← Back to news

టీ తోటలో ఓ చిల్ ట్రిప్!

By Nani Eluri· 4 Oct 2026· Livemint
టీ తోటలో ఓ చిల్ ట్రిప్!

కేరళలోని వయనాడ్ అంటే కొండలు, పచ్చని ప్రకృతి గుర్తొస్తాయి. ఇప్పుడు అక్కడి ప్రియదర్శిని టీ ఎస్టేట్ కూడా టూరిస్టులను ఆకట్టుకుంటోంది. దాదాపు 1,000 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్‌లో సగం ప్రాంతంలో టీ సాగు చేస్తున్నారు. మిగతా ప్రాంతాన్ని సహజంగానే ఉంచారు. ఇక్కడ టీ ఎలా తయారవుతుందో దగ్గరగా చూసే అవకాశం, కేఫ్‌, రెస్టారెంట్‌, అడ్వెంచర్ యాక్టివిటీస్‌ కూడా ఉన్నాయి. ప్రకృతి మధ్య టీ తోటల అనుభూతితో పాటు, స్థానిక గిరిజన సంస్కృతిని తెలుసుకునేలా హెరిటేజ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More in Infotainment