Latest

మంత్రినే నిలదీసిన మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా ▶
Politics· 22 Apr 2026

మంత్రినే నిలదీసిన మహిళ.. ఆమె ధైర్యానికి నెటిజన్లు ఫిదా

ట్రాఫిక్ రూల్స్ అంటే కేవలం సామాన్యులకేనా? నాయకులకు వర్తించవా? ముంబై వర్లీలో ట్రాఫిక్ జామ్ వల్ల విసిగిపోయిన ఒక మహిళ అడిగిన సూటి ప్రశ్న ఇది! తన బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తుండగా, బీజేపీ నిర్వహించిన 'మహిళా జన్ ఆక్రోష్' ర్యాలీ వల్ల గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఆమెలో అసలైన ఆక్రోశం కట్టలు తెంచుకుంది. నేరుగా మంత్రి గిరీష్ మహాజన్ దగ్గరికే వెళ్లి, "ముందు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి" అంటూ ఆమె నిలదీసిన తీరు చూసి అక్కడి వారంతా షాక్ అయ్యారు. ఈ ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయి వీడియోని వైరల్ చేస్తున్నారు.

ఎక్కడి బస్సులు అక్కడే.. ప్రయాణికుల ఇక్కట్లు
Local· 22 Apr 2026

ఎక్కడి బస్సులు అక్కడే.. ప్రయాణికుల ఇక్కట్లు

తెలంగాణలో బస్సులు డిపోల్లో నిలిచిపోయాయి. బస్సుల్లేక బస్టాండులు బోసిగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి సమ్మెకు దిగారు. డిపోల దగ్గరే ధర్నా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 32 హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దశలవారీగా వారి డిమాండ్లు తీరుస్తామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం
Local· 22 Apr 2026

తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయ ద్వారం

చార్ ధామ్ యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు ఉదయం 8 గంటలకు తెరుచుకున్నాయి. శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసుకునే ఈ ఆలయాన్ని మళ్లీ అక్షయ తృతీయ తర్వాత రెండు మూడు రోజులకి తీస్తారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకి అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదారానాథ్ సందర్శనకి రికార్డు స్థాయిలో 14.5 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కేదారాథ్ లో మహా శివుడి దర్శనం కోసమే ఏకంగా 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు ఇక లేరు
Politics· 22 Apr 2026

టాలీవుడ్ నిర్మాత చిట్టిబాబు ఇక లేరు

టాలీవుడ్ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (70) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. పలు చిత్రాలు నిర్మించడమే కాకుండా కేరక్టర్ ఆర్టిస్ట్, కామెడీ రోల్స్ లో నటించారు కూడా. రీసెంట్ గా జాంబిరెడ్డి మూవీలో నటించారు. యూ ట్యూబ్ ఛానెల్స్ లో ఎనలిస్ట్ గా చిట్టిబాబు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
World· 22 Apr 2026

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణను మరోసారి పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ వైపు నుంచి ప్రతిపాదనలు అంది చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకు ఈ విరామం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్ పోర్టుల దిగ్భంధనం కొనసాగుతుందని చెప్పారు. ఏ క్షణాన అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తుందన్న భయంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు ఈ ప్రకటన కాస్త రిలీఫే.

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత
Local· 22 Apr 2026

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. మే 1 నుంచి 31 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి కావాలని జీవో నెంబర్ 38 జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్న వాళ్లని బదిలీ చేయనున్నారు. ఎవరైనా బదిలీ కోరుకుంటే కంటిన్యూస్ గా మూడేళ్లు ఒకే చోట పని చేసి ఉండాలి. ఉద్యోగులు బదిలీల ఉత్తర్వులు అందుకున్న తర్వాత మూడు రోజుల్లోగా కొత్త చోట జాయిన్ కావాల్సి ఉంటుంది. జనగణన వర్క్ లో ఉన్న ఉద్యోగులకు మాత్రం బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది.

 బాయ్ ఫ్రెండ్ ను తగుల బెట్టేసిన ప్రియురాలు.!!
Crime· 22 Apr 2026

బాయ్ ఫ్రెండ్ ను తగుల బెట్టేసిన ప్రియురాలు.!!

బెంగళూరులో ఒక ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ (27) అనే యువతి తన ప్రియుడు కిరణ్ తనను దూరం పెడుతున్నాడనే అనుమానంతో అతడిని హత్య చేసింది. "వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్" పేరుతో కిరణ్ కాళ్లు, చేతులు కట్టేసి, ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. తీవ్రంగా గాయపడిన కిరణ్ మృతి చెందాడు. పోలీసులు దీనిని పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు... అయినా సమ్మె ఆగదు...
Local· 21 Apr 2026

ఆర్టీసీపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు... అయినా సమ్మె ఆగదు...

తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయినా ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీసమ్మె మొదలు అవుతుందని ఉద్యోగులు తెలిపారు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇంకా చేయకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం, వారి ప్రధాన డిమాండ్లు. ప్రభుత్వం స్పందించి నలుగురు సభ్యుల హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా సమ్మె యధాతధంగా కొనసాగుతుందని ఉద్యోగులు అంటున్నారు.

