేర్ !
Entertainment· 23 Apr 2026

ఆలియా భట్ కు ఇళ్లు అమ్మేసిన అనుపమ్ ఖేర్ !

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సొంత ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారిపోయారు. తనకు సింపుల్ గా జీవించడం ఇష్టమని అందుకే ఆ నిర్ణయం తీసుకున్ననన్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఎంపీ కావడంతో ఆమె చండీగఢ్ లో ఉంటున్నారు. ఆస్తుల సంపాదన తన ధ్యేయం కాదని, నటుడిగా రాణించడమేనని ఖేర్ అంతకుముందు అన్నారు. అనుపమ్ స్థిరాస్థులైన రెండు ఇళ్లను అనుపమ్ అమ్మేసిన రూ.9 కోట్లు విలువ కలిగిన రెండు ప్రాపర్టీలను ప్రముఖ నటి అలియా భట్2015లో కొన్నారు.

తూచ్...  భారత్ గొప్పదేశం, మోడీ నాకు ఫ్రెండ్ ః ట్రంప్
World· 23 Apr 2026

తూచ్... భారత్ గొప్పదేశం, మోడీ నాకు ఫ్రెండ్ ః ట్రంప్

భారత, చైనాలను నరక కూపాలని కామెంట్ చేసి 24 గంటలు గడవ కుండానే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. భారత్ చాలా నమ్మకమైన మిత్రదేశమని, మాట సర్దుకున్నారు. భారత్ ఒక గొప్ప దేశమని,ఆ దేశాధినేతతో తనకు వ్యక్తిగత స్నేహం ఉందనీ అన్నారు.అంతకుముందు భారత, చైనాలను నరక కూపాలంటూ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ సోషల్ మీడియాలో స్పందించారు. అదే మెసేజ్ ను ట్రంప్ తన ఖాతాలో రీ పోస్ట్ చేశారు. భారత , చైనా దేశాల ప్రజలు 9వ నెలలో డెలివరీకి అమెరికా వస్తారని, ఆ వెంటనే అమెరికా సిటిజన్లుగా మారతారని సావేజ్ తన పోస్ట్ లో కామెంట్ చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.కేంద్రం
Local· 23 Apr 2026

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం.కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరగనున్నాయంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ, సామాన్యులపై ఇంధన భారాన్ని మోపే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. ఇంధన ధరల పెంపుపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 'పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన గానీ, ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర లేదు. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు' అని అధికారికంగా వెల్లడించింది.

హైదరాబాద్ లో భారీ నకిలీ టీ పొడి దందా  !
Politics· 23 Apr 2026

హైదరాబాద్ లో భారీ నకిలీ టీ పొడి దందా !

హైదరాబాద్ మరో భారీ కల్తీ దందా బట్టబయలయ్యింది. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ కి సంబంధించిన పదార్థాలను అధికారులు గుర్తించారు.కొందరు షాప్ ఓనర్స్ వాడేసిన టీ పొడికే మళ్లీ రంగులు వేసి అమ్ముతున్నారు. H- FAST పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ లో ఇది బయట పడింది. ఈ దందాలో 10 మంది నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. H- FAST ఏర్పడిన తర్వాత భారీగా కల్తీ దందాలను గుర్తించగలుగుతున్నారు. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు.

మీదే అసలైన నరకం ః ట్రంప్ కు ఇరాన్ కౌంటర్
World· 23 Apr 2026

మీదే అసలైన నరకం ః ట్రంప్ కు ఇరాన్ కౌంటర్

భారత్, చైనా తదితర దేశాలను నరకకూపాలుగా వర్ణిస్తూ రేడియో హోస్ట్ మైకేల్ సావెజ్ సోషల్ మీడియా పోస్టును అధ్యక్షుడు ట్రంప్ రీ పోస్ట్ చేయడంపై ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత, చైనా దేశాలు అద్భుతమైన నాగరికతలకు పెట్టింది పేరని, వేల ఏళ్ల చరిత్రను కలిగి చిరకాలం విస్తరించి ఉన్నాయని హైదరాబాద్ లోని ఇరాన్ ఎంబసీ కౌంటర్ ఇచ్చింది.బలమైన నాగరికతకు ఈ రెండు దేశాలు కేంద్రాలనీ, ఇరాన్ నాగరికతను అంతం చేస్తానన్న ట్రంప్ తీరే అసలైన నరకమని ఇరాన్ కామెంట్ చేసింది.

హర్ముజ్ లో డేటా కేబుల్స్ కి ముప్పు !
World· 23 Apr 2026

హర్ముజ్ లో డేటా కేబుల్స్ కి ముప్పు !

సీజ్ ఫైర్ ప్రకటించినా అమెరికా హర్ముజ్ ను దిగ్బంధించడంపై ఇరాన్ మండి పడుతోంది. ఈ సీన్ ఇలాగే కొనసాగితే సముద్రం లోపల్ ఉండే అండర్ గ్రౌండ్ సీ కేబుల్స్ తెగితే ఆ ప్రభావం పర్షియన్ గల్ఫ్ అంతటా పడుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఆ డేటా కేబుల్స్ కి ఉద్దేశపూర్వకంగా గానీ, ఏదైనా ఒత్తిడి వల్ల కానీ హాని కలిగితే పెను ముప్పే ఏర్పడుతుందని అంది. బ్యాకింగ్, క్లౌడ్ సర్వీస్ లాంటి కీలక కేబుళ్లన్నీ అక్కడ కుప్పలా ఉండటం వల్ల ప్రమాదం జరిగితే నష్టం భారీ స్థాయిలో ఉంటుంది.

