గవర్నమెంట్ ఎంప్లాయ్స్‌కి సుప్రీం షాక్

లంచం అడగడం పక్కా క్రిమినల్ యాక్ట్ అని, దానికి అఫీషియల్ డ్యూటీతో ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చిచెప్పింది. కేవలం అధికారిక నిర్ణయాలు, సిఫార్సులకే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ₹1.5 లక్షల లంచం కేసులో రాజస్థాన్ కానిస్టేబుల్ తేజారామ్ అప్పీల్‌ను జస్టిస్ SVN భట్టి ధర్మాసనం కొట్టేస్తూ, లంచం డిమాండ్ లాంటి చర్యలకు చట్టం నుండి రక్షణ ఉండదని కీలక అప్‌డేట్ ఇచ్చింది.