కర్నూలులో భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ !!
Local· 21 Apr 2026

కర్నూలులో భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ !!

ఏపీలోని కర్నూలులో భారీ సోలర్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.2,400 ఎకరాల విస్తీర్ణంలో రెండు భాగాలుగా ఈ ప్లాంట్ ను ఆపరేట్ చేస్తారు. మొత్తం 600 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంట్ ను చెరి మూడు వందల యూనిట్ల చొప్పున రెండు యూనిట్లుగా పనిచేయిస్తారు.12 లక్షల TOPCon బైఫేషియల్ సోలార్ మాడ్యూల్స్ తో ప్లాంట్ పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ 25 ఏళ్లు కొనసాగుతుంది. మొత్తం 11 లక్షల టన్నుల కర్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. గ్రీన్ ఎనర్జీకి దోహద పడుతుంది.

చరణ్ ఫ్యాన్స్‌కు ‘పెద్ది’ షూటింగ్ అప్‌డేట్ ..
Entertainment· 21 Apr 2026

చరణ్ ఫ్యాన్స్‌కు ‘పెద్ది’ షూటింగ్ అప్‌డేట్ ..

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ మరో ఆరు రోజుల్లో పూర్తి కానుంది అని డైరెక్టర్ మూవీ సెట్‌లో తనతో కలిసి చరణ్ తీసిన సెల్ఫీని ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూ మూవీ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

కుక్కల దాడులపై కలెక్టర్లకు నోటీసులు!
Crime· 21 Apr 2026

కుక్కల దాడులపై కలెక్టర్లకు నోటీసులు!

వీధి కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో జరిగిన దాడులపై Su Motoగా విచారణ చేపట్టింది. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై నివేదిక కోరింది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు భంగం కలిగిందని పేర్కొంటూ, జూన్ 2 లోపు పూర్తి వివరాలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.

ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని !!
Local· 21 Apr 2026

ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని !!

కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం మొదలైంది. జొన్నగిరిలో598 హెక్టార్లలో 13 టన్నుల విలువైన బంగారు నిక్షేపాలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. 2027 నాటికి కనీసం 600 కిలోల బంగారాన్ని తవ్వి తీయాలని నిర్ణయించారు. జియోమైసూర్ సర్వీసెస్ సంస్థ ఈ తవ్వకాలు చేపడుతుంది. ప్రాజెక్టు కాలం 15 ఏళ్లు. యేటా వెయ్యి కిలోల వార్షిక ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ గనులన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. తొలిసారిగా ఈ గని నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు ఇచ్చారు.

మహిళా బిల్లుపై ఎంపి పప్పు యాదవ్ అనుచిత కామెంట్లు !!
Politics· 21 Apr 2026

మహిళా బిల్లుపై ఎంపి పప్పు యాదవ్ అనుచిత కామెంట్లు !!

ఆడవాళ్ల పొలిటికల్ కెరీర్ మగవాడి గదులనుంచే మొదలవు తాయని బీహార్ ఎంపీ పప్పు యాదవ్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపధ్యంలో పప్పు యాదవ్ ఈ కామెంట్లు చేశారు. మహిళలు రాజకీయంగా ఎదగాలంటే కొంతటైమ్ మగవారితో గడపక తప్పదని, రాజకీయాలు అంతలా కలుషితం అయిపోయాయని అన్నారు.పప్పు యాదవ్ కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగుతుం డటంతో బీజేపి ఇది కాంగ్రెస్ మైండ్ సెట్ అంటూ విమర్శలు చేసింది.

విజయ్ ఎమోషనల్ రిక్వెస్ట్..▶
Politics· 21 Apr 2026

విజయ్ ఎమోషనల్ రిక్వెస్ట్..

TVK పార్టీ అధినేత విజయ్ ఓటర్లకు ఒక ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. ప్రజలు ఎక్కడున్నా సరే, తమ ప్రాంతానికి వచ్చి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. తన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఓటు కీలకమని ఆయన పేర్కొన్నారు. విజయ్ చేసిన ఈ ఎమోషనల్ అప్పీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

కేదార్ నాథ్ లో మొబైల్ ఫోన్ల నిషేధం...
Local· 21 Apr 2026

కేదార్ నాథ్ లో మొబైల్ ఫోన్ల నిషేధం...

కేదార్ నాధ్ ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించారు. కొండపై వీడియోలు, ఫోటో షూట్స్, రీల్స్ ఇక ఎంత మాత్రం అనుమతించబోమని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు ఆలయ పరిసరాల్లోకి వచ్చే ముందే తమ మొబైల్స్ ను బయటే డిపాజిట్ చేయాలని కోరింది. కొండపై మొబైల్స్ అనుమతి వల్ల దర్శనాలకు భంగం కలుగుతోందని, ఆధ్యాత్మికత తగ్గుతోందని ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఈనిర్ణయాన్ని ఇంటర్నెట్ యూజర్స్ సమర్ధించారు.

TVK పార్టీ నేత విజయ్: అవును, నేను ఆక్టర్ నే▶
Politics· 21 Apr 2026

TVK పార్టీ నేత విజయ్: అవును, నేను ఆక్టర్ నే

తనను ఆక్టర్ అని విమర్శిస్తున్న వారికి TVK పార్టీ నేత విజయ్ గట్టి సమాధానం ఇచ్చారు. అవును, నేను ఆక్టర్ నే. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పుడూ నటించలేదు అని స్పష్టం చేశారు. పాలిటిక్స్‌లో అసలైన డ్రామాలు చేస్తోంది తన విమర్శకులేనంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని, రాజకీయాల్లో నటనకు తావులేదని విజయ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చైనానుంచి ఇరాన్ కు  వెపన్ కెమికల్స్  రవాణా?
World· 21 Apr 2026

చైనానుంచి ఇరాన్ కు వెపన్ కెమికల్స్ రవాణా?

అమెరికా ఆంక్షల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో తమ నౌకాదళం స్వాధీనం చేసుకున్న ఇరాన్ ఓడ 'టౌస్కా', చైనా నుండి క్షిపణి తయారీకి అవసరమైన రసాయనాలను తరలిస్తోందని నిక్కీ హేలీ ఆరోపించారు. ఇరాన్ ప్రభుత్వానికి చైనా మద్దతు ఇస్తోందని, ఈ వాస్తవాన్ని విస్మరించలేమని ఆమె హెచ్చరించారు. మరోవైపు, అమెరికా చర్యను 'సాయుధ సముద్రపు దొంగతనం'గా అభివర్ణించిన ఇరాన్, దిగ్బంధనం ఎత్తివేసే వరకు శాంతి చర్చలకు రాబోమని స్పష్టం చేసింది.

మౌత్‌వాష్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే!
Health· 21 Apr 2026

మౌత్‌వాష్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే!

మౌత్‌వాష్‌ను అధికంగా వాడటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మన నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియాను ఇవి నశింపజేయడం వల్ల రక్తపోటు పెరుగుతుందట. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, ఏడాదికి ఒకసారి డెంటల్ చెక్అప్ చేయించుకోవడం మంచిది. వైద్యుల సలహా లేకుండా అతిగా మౌత్‌వాష్ వాడటం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

ఒక్క రాత్రిలో 1700 మంది ప్రాణం తీసిన  సరస్సు
World· 21 Apr 2026

ఒక్క రాత్రిలో 1700 మంది ప్రాణం తీసిన సరస్సు

ఆఫ్రికాలో ఓ సరస్సు ఒక్క రాత్రిలో 1700 మందిని హత్య చేసిందని ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. వాయవ్య కామెరూన్ లో నియోస్ అనే సరస్సు రాత్రికి రాత్రి మూడు లక్షల టన్నుల కార్బన్ డైయాక్సైడ్ రిలీజ్ చేయడంతో సమీపంలో ప్రజలు, జంతుజాలం అంతా ప్రాణాలొదిలారని తెలిపింది. ఆ సరస్సులో రాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయని, చూస్తుండగానే పెద్ద నురగ అంతెత్తున లేచి ఆ ప్రాంతాన్ని కమ్మేసిందని. జనం ఊపిరాడక మరణించారని ఆ వైరల్ పోస్ట్ తెలిపింది.1986 ఆగస్టు 21న ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారులు!▶
Motivational· 21 Apr 2026

లిఫ్ట్‌లో చిక్కుకున్న చిన్నారులు!

లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడం డోర్లు తెరుచుకోకపోవడంతో ఇద్దరు చిన్నపిల్లలు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక యువతి ఏమాత్రం కంగారు పడకుండా, అద్భుతమైన ధైర్యంతో ఆ పిల్లలను కాపాడింది. ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారులను సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ Rescue Video చూసిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం.

మోడీ ఓ టెర్రరిస్టు... తూచ్‌ నేనలా అనలేదు ఃఖర్గే
Politics· 21 Apr 2026

మోడీ ఓ టెర్రరిస్టు... తూచ్‌ నేనలా అనలేదు ఃఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని కామెంట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్దుకుని ఆయన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తాను ప్రధానిని టెర్రరిస్టు అనలేదని అన్నారు. అయితే బిజెపి అప్పటికే కాంగ్రెస్ కామెంట్లను ఖండించింది.కాంగ్రెస్ అర్బన్ నక్సల్ పార్టీ అని విమర్శించింది. తమిళనాట ఎన్నికల్లో అన్నా డిఎంకె పార్టీ బీజేపితో జత కట్టడాన్ని ఖర్గే ప్రశ్నించారు. అన్నాదురై ఫోటో పెట్టుకుని మోడీతో ఎలా జతకడతారు. ఆయనో పెద్ద టెర్రరిస్టు అని కామెంట్ చేశారు ఖర్గే.