ఉస్మానియా దవఖానలో తాగు నీటి కొరత !!
Local· 23 Apr 2026

ఉస్మానియా దవఖానలో తాగు నీటి కొరత !!

ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో తాను నీరు లేక రోగులు నానా అగాట్లు పడుతున్నారు. కనీసం వాష్ రూమ్స్ లోసైతం నీటి సౌకర్యం లేక నానా అవస్థలూ పడుతున్నారు.రోజుకు వేల సంఖ్యలో పేషెంట్స్ వచ్చే ఆస్పత్రిలో తాగు నీరు లేకపోవడం మెట్రో వాటర్ బోర్డు వైఫల్యమేనని రోగులు ఆరోపిస్తున్నారు. అధికార్ల నిర్లక్ష్యం వల్ల నిరపరాధ రోగులకు శిక్ష పడుతోందని.. అధికారుల వైఫల్యాన్ని చక్క దిద్దాలని పేషెంట్స్ కోరుతున్నారు.

 తమిళనాడులో 70 శాతం పోలింగ్..బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు !
Politics· 23 Apr 2026

తమిళనాడులో 70 శాతం పోలింగ్..బెంగాల్ లో స్వల్ప ఘర్షణలు !

ఎన్నికలు ఎదుర్కొంటున్న తమిళనాడు, బెంగాల్ లో ఓటర్లు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు.. ఉదయం ఏడు గంటలకే రెండు చోట్లా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. బెంగాల్ లోని నందిగ్రామ్ లో బీజేపి కార్యకర్తలు పోలింగ్ బూత్ లలోకి చొరబడటంతో ఘర్షణ రేగిందని టీఎంసీ ఆరోపించింది. మే 4వ తేదీన బెంగాల్ లో తృణమూల్ పాలనకు చెల్లు చీటి పడుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బెంగాల్ లో చెదురు మదురు ఘర్షణలతో పోలింగ్ కొనసాగుతోంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా పోలింగ్ జరుగుతోంది.

పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు !!▶
Local· 23 Apr 2026

పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు !!

జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుని పోలీస్ బందోబస్తు నడుమ ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలు నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యంని స్థానిక ఆర్టీసీ కార్మికులు బతిమాలుకున్నారు.తమ సమ్మెను అడ్డుకోవద్దని, బస్సులు నడపవద్దని పోలీసుల కాళ్లమీద పడి ప్రాధేయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో డిపో నుండి ఒక్కో బస్ బందోబస్తుకు ఒక్కో కానిస్టేబుల్‌ను పెట్టి పోలీసులు బస్సులను నడిపిస్తున్నారు.

కూతురు వెడ్డింగ్ కార్డ్ లో సైబర్ జాగ్రత్తలు!
Technology· 23 Apr 2026

కూతురు వెడ్డింగ్ కార్డ్ లో సైబర్ జాగ్రత్తలు!

ఖమ్మంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తన కూతురు వెడ్డింగ్ కార్డ్ ను సమాజ సేవకు వేదికగా మార్చుకున్నారు. వెడ్డింగ్ కార్డ్ లో ఒక పేజీని ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పైఅవగాహన కల్పించేందుకు కేటాయించారు. ఫ్రీ గిఫ్ట్స్ కి ఆశపడొద్దు, తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దు అంటూ పెళ్లికి వచ్చే అతిథులకు ఉపయోగపడేలా ముఖ్యమైన జాగ్రత్తలు ప్రింట్ చేయించాడు. ఇలాంటి కొత్త ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒంటరి యువతికి కేరళ ఆర్టీసీ బస్సు రక్షణ !
Local· 23 Apr 2026

ఒంటరి యువతికి కేరళ ఆర్టీసీ బస్సు రక్షణ !

కేరళలోని అలప్పుజి జిల్లాలో మానవత్వం వెల్లి విరిసింది.కోజి కోడ్ నుంచి పత్తనం తిట్ట వెళుతున్న కేఎస్ ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12 గంటల సమయంలోఎస్ ఎల్ ఆర్ పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగగా ఓ మహిళ బస్సు దిగింది. కానీ చుట్టుపక్కల తనను రిసీవ్ చేసుకునేవారు లేకపోవడంతో అలాగే నిలబడింది. బస్సు డ్రైవర్ పెద్ద మనసు చేసుకుని ఆమె సంబంధికులు వచ్చే వరకూ బస్సును అక్కడే నిలిపివేశాడు. బస్సులో ప్రయాణికులు కూడా సహకరించారు. ఆమె బంధువులు రాగానే ఆమె బయల్దేరింది. ఆ తర్వాతే బస్సు బయల్దేరింది.

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి!▶
Technology· 23 Apr 2026

వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి!

కేరళలో ఒక వింత ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటూ ఒక చిన్నారి ప్రమాదవశాత్తూ అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బిడ్డ బయటకు రాకపోవడంతో టెన్షన్ తో పేరెంట్స్ ఫైర్ అండ్ రెస్కూ ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాత్రను జాగ్రత్తగా కట్ చేసి బిడ్డను క్షేమంగా బయటకు తీసారు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌పై దాడి!▶
Local· 23 Apr 2026

ప్రభాస్ ఫ్యాన్స్‌పై దాడి!

హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు, థియేటర్ మేనేజ్‌మెంట్‌కు మధ్య పెద్ద గొడవ జరిగింది. డార్లింగ్ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఒక సాంగ్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో థియేటర్ స్టాఫ్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన videos ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.