Latest

వేస్ట్ నుంచి బెస్ట్: ప్లాస్టిక్ బాటిల్స్‌తో కలర్‌ఫుల్ టైల్స్!▶
Technology· 21 Apr 2026

వేస్ట్ నుంచి బెస్ట్: ప్లాస్టిక్ బాటిల్స్‌తో కలర్‌ఫుల్ టైల్స్!

మనం సాధారణంగా వాడి పారేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను విదేశాల్లో అద్భుతంగా రీసైకిల్ చేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను కరిగించి, వాటితో దృఢమైన మరియు అందమైన ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో నాణ్యమైన వస్తువులు తయారవుతున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి ఇన్నొవేటివ్ ఆలోచనలు వస్తే ప్లాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

ఉరి తాడుతో నిరసన!▶
Politics· 21 Apr 2026

ఉరి తాడుతో నిరసన!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో తమ నివాస ప్రాంతాల నుండి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. న్యాయం కోసం నీటిలో నిలబడి, చితిపై పడుకుని వారు నిరసనలు చూస్తున్నారు. తమ భూములు, అడవిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నా ప్రభుత్వం, మీడియా మరియు న్యాయవ్యవస్థ స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. వారి గోడు వినేవారు లేక గిరిజన ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది.

ఎడారిలో మానవత్వం: మూగజీవాల దాహం తీరుస్తున్న చిన్నారులు!▶
Motivational· 21 Apr 2026

ఎడారిలో మానవత్వం: మూగజీవాల దాహం తీరుస్తున్న చిన్నారులు!

50 డిగ్రీల ఎండలో, మండుతున్న ఎడారి ఇసుకలో వన్యప్రాణుల కోసం ఒక వృద్ధుడు, చిన్నపిల్లలు కలిసి నీటిని ఏర్పాటు చేస్తున్నారు. అప్పడాలు కాలిపోయేంత వేడిలోనూ వారు చూపిస్తున్న ఈ Kindness నెటిజన్ల మనసు గెలుచుకున్నరు. ఆ వృద్ధుడు పిల్లలకు నేర్పిన విలువలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

జాబ్ పోయాక జ్ఞానోదయం..▶
Motivational· 21 Apr 2026

జాబ్ పోయాక జ్ఞానోదయం..

జాబ్ కోల్పోయాక ఒక యువతి పెట్టిన వీడియొ ప్రెసెంట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. టార్గెట్స్, డెడ్‌లైన్స్ అంటూ పనిలోనే మునిగిపోయి తన పర్సనల్ లైఫ్‌ను, హెల్త్ ని పక్కన పెట్టానని ఆమె వాపోయింది. జాబ్ పోయాక గానీ తనకు జీవితం అర్థం కాలేదని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో చెబుతూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

ఆదర్శ వివాహం: 0% ఖర్చు.. 100% సేవ!
Motivational· 21 Apr 2026

ఆదర్శ వివాహం: 0% ఖర్చు.. 100% సేవ!

ఒడిశాకు చెందిన శుభశ్రీ, కర్ణాటకకు చెందిన ప్రదీప్ అనే శాస్త్రవేత్తల జంట తమ పెళ్లిని విభిన్నంగా చేసుకున్నారు. ఖరీదైన హంగూలు లేకుండా రక్తదానం, అనాథలకు వస్త్రదానం మరియు మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలతో మూడు రోజుల పాటు ఈ వెడ్డింగ్ నిర్వహించారు. పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ, ప్లాస్టిక్ మరియు మాంసాహారాన్ని పూర్తిగా దూరం పెట్టి సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇచ్చారు.

పెళ్లైన ఏడాదికే నవవధువు ఆత్మహత్య..
Crime· 21 Apr 2026

పెళ్లైన ఏడాదికే నవవధువు ఆత్మహత్య..

