Latest

ఆర్టీసీపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు... అయినా సమ్మె ఆగదు...
తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీసమ్మె మొదలు అవుతుందని ఉద్యోగులు తెలిపారు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇంకా చేయకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం, వారి ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వం స్పందించి నలుగురు సభ్యుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఉద్యోగులు అంటున్నారు.

కర్నూలులో భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ !!
ఏపీలోని కర్నూలులో భారీ సోలర్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.2,400 ఎకరాల విస్తీర్ణంలో రెండు భాగాలుగా ఈ ప్లాంట్ ను ఆపరేట్ చేస్తారు. మొత్తం 600 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంట్ ను చెరి మూడు వందల యూనిట్ల చొప్పున రెండు యూనిట్లుగా పనిచేయిస్తారు.12 లక్షల TOPCon బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ తో ప్లాంట్ పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ 25 ఏళ్లు కొనసాగుతుంది. మొత్తం 11 లక్షల టన్నుల కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. గ్రీన్ ఎనర్జీకి దోహద పడుతుంది.

చరణ్ ఫ్యాన్స్‌కు ‘పెద్ది’ షూటింగ్ అప్డేట్ ..
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ మరో ఆరు రోజుల్లో పూర్తి కానుంది అని డైరెక్టర్ మూవీ సెట్లో తనతో కలిసి చరణ్ తీసిన సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూ మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కుక్కల దాడులపై కలెక్టర్లకు నోటీసులు!
వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో జరిగిన దాడులపై Su Motoగా విచారణ చేపట్టింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై నివేదిక కోరింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిందని పేర్కొంటూ, జూన్ 2 లోపు పూర్తి వివరాలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.

ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని !!
కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం మొదలైంది. జొన్నగిరిలో598 హెక్టార్లలో 13 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. 2027 నాటికి కనీసం 600 కిలోల బంగారాన్ని తవ్వి తీయాలని నిర్ణయించారు. జియోమైసూర్ సర్వీసెస్ సంస్థ ఈ తవ్వకాలు చేపడుతుంది. ప్రాజెక్టు కాలం 15 ఏళ్లు. యేటా వెయ్యి కిలోల వార్షిక ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ గనులన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. తొలిసారిగా ఈ గని నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు.

మహిళా బిల్లుపై ఎంపి పప్పు యాదవ్ అనుచిత కామెంట్లు !!
ఆడవాళ్ల పొలిటికల్ కెరీర్ మగవాడి గదులనుంచే మొదలవు తాయని బీహార్ ఎంపీ పప్పు యాదవ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపధ్యంలో పప్పు యాదవ్ ఈ కామెంట్లు చేశారు. మహిళలు రాజకీయంగా ఎదగాలంటే కొంతటైమ్ మగవారితో గడపక తప్పదని, రాజకీయాలు అంతలా కలుషితం అయిపోయాయని అన్నారు.పప్పు యాదవ్ కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతుం డటంతో బీజేపి ఇది కాంగ్రెస్ మైండ్ సెట్ అంటూ విమర్శలు చేసింది.
విజయ్ ఎమోషనల్ రిక్వెస్ట్..
TVK పార్టీ అధినేత విజయ్ ఓటర్లకు ఒక ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. ప్రజలు ఎక్కడున్నా సరే, తమ ప్రాంతానికి వచ్చి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. తన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఓటు కీలకమని ఆయన పేర్కొన్నారు. విజయ్ చేసిన ఈ ఎమోషనల్ అప్పీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

