ప్రియురాలి హత్య.. ఆపై హీటర్‌తో శవాన్ని కాల్చేశాడు

పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందనే కోపంతో ఓ వ్యక్తి తన ప్రియురాలను దారుణంగా హత్య చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన జావేద్‌కు పెళ్లయ్యింది. మరో మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడు. భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె జావేద్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ఈ విషయమై వాళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోపంతో ఆమెను హత్య చేసిన జావేద్ రూమ్ హీటర్‌ను ఉపయోగించి ఆమె శరీరాన్ని దహనం చేశాడు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.



