Latest

కూతురు వెడ్డింగ్ కార్డ్ లో సైబర్ జాగ్రత్తలు!
ఖమ్మంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు తన కూతురు వెడ్డింగ్ కార్డ్ ను సమాజ సేవకు వేదికగా మార్చుకున్నారు. వెడ్డింగ్ కార్డ్ లో ఒక పేజీని ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పైఅవగాహన కల్పించేందుకు కేటాయించారు. ఫ్రీ గిఫ్ట్స్ కి ఆశపడొద్దు, తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దు అంటూ పెళ్లికి వచ్చే అతిథులకు ఉపయోగపడేలా ముఖ్యమైన జాగ్రత్తలు ప్రింట్ చేయించాడు. ఇలాంటి కొత్త ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒంటరి యువతికి కేరళ ఆర్టీసీ బస్సు రక్షణ !
కేరళలోని అలప్పుజి జిల్లాలో మానవత్వం వెల్లి విరిసింది.కోజి కోడ్ నుంచి పత్తనం తిట్ట వెళుతున్న కేఎస్ ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12 గంటల సమయంలోఎస్ ఎల్ ఆర్ పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగగా ఓ మహిళ బస్సు దిగింది. కానీ చుట్టుపక్కల తనను రిసీవ్ చేసుకునేవారు లేకపోవడంతో అలాగే నిలబడింది. బస్సు డ్రైవర్ పెద్ద మనసు చేసుకుని ఆమె సంబంధికులు వచ్చే వరకూ బస్సును అక్కడే నిలిపివేశాడు. బస్సులో ప్రయాణికులు కూడా సహకరించారు. ఆమె బంధువులు రాగానే ఆమె బయల్దేరింది. ఆ తర్వాతే బస్సు బయల్దేరింది.
వంట పాత్రలో ఇరుక్కుపోయిన చిన్నారి!
కేరళలో ఒక వింత ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటూ ఒక చిన్నారి ప్రమాదవశాత్తూ అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బిడ్డ బయటకు రాకపోవడంతో టెన్షన్ తో పేరెంట్స్ ఫైర్ అండ్ రెస్కూ ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాత్రను జాగ్రత్తగా కట్ చేసి బిడ్డను క్షేమంగా బయటకు తీసారు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ప్రభాస్ ఫ్యాన్స్‌పై దాడి!
హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు, థియేటర్ మేనేజ్మెంట్కు మధ్య పెద్ద గొడవ జరిగింది. డార్లింగ్ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఒక సాంగ్ విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో థియేటర్ స్టాఫ్ ఫ్యాన్స్‌పై దాడికి దిగారు. దీనికి సంబంధించిన videos ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమార్ గంజ్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్‌పై టిఎంసి కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రాణభయంతో ఆయన పొలాల్లోకి పరుగులు తీసి అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన video ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!
అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఇది కోర్టు నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నోటిస్ లు జారీ చేసింది.

అప్పుడే పుట్టిన బిడ్డని చంపిన కన్న తల్లి!
కర్ణాటకలోని దేవనహళ్లిలో ఒక ఘోరం జరిగింది. ఒక ప్రముఖ సంస్థలో పనిచేసే 19 ఏళ్ల యువతి, ఆఫీస్ బాత్రూమ్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడంతో, ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి, పుట్టిన వెంటనే చిన్నారి గొంతు కోసి చంపేసింది. బాత్రూమ్లో మరో మహిళా రక్తం చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