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే 24 ఏళ్ల షాలిని అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వేర్వేరు కులాలకు చెందిన పొన్నర్, షాలిని గతేడాది వివాహం చేసుకున్నారు. భర్త ఉద్యోగం కారణంగా బయట ఉండగా, ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆమె ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. పెళ్లైన వన్ ఇయర్ లోనే ఈ ఘటన జరగడంతో మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.

వైరల్ మెసేజ్: సంపాదన కోసం కాదు, బ్రతకడం కోసం..▶
Motivational· 21 Apr 2026

వైరల్ మెసేజ్: సంపాదన కోసం కాదు, బ్రతకడం కోసం..

రోడ్ల పక్కన వస్తువులు అమ్ముకునే వృద్ధులు వారు సంపాదించడానికి కాదు, కేవలం తమ కడుపు నింపుకోవడానికే జీవితం చివరి దశలోనూ కష్టపడుతున్నారు. వారి సెల్ఫ్ రెస్పెక్ట్ ను గౌరవిస్తూ వారి దగ్గర ఏదో ఒకటి కొనండి, అలా వారికి హెల్ప్ చేయడం వల్ల వారి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ ఎమోషనల్ సందేశం ఇప్పుడు నెట్టింట అందరినీ ఆలోచింపజేస్తోంది.

స్టేజ్ మీద ఏడ్చేసిన రితేష్-జెనీలియా..▶
Motivational· 21 Apr 2026

స్టేజ్ మీద ఏడ్చేసిన రితేష్-జెనీలియా..

బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఒక అవార్డు ఫంక్షన్ లో ఎమోషనల్ అయ్యారు. తన సక్సెస్ కి కారణం తన భార్య జెనీలియానే అని రితేష్ స్టేజ్ మీద అందరి ముందు పొగిడారు. ఆ మాటలకు జెనీలియా ఎమోషనల్ అవ్వగా, ఆమెను చూసి రితేష్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్ చూసి నెటిజన్లు వీరు కదా రియల్ బెస్ట్ జోడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మ టిఫిన్ పెట్టడం మర్చిపోతే.. ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి!▶
Motivational· 21 Apr 2026

అమ్మ టిఫిన్ పెట్టడం మర్చిపోతే.. ఈ చిన్నారి ఏం చేసిందో చూడండి!

స్కూల్‌కు వెళ్లే తొందరలో ఒక చిన్నారికి వాళ్ల అమ్మ ఖాళీ టిఫిన్ బాక్స్ ఇచ్చి పంపింది. ఆకలి వేయడంతో దారిలో ఫుడ్ అమ్ముతున్న ఒక ఆమె దగ్గరకు వెళ్లి.. మా మమ్మీ బాక్స్‌లో అన్నం పెట్టడం మర్చిపోయింది అని అమాయకంగా చెప్పింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు ఇస్తూ భోజనం పెట్టమని ఆ పాప అడగడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆ చిన్నారి హానెస్టీ చూసి ఫుడ్ అమ్ముతున్న ధీది మనీ తీసుకోకుండా బాక్స్ లో అన్నం పెట్టి ఇచ్చింది.

సూరత్ నుంచి బెంగాల్ కు ప్రత్యేక రైలులో ఓటర్లు ▶
Politics· 21 Apr 2026

సూరత్ నుంచి బెంగాల్ కు ప్రత్యేక రైలులో ఓటర్లు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఎల్లుండి జరగనుంది. టీఎంసీతో చావో, రేవో తేల్చుకోవాలని చూస్తున్న బీజేపీ భారీగా ఓటర్లను తరలిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను బెంగాల్ కు తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ సూరత్ నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు ప్రత్యేక రైల్లో కోల్ కతాకి బయల్దేరారు.

చిన్నారికి పునర్జన్మ.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్!▶
Health· 21 Apr 2026

చిన్నారికి పునర్జన్మ.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్!

