ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నవాళ్లు ప్రిగ్నెంట్ అయితే !

మయోసైటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరని వైద్య నిపుణులు చెప్తున్నారు. వ్యాధి తీవ్రత కనీసం 6 నెలల పాటు అదుపులో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. గర్భం దాల్చడానికి ముందే రుమటాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదించి, వాడుతున్న మందుల్లో పిండానికి హాని చేయని మార్పులు చేయించుకోవాలి. ఇలాంటి కేసులను 'హై-రిస్క్'గా పరిగణిస్తారు కాబట్టి, క్రమం తప్పకుండా చెకప్స్ చేయించు కుంటూ, బీపీ మరియు శిశువు ఎదుగుదలను నిరంతరం చెక్ చేయించుకోవాలి.