షుగర్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా?
షుగర్ ఉన్నవారు మామిడి పండును పూర్తిగా మానేయాల్సిన పనిలేదు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. రోజుకు 100-150 grams మించకుండా మితంగా తీసుకోవాలి. భోజనంతో కలిపి కాకుండా, భోజనానికి రెండు గంటల తర్వాత తినడం మంచిది. పండును నేరుగా ముక్కలుగా తింటేనే ఫైబర్ అందుతుంది, జ్యూస్‌లా తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. తినే ముందు రెండు గంటలు వాటర్ లో నానబెడితే హీట్ తగ్గుతుంది.
అంబులెన్స్‌ని OYO రూమ్‌లా వాడుతున్న యువత!
మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ ను తమ సొంత పనులకి వాడుకున్నారు. ఒక అంబులెన్స్‌లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు ఉండగా స్థానికులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అంబులెన్స్‌ను ఇలా OYO రూమ్ లా మార్చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారంలో పెళ్లి.. ప్రియుడితో పారిపోతుండగా దొరికిపోయారు!
వారంలో పెళ్లి పెట్టుకుని, తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది ఒక యువతి. అయితే వీరిని గమనించిన ఆమె ఫాదర్, బ్రదర్ వారిని సమయానికి పట్టుకున్నారు. నడిరోడ్డుపైనే ఆమెని తన లవర్ ని తీవ్రంగా కొట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్: సమ్మర్ హాలిడేస్ షెడ్యూల్ వచ్చేసింది!
ఈ విద్యా సంవత్సరం నేటితో ముగియనుంది. రేపటి అంటే శుక్రవారం నుంచి June 11 వరకు స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. తిరిగి జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. కాలేజీలకు కూడా హాలిడేస్ షెడ్యూల్ చేశారు. ఇవాళ స్టూడెంట్స్‌కు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. అలాగే కొత్త అడ్మిషన్ల కోసం బడి బాట ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలని అధికారులు సూచించారు.

రాబోయే 4 రోజులు జాగ్రత్త.. పెరగనున్న ఎండలు!
రాష్ట్రంలో వచ్చే 4 రోజులు ఎండలు భారీగా పెరగనున్నాయి. మామూలు కంటే టెంపరేచర్ మరో 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నా, మిగిలిన చోట్ల ఎండలు మండిపోతాయి. రాజధాని చెన్నైలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. ప్రజలు ఈ హీట్ వేవ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

TVK విజయ్ సెన్సేషనల్ లెటర్: ECకి అత్యవసర విజ్ఞప్తి!
తమిళనాడు ఎలక్షన్స్ సందర్భంగా TVK అధినేత విజయ్ ఎలక్షన్ కమిషన్‌కు ఒక ఎమర్జెన్సీ లెటర్ రాశారు. చెన్నై వంటి నగరాల నుండి సొంత ఊర్లకు వెళ్లి ఓటు వేయాలనుకునే వారికి బస్ లు సరిగ్గా లేవని ఆయన చెప్పారు. బస్సులు లేక వేలాది మంది ఓటర్లు బస్టాండ్లలోనే వెయిట్ చేస్తున్నారని, వారి కోసం వెంటనే Special Buses ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, అందరూ ఓటు వేసే ఛాన్స్ ఉండాలని పోలింగ్ టైమ్‌ను మరో 2 గంటలు పెంచాలని విజయ్ తన లేఖలో రిక్వెస్ట్ చేశారు.

మేకిన్ ఇండియా అద్భుతం.. పోర్టబుల్ వాటర్ పంప్ !!
సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే సరికొత్త పరికరాన్ని డీఆర్ డీవో తయారు చేసింది.దీనికి ఎలాంటి కరెంటు అవసరం లేదు. ఇది మాన్యువల్ ప్రెషర్ పంప్.. బ్యాటరీ, ఫిల్టర్ కూడా అవసరం లేదు. హ్యాండ్ పంపు కొట్టినప్పుడు సముద్రపు నీరు మెంబ్రేన్ ఫిల్టర్ల గుండా లోపలికి వెళ్లి, ఉప్పు, బాక్టీరియా , వైరస్ లను వడకట్టి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తుంది. గంటకు 4-5 లీటర్ల నీరు శుద్ధి చేస్తుంది. ఇది యుద్ధరంగంలో సైనికులకు, విపత్తులప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా డీఆర్డీవో స్వదేశీ టెక్నాలజీతో దీనిని తయారు చేసింది.

