సూర్యుడికున్నంత శక్తిని తయారు చేసేందుకు ట్రయల్

చైనా రూపొందించిన ‘ఈస్ట్’ రియాక్టర్ సూర్యుడికున్నంత శక్తిని తయారు చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో గాలిని కోట్ల డిగ్రీల వేడికి తీసుకెళ్లి అదుపులో ఉంచుతున్నారు. 12 కోట్ల డిగ్రీల వేడిలో 101 సెకన్ల పాటు, మరోసారి 16 కోట్ల డిగ్రీల వేడిని సాధించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో తక్కువ కాలుష్యంతో విద్యుత్ తయారు చేసే అవకాశం ఉంది. 2030 నాటికి విద్యుత్ తయారీకి ఉపయోగపడేలా ఈ టెక్నాలజీని సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.