కేదార్ నాథ్ లో మొబైల్ ఫోన్ల నిషేధం...
కేదార్ నాధ్ ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించారు. కొండపై వీడియోలు, ఫోటో షూట్స్, రీల్స్ ఇక ఎంత మాత్రం అనుమతించబోమని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఆలయ పరిసరాల్లోకి వచ్చే ముందే తమ మొబైల్స్ ను బయటే డిపాజిట్ చేయాలని కోరింది. కొండపై మొబైల్స్ అనుమతి వల్ల దర్శనాలకు భంగం కలుగుతోందని, ఆధ్యాత్మికత తగ్గుతోందని ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈనిర్ణయాన్ని ఇంటర్నెట్ యూజర్స్ సమర్ధించారు.
TVK పార్టీ నేత విజయ్: అవును, నేను ఆక్టర్ నే
తనను ఆక్టర్ అని విమర్శిస్తున్న వారికి TVK పార్టీ నేత విజయ్ గట్టి సమాధానం ఇచ్చారు. అవును, నేను ఆక్టర్ నే. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పుడూ నటించలేదు అని స్పష్టం చేశారు. పాలిటిక్స్‌లో అసలైన డ్రామాలు చేస్తోంది తన విమర్శకులేనంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని, రాజకీయాల్లో నటనకు తావులేదని విజయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చైనానుంచి ఇరాన్ కు వెపన్ కెమికల్స్ రవాణా?
అమెరికా ఆంక్షల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో తమ నౌకాదళం స్వాధీనం చేసుకున్న ఇరాన్ ఓడ 'టౌస్కా', చైనా నుండి క్షిపణి తయారీకి అవసరమైన రసాయనాలను తరలిస్తోందని నిక్కీ హేలీ ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వానికి చైనా మద్దతు ఇస్తోందని, ఈ వాస్తవాన్ని విస్మరించలేమని ఆమె హెచ్చరించారు. మరోవైపు, అమెరికా చర్యను 'సాయుధ సముద్రపు దొంగతనం'గా అభివర్ణించిన ఇరాన్, దిగ్బంధనం ఎత్తివేసే వరకు శాంతి చర్చలకు రాబోమని స్పష్టం చేసింది.

మౌత్‌వాష్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే!
మౌత్‌వాష్‌ను అధికంగా వాడటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మన నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియాను ఇవి నశింపజేయడం వల్ల రక్తపోటు పెరుగుతుందట. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఏడాదికి ఒకసారి డెంటల్ చెక్అప్ చేయించుకోవడం మంచిది. వైద్యుల సలహా లేకుండా అతిగా మౌత్‌వాష్ వాడటం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క రాత్రిలో 1700 మంది ప్రాణం తీసిన సరస్సు
ఆఫ్రికాలో ఓ సరస్సు ఒక్క రాత్రిలో 1700 మందిని హత్య చేసిందని ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. వాయవ్య కామెరూన్ లో నియోస్ అనే సరస్సు రాత్రికి రాత్రి మూడు లక్షల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ రిలీజ్ చేయడంతో సమీపంలో ప్రజలు, జంతుజాలం అంతా ప్రాణాలొదిలారని తెలిపింది. ఆ సరస్సులో రాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయని, చూస్తుండగానే పెద్ద నురగ అంతెత్తున లేచి ఆ ప్రాంతాన్ని కమ్మేసిందని. జనం ఊపిరాడక మరణించారని ఆ వైరల్ పోస్ట్ తెలిపింది.1986 ఆగస్టు 21న ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారులు!
లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడం డోర్లు తెరుచుకోకపోవడంతో ఇద్దరు చిన్నపిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక యువతి ఏమాత్రం కంగారు పడకుండా, అద్భుతమైన ధైర్యంతో ఆ పిల్లలను కాపాడింది. ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ Rescue Video చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం.

