← Back to news

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దిశగా ప్రయత్నాలు

By Nani Garikina· 10h ago· Reuters
ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు దిశగా  ప్రయత్నాలు

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధానికి ఎండ్‌ కార్డ్‌ పడుతుందా? మళ్లీ శాంతి చర్చలకు కదలిక మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతినిధులు స్టీవ్‌ విట్‌కాఫ్‌, జారెడ్‌ కుష్నర్‌ త్వరలో కీవ్‌, మాస్కోలో పర్యటించనున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇప్పటికే సమావేశాలకు తేదీలు ఫిక్స్‌ అయ్యాయని చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కూడా శాంతి ఒప్పందానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ఈ చర్చలు నిజంగా యుద్ధానికి ముగింపు తీసుకొస్తాయా అనేది ఆసక్తిగా మారింది.

More in International