ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 8 వేల మందికి ఉద్వాసన

ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో మళ్ళీ లేఆఫ్స్ మొదలయ్యాయి. ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను (సుమారు 8,000 మంది) తొలగిస్తున్నట్లు ఇంటర్నల్ మెమోలు అందాయి. మే 20 నుంచి ఈ కోతలు మొదలవుతాయి. ఏఐ డెవలప్ మెంట్ కోసం భారీగా నిధులు మళ్లిస్తూ ఉండడం వల్ల టెక్కీలపై ఎఫెక్ట్ పడింది.