ప్రముఖ నటుడు Sonu Sood మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నీరా అనే చిన్నారికి జూపిటర్ హాస్పిటల్ డాక్టర్ల సాయంతో Surgery చేయించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో కష్టాల్లో ఉన్న ఆ చిన్నారి తల్లికి అండగా నిలిచి, ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూశారు. "ఎప్పుడూ ఆశ వదులుకోవద్దు" అంటూ ఈ సందర్భంగా సోనూ సూద్ ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది.

డాక్టర్ అవతారమెత్తిన సెక్యూరిటీ గార్డు!
Crime· 21 Apr 2026

డాక్టర్ అవతారమెత్తిన సెక్యూరిటీ గార్డు!

బిహార్‌లోని ఒక గోవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. రోడ్డు ఆక్సిడెంట్ లో ఇంజూర్ అయిన వ్యక్తికి డాక్టర్లు లేకపోవడంతో ఒక సెక్యూరిటీ గార్డ్ కుట్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. హాస్పిటల్లో స్టాఫ్ కొరత వల్లే ఇలా జరిగిందని అధికారులు చెబుతుండగా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

కుల మతాలపై పార్తీబన్ విక్టరీ
Local· 21 Apr 2026

కుల మతాలపై పార్తీబన్ విక్టరీ

తమిళ నటుడు, దర్శకుడు ఆర్.పార్తీబన్ ఒక కీలకమైన అంశంలో విజయం సాధించారు. నాకు ఏ కులం, ఏ మతం వద్దని నో కాస్ట్, నో రిలీజియన్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 29 లోపు ఆయనకు ఆ సర్టిఫికేట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. కులమతాలకు అతీతంగా ఉండాలనే తన నిర్ణయం సమాజంలో మార్పు తెస్తుందని పార్తీబన్ ఆశిస్తున్నారు. రియల్ లైఫ్ లో కూడా పార్దిబన్ కొత్త బాట వేస్తున్నారంటూ జెన్ జీ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అలియా భట్ ‘గ్లో’ వెనుక అసలు సీక్రెట్ ఇదే▶
Entertainment· 21 Apr 2026

అలియా భట్ ‘గ్లో’ వెనుక అసలు సీక్రెట్ ఇదే

బాలీవుడ్ క్వీన్ అలియా భట్ ఫిట్‌నెస్ లెవల్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్! 12 గంటల షూటింగ్ ఉన్నా సరే, జిమ్‌ను అస్సలు స్కిప్ చేయదని ఆమె ట్రైనర్ కరణ్ సాహ్నీ రీసెంట్‌గా రివీల్ చేశారు. "అల్ట్రా డిసిప్లిన్" పాటిస్తూ హెల్దీ డైట్ తీసుకోవడం, హాయిగా నిద్రపోవడం ఆమె అందానికి, ఎనర్జీకి కారణమట. ఒక పక్క బిజినెస్, మరోపక్క కూతురు రాహా బాధ్యతలు చూసుకుంటూనే బాడీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తోందీ సూపర్ మామ్. అలియా డెడికేషన్ చూసి నెటిజన్లు ‘నెక్స్ట్ లెవల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనకి కూడా కొంచెం ఆ డిసిప్లిన్ ఉంటే ఎంత బాగుండు!

ఐపిఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్: తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ..▶
Sports· 21 Apr 2026

ఐపిఎల్ చరిత్రలో ఫస్ట్ టైమ్: తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ముంబై తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారతీయ ప్లేయర్‌గా జయసూర్య రికార్డును బ్యాలెన్స్ చేశాడు. అంతేకాదు, ఐపిఎల్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో 5వ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తిలక్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై 99 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

అనంతపురం జిల్లాలో పోలీసుల అరాచకం..▶
Crime· 21 Apr 2026

అనంతపురం జిల్లాలో పోలీసుల అరాచకం..

