← Back to news

TET పాసైన వారికి గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే పోస్టులు!

By Mahesh· 16 Aug 2026· AP
TET పాసైన వారికి గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే పోస్టులు!

AP: TET పాసైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌ (విద్యా వాలంటీర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 3,597 SGT, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. SGTలకు నెలకు రూ.10,000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 జీతం ఇస్తారు. ఈనెల 21లోగా సంబంధిత MEO ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయినవారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

More in Jobs