నాసిక్ నుంచి ముంబైకి 28న ఆదివాసీల మార్చ్

మహారాష్ట్రలో ఆదివాసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ విద్యార్థులు, కార్యకర్తలు లాంగ్ మార్చ్‌కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 28న నాసిక్ నుంచి ముంబైకి మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రతకు హామీ ఇవ్వాలని, ఆశ్రమ పాఠశాలల్లో వేధింపులపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరుతున్నారు. సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యలో విరాళాల విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.



