← Back to news

రామగుండంలో కార్పొరేటర్ల ధర్నా!

By Sagar· 40m ago· Ramagundam, Ramagundam, Peddapalli
రామగుండంలో కార్పొరేటర్ల ధర్నా!

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్.. తన డివిజన్ పెండింగ్ సమస్యలపై కమిషనర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీని కలిసేందుకు వెళ్లారు. కానీ అటెండర్ ద్వారా బయటకు పంపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ ఎదుట రాత్రి 8pmకి ధర్నాకు దిగారు. అధికార పార్టీ కార్పొరేటర్లతో పాటు ప్రతిపక్ష కార్పొరేటర్లు సైతం ధర్నాలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

More in Local