పిల్లలకు పొదుపు పాఠాలు..ఇలా!

పిల్లలకు చిన్నప్పటినుంచే పొదుపు, డబ్బు విలువ నేర్పించాలని ఆర్దిక నిపుణుడు ఒలివియ.ఎస్.మిచెల్ సూచిస్తున్నారు. అందుకోసం పిగ్గీ బ్యాంక్‌లో డబ్బు దాచే అలవాటు చేయాలంటున్నారు. పోస్టాఫీస్ లేదా బ్యాంకులో అకౌంట్ తెరిచి వడ్డీ, పొదుపు ప్రయోజనాలను వివరించాలని చెప్పారు. కొంత పాకెట్ మనీ ఇచ్చి, దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నారో నోట్‌బుక్‌లో రాయించాలన్నారు. వీకెండ్‌లో ఖర్చులను చూసి, వృథా ఖర్చులపై తిట్టకుండా అవగాహన కల్పిస్తే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని చెప్తున్నారు.


