ఢిల్లీకి చంద్రబాబు.. కీలక ప్రాజెక్టులపై PM మోడీతో చర్చ!

AP: CM చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి APకి సంబంధించిన కీలక అంశాలపై డిస్కస్ చేయనున్నారు. విశాఖ మెట్రో, బీచ్ కారిడార్, నదుల అనుసంధానం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అప్రూవల్ కోరనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై స్పెషల్ ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అడగనున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు కేంద్ర సహాయం, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై కూడా చర్చించనున్నారు.