మోడీ ఓ టెర్రరిస్టు... తూచ్ నేనలా అనలేదు ఃఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని కామెంట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్దుకుని ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తాను ప్రధానిని టెర్రరిస్టు అనలేదని అన్నారు. అయితే బిజెపి అప్పటికే కాంగ్రెస్ కామెంట్లను ఖండించింది.కాంగ్రెస్ అర్బన్ నక్సల్ పార్టీ అని విమర్శించింది. తమిళనాట ఎన్నికల్లో అన్నా డిఎంకె పార్టీ బీజేపితో జత కట్టడాన్ని ఖర్గే ప్రశ్నించారు. అన్నాదురై ఫోటో పెట్టుకుని మోడీతో ఎలా జతకడతారు. ఆయనో పెద్ద టెర్రరిస్టు అని కామెంట్ చేశారు ఖర్గే.
వైరల్ అవుతున్న 'ద లాస్ట్ బెల్' వీడియో
కేరళలోని ఒక స్కూల్లో గత 38 ఏళ్లుగా గంట మోగిస్తున్న దాస్ అంకుల్, తన ఉద్యోగ విరమణ రోజున చివరిసారిగా స్కూల్ బెల్ మోగించారు. దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు సమయాన్ని గుర్తు చేసిన ఆయన, భావోద్వేగంతో ఆ గంటను మోగించిన తీరు అందరినీ కదిలించింది. ఈ Emotional Video ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఒక సాధారణ పనిలో ఉన్న అసాధారణ అంకితభావానికి ఇది నిదర్శనం.
వేస్ట్ నుంచి బెస్ట్: ప్లాస్టిక్ బాటిల్స్‌తో కలర్‌ఫుల్ టైల్స్!
మనం సాధారణంగా వాడి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను విదేశాల్లో అద్భుతంగా రీసైకిల్ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించి, వాటితో దృఢమైన మరియు అందమైన ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వస్తువులు తయారవుతున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి ఇన్నొవేటివ్ ఆలోచనలు వస్తే ప్లాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
ఉరి తాడుతో నిరసన!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లాలో తమ నివాస ప్రాంతాల నుండి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. న్యాయం కోసం నీటిలో నిలబడి, చితిపై పడుకుని వారు నిరసనలు చూస్తున్నారు. తమ భూములు, అడవిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా ప్రభుత్వం, మీడియా మరియు న్యాయవ్యవస్థ స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. వారి గోడు వినేవారు లేక గిరిజన ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది.
ఎడారిలో మానవత్వం: మూగజీవాల దాహం తీరుస్తున్న చిన్నారులు!
50 డిగ్రీల ఎండలో, మండుతున్న ఎడారి ఇసుకలో వన్యప్రాణుల కోసం ఒక వృద్ధుడు, చిన్నపిల్లలు కలిసి నీటిని ఏర్పాటు చేస్తున్నారు. అప్పడాలు కాలిపోయేంత వేడిలోనూ వారు చూపిస్తున్న ఈ Kindness నెటిజన్ల మనసు గెలుచుకున్నరు. ఆ వృద్ధుడు పిల్లలకు నేర్పిన విలువలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
జాబ్ పోయాక జ్ఞానోదయం..
జాబ్ కోల్పోయాక ఒక యువతి పెట్టిన వీడియొ ప్రెసెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. టార్గెట్స్, డెడ్‌లైన్స్ అంటూ పనిలోనే మునిగిపోయి తన పర్సనల్ లైఫ్‌ను, హెల్త్ ని పక్కన పెట్టానని ఆమె వాపోయింది. జాబ్ పోయాక గానీ తనకు జీవితం అర్థం కాలేదని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో చెబుతూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఆదర్శ వివాహం: 0% ఖర్చు.. 100% సేవ!
ఒడిశాకు చెందిన శుభశ్రీ, కర్ణాటకకు చెందిన ప్రదీప్ అనే శాస్త్రవేత్తల జంట తమ పెళ్లిని విభిన్నంగా చేసుకున్నారు. ఖరీదైన హంగూలు లేకుండా రక్తదానం, అనాథలకు వస్త్రదానం మరియు మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలతో మూడు రోజుల పాటు ఈ వెడ్డింగ్ నిర్వహించారు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ మరియు మాంసాహారాన్ని పూర్తిగా దూరం పెట్టి సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు.

పెళ్లైన ఏడాదికే నవవధువు ఆత్మహత్య..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే 24 ఏళ్ల షాలిని అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేర్వేరు కులాలకు చెందిన పొన్నర్, షాలిని గతేడాది వివాహం చేసుకున్నారు. భర్త ఉద్యోగం కారణంగా బయట ఉండగా, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆమె ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. పెళ్లైన వన్ ఇయర్ లోనే ఈ ఘటన జరగడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.