అనంతపురం జిల్లా పెదవడుగూరులో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ఒక ఎస్సి దళిత యువకుడిని SI దారుణంగా కొట్టారు. రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికే పోలీసులు ఇలా అమాయకులను వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఇలా నేరుగా శిక్షలు విధిస్తే, ఇక కోర్టులు మరియు చట్టాలు ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

యాపిల్‌లో కొత్త శకం.. సీఈఓగా జాన్ టెర్నస్
Business· 21 Apr 2026

యాపిల్‌లో కొత్త శకం.. సీఈఓగా జాన్ టెర్నస్

టెక్‌ దిగ్గజం Apple కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 14 ఏళ్లుగా సీఈఓగా ఉన్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన వారసుడిగా హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ చీఫ్ జాన్ టెర్నస్‌ను ఎంపిక చేశారు. "ఇదే సరైన సమయం" అంటూ కుక్ పంపిన ఇంటర్నల్ మెమో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐఫోన్, ఐప్యాడ్ డిజైన్లలో టెర్నస్ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 1న ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. యాపిల్ ఫ్యూచర్ ఇక ఈ కొత్త బాస్ చేతుల్లో ఉంది. ఇక టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.

లిక్కర్ పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్ కు నో  రిలీఫ్
Politics· 21 Apr 2026

లిక్కర్ పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్ కు నో రిలీఫ్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తనను తప్పించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి కట్టుబడి ఒత్తిళ్లకు లొంగకుండా తీర్పునిస్తానని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఊహలు, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా న్యాయమూర్తులను మార్చలేమని, న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటమే తన ప్రాధాన్యతని ఆమె పేర్కొన్నారు. అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజం కాదని వ్యాఖ్యానించారు.

 ఖమేని డెడ్ బాడీకి ఏడు వారాలయినా అంత్యక్రియల్లేవ్ !!
World· 21 Apr 2026

ఖమేని డెడ్ బాడీకి ఏడు వారాలయినా అంత్యక్రియల్లేవ్ !!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించి ఏడు వారాలు గడిచినా, ఇంకా అంత్యక్రియలు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన మరణించగా, ప్రస్తుత ప్రభుత్వం భయం వల్లనే ఈ జాప్యం చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. భారీ ప్రార్థనలు నిర్వహిస్తే ఇజ్రాయెల్ వైమానిక దాడులు లేదా నిరసనలు వ్యక్తమవుతాయని ఇరాన్ భయపడుతోంది. అందుకే సురక్షిత ప్రాంతం కోసం వెతుకుతూ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేస్తోంది.

పాము విషంతో చైనా లేడి కోట్ల సంపాదన !!
World· 21 Apr 2026

పాము విషంతో చైనా లేడి కోట్ల సంపాదన !!

చైనాకు చెందిన క్విన్ అనే యువతి నగర జీవితాన్ని వదిలి, తన స్వగ్రామంలో సుమారు 60,000 విషసర్పాలను పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె వద్ద 50,000 ఫైవ్-స్టెప్ వైపర్లు, 10,000 నాగుపాములు ఉన్నాయి. వీటి విషం మరియు ఇతర భాగాలను వైద్య అవసరాల కోసం విక్రయిస్తూ ఏటా ₹1.35 కోట్ల ఆదాయం గడిస్తోంది. ప్రమాదకరమైన వ్యాపారమైనప్పటికీ, చిన్నప్పటి నుండి పాములతో గడపడం వల్ల తనకు భయం లేదని ఆమె చెబుతోంది.

రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ !!
Local· 20 Apr 2026

రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ !!

రాజస్థాన్ బలోత్రాలోని పచ్ పద్ర ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవానికి ముందే అగ్ని ప్రమాదానికి లోనయింది. అతి త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెన్ కావాల్సిన ఈ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దట్టమైన పొగలతో ఆప్రాంతం నిండిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.రాజస్థాన్ ప్రభుత్వం, హెచ్ పిసీఎల్ కంపెనీల భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పని చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రధాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.