← Back to news

ప్లాస్టిక్ ఎగ్స్‌పై FSSAI క్లారిటీ!

By Mahesh· 28 Sept 2026· FSSAI
ప్లాస్టిక్ ఎగ్స్‌పై FSSAI క్లారిటీ!

ప్లాస్టిక్ ఎగ్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌ను నమ్మొద్దని FSSAI హెచ్చరించింది. గుడ్డు పచ్చసొన, తెల్లసొన కలవడం లేదా పెంకు డ్రైగా మారడం.. అది ప్లాస్టిక్ గుడ్డు అని అర్థం కాదని క్లారిటీ ఇచ్చింది. గుడ్డు ఫ్రెష్‌గా ఉందో లేదో తెలుసుకునేందుకు వాటర్ టెస్ట్ చేయొచ్చని తెలిపింది. ఫ్రెష్ ఎగ్ నీటిలో అడుగున ఫ్లాట్‌గా ఉంటుందని పాత గుడ్డు నిటారుగా నిలబడొచ్చు లేదా తేలొచ్చు. ఫుడ్‌కు సంబంధించిన రూమర్స్ కాకుండా వెరిఫైడ్ సోర్సులను నమ్మాలని సూచించింది.

More in Infotainment