పెళ్లిలో కెవ్వుమనిపించిన వెడ్డింగ్ కేక్ !!
రాజస్థాన్ ఉదయ్ పూర్లో జరిగిన కాస్ట్లీ వెడ్డింగ్ లో ఓ వెడ్డింగ్ కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజస్థానీ ఆర్కిటెక్చర్ తో రూపొందిన ఓ మల్టీ స్టోరీడ్ కేక్ ను ఫ్రెంచ్ చెఫ్ బాస్టియన్ బ్లాంక్ టైలర్ తయారు చేశారు. దీని తయారీకి పట్టిన సమయం 3,500 గంటలు. సుమారు రూ. 56 కోట్ల బడ్జెట్‌తో జరిగిన ఈ వేడుకలో ఈ విలాసవంతమైన కేక్ మెయిన్ అట్రాక్షన్. కోటీశ్వరులు నేత్ర మంతెన, టెక్ ఎంటర్ ప్రిన్యుయర్ వంశీ గాదిరాజుల పెళ్లి వేడుకలో ఈ వండర్ చోటు చేసుకుంది.

తమిళనాడు, బెంగాల్ లలో నేడే పోలింగ్
ఇవాళ తమిళనాడు, బెంగాల్ లలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 234 నియోజక వర్గాలలో 4,023 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. దాదాపు 5.73 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఇక బెంగాల్ లో తొలివిడత పోలింగ్ జరుగుతోంది.16 జిల్లాల్లో 156 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బరిలో 1,478 మంది అభ్యర్ధులుండగా , 8 వేలకు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇప్పటికే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ముంచుకొస్తున్న ఏటీఎఫ్ కొరత.. ఇక నో ఫ్లైట్ సర్వీస్..
ఇరాన్, అమెరికా మధ్య వార్ రవాణా విమాన సర్వీసులపై కూడా పడుతోంది. హర్ముజ్ జలసంధి దగ్గర సీన్ ఇలా కొన్నాళ్లు కొనసాగితే పలు దేశాల్లో విమాన సర్వీసులు ఆగిపోతాయి. ఇప్పటికే అనేక ఎయిర్ లైన్స్ సంస్థలు తమ సర్వీసులను బాగా కుదించేశాయి. చమురు రవాణాను యుద్ధం దెబ్బతీయడంతో విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కొరత పెరుగుతోంది. యూరప్ అయితే మరీ ఐదు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉండటంతో టెన్షన్ పడుతోంది.

తమిళనాడు' లో .. రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము 'సీజ్'.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ... అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. రేపు జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ... భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ ... రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ బృందాలు ... నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

నౌకలపై ఇరాన్ కాల్పులకు కారణాలివి !!
హర్ముజ్ దగ్గర ఇరాన్ ఇవాళ ఫైరింగ్ జరిపిన షిప్పులలో ఒకటి పనామా జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్ కాగా మరొకటి లైబీరియా జెండాతో దుబాయ్ నుంచి గుజరాత్ కు వస్తున్న మన దేశానికి చెందిన కార్గో షిప్. ఇవి జీపీఎస్ తారు మారు చేసి తప్పుదోవ పట్టించి, అనుమతులు లేకుండా ట్రావెల్ చేస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఆ రెండు షిప్పులను ఇరాన్ తీరానికి తరలించింది. ట్రంప్ సీజ్ ఫైర్ పొడిగించినా ఇరాన్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది.

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే యువ నటి మృతి!
యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని తన ఇంట్లో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. TikTok వీడియోలతో పాపులర్ అయిన దివ్యాంక, ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం పట్ల సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు వేల కోసం పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !
పెహల్గాం దాడి గురించి స్థానికులు ఇద్దరికి ముందే తెలిసినా పోలీసులకు చెప్పలేదనే చేదు నిజం బయటపడింది. స్థానికులు బషీర్ అహ్మద్, పర్వేజ్ అహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని దర్యాప్తులో తేలింది.ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులు ఐదు గంటల పాటు వీరి ఇళ్లలో ఉండి ఆపై వెళిపోయారని తేలింది. వారు పంజాబీ, హిందీ భాషలు కలగలిపి మాట్లాడారని, ఆశ్రయం ఇచ్చినందుకు మూడు వేలు ఇచ్చారని అధికారులు తెలిపారు.మరుసటి రోజు పెహల్గాంలో పొదల మాటున దాక్కుని టూరిస్టులను టార్గెట్ చేసారని అధికారులు తెలిపారు.