గర్బా ఈవెంట్‌లో BJP నేతపై POCSO
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో BJP మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్‌పై POCSO చట్టం కింద కేసు నమోదైంది. అక్టోబర్ 15న కంకేశ్వరి గర్బా ఉత్సవ్‌లోకి ప్రవేశించే విషయంలో 15 ఏళ్ల బాలికతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమెను బయటకు తోసి పంపించాడని ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక ఫిర్యాదు మేరకు హీరా నగర్ పోలీసులు POCSO చట్టం, BNS సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటివరకు ఆయనను అరెస్టు చేయలేదని సమాచారం.


