← Back to news

డెలివరీ బైక్‌‌‌పై వచ్చి.. లాయర్‌ను కాల్చారు.

By Sharmila Skk· 1h ago· Newindianexpress
డెలివరీ బైక్‌‌‌పై వచ్చి.. లాయర్‌ను కాల్చారు.

బెంగుళూరు యశ్వంతపురలోని పట్టందూరు అగ్రహారలో లాయర్ మంజునాథ్ (42) దారుణ హత్యకు గురయ్యారు. స్విగ్గీ డెలివరీ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయన ఇంటి తలుపు తట్టి, బయటకు వచ్చిన మంజునాథ్‌పై కాల్పులు జరిపారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తన భూమిలోని షెడ్‌కు మూడు నెలలుగా అద్దె చెల్లించని వ్యక్తితో ఆయనకు గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ గొడవే హత్యకు కారణమా అనే కోణంలో ఎంక్వయిరీ చేస్తున్నారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

More in National