← Back to news

గిద్దలూరులో చిరుత ఉంది..అలెర్ట్..!

By syed· 52m ago
గిద్దలూరులో చిరుత ఉంది..అలెర్ట్..!

ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని దిగువమెట్ట, ప్రతాప్‌రెడ్డి కాలనీ, పెద్దచెరువు, జయరాపురం, జయరాపురం తండా, ఎల్లుపల్లి, ఉప్పలపాడు, అంబవరం గ్రామాల పరిసర రిజర్వు ఫారెస్ట్‌లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ఈ ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపలాదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రిజర్వు ఫారెస్ట్‌లోకి ప్రవేశించకూడదు. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా సంచరించకూడదన్నారు. చిరుత కనిపించినా, ఆనవాళ్లు గుర్తించినా వెంటనే సమీప అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.

More in Local