రేపటి నుంచి తిరుపతి జిల్లాలో CM పర్యటన

AP: రేపటి నుంచి 2 రోజుల పాటు తిరుపతి జిల్లాలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు అందించనున్నారు. ఎల్లుండి తిరుమల VQC-1లో పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. గోగర్భం డ్యామ్ వద్ద EV బస్సులను మొదలు కానుంది. తిరుమలలోని SV మ్యూజియాన్ని కూడా మళ్లీ మొదలుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి, పర్యావరణ అనుకూల రవాణా తదితర అంశాలపై ఫోకస్ చేయనున్నారు.



