← Back to news

ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ ఆఫర్!

By sahani· 18 Jun 2026· X· India
ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ ఆఫర్!

ఇండియన్ క్రికెట్ నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ వెసులుబాటు కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్‌తో పాటు అతడి తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారి ట్రావెల్, వసతి ఖర్చులన్నీ బోర్డే భరించనుంది. IPLలో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్, విదేశాల్లో తన తల్లిదండ్రులతో కంఫర్ట్‌గా ఉండేందుకే ఈ స్పెషల్ నిర్ణయం తీసుకున్నట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు.

More in